ఈ కారును హాయిగా కొనచ్చు.. లోపల కూర్చున్న వారికి ఫుల్ సేఫ్టీ ఇచ్చే మోడల్! క్రాష్ టెస్ట్‌‌లో 5 స్టార్

టాటా మోటార్స్(Tata Motors) నుండి కొత్త కార్లను కొనుగోలు చేసే విషయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే అంశం భద్రత. అందుకే టాటా మోడళ్లు వినియోగదారులలో ఒక ప్రత్యేకమైన నమ్మకాన్ని కలిగించాయి. వీటిలో టాటా ఆల్ట్రోజ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారత మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. స్టైలిష్ డిజైన్, ఫీచర్లు మాత్రమే కాకుండా, భద్రత పరంగా కూడా ఆల్ట్రోజ్ ఎప్పుడూ ఒక బెంచ్‌మార్క్‌గా గుర్తించబడింది. ఇటీవలే దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్‌డేటెడ్ లుక్, కొత్త ఫీచర్లు, మరింత బలమైన క్వాలిటీతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఇంతలోనే, భారత్ NCAP నిర్వహించిన తాజా క్రాష్ టెస్ట్ ఫలితాలు వెలువడటం ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌కు మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రాష్ టెస్ట్‌లో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. పెద్దల రక్షణ విభాగంలో ఇది 32 పాయింట్లలో 29.65 పాయింట్లు పొందగా, పిల్లల భద్రత విభాగంలో 49 పాయింట్లలో 44.90 పాయింట్లు సాధించింది.

Tata Altroz Facelift Received 5 Star Safety Rating In Bncap Details

ఇవి అత్యుత్తమ స్కోర్లు అని చెప్పుకోవచ్చు. ఫలితంగా, భారత్ NCAP ఈ మోడల్‌కు సమగ్రంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ప్రకటించింది. ఇది టాటా మోటార్స్‌కు గర్వకారణం మాత్రమే కాకుండా, భారతీయ వినియోగదారుల కోసం ఒక భరోసా కూడా. ఆల్ట్రోజ్ ఇప్పటికే గతంలో గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి తన భద్రతా ప్రమాణాలను నిరూపించుకుంది.

ఇప్పుడు భారత్ NCAP నుండి వచ్చిన ఈ కొత్త రేటింగ్, దాని భద్రతా సామర్థ్యాన్ని మరింత బలపరిచింది. ఆల్ట్రోజ్ భద్రతను అందిస్తూ, భరోసా కలిగించే కారు అనే ముద్రను బలపరిచింది. భారత్ NCAP తాజాగా విడుదల చేసిన క్రాష్ టెస్ట్ ఫలితాల్లో, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఈ కారు 16 పాయింట్లలో 15.55 పాయింట్లు సాధించింది.

Tata Altroz Facelift Received 5 Star Safety Rating In Bncap Details

ఈ ఫలితాలు డ్రైవర్‌కు అత్యంత కీలకమైన భాగాలకు ఆల్ట్రోజ్ మంచి రక్షణను అందిస్తోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా టిబియాస్ ప్రాంతంలో తగిన రక్షణ లభించిందని నివేదిక చెబుతోంది. అయితే, కో-డ్రైవర్ సీటు విషయానికి వస్తే, అన్ని కీలక భాగాల్లో మంచి రక్షణ అందినప్పటికీ కుడి టిబియా మాత్రం కొంచెం బలహీనంగా రక్షించబడినట్లు తేలింది. సైడ్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఆల్ట్రోజ్ ప్రయాణీకుల తల, పెల్విస్ ప్రాంతాలకు మంచి రక్షణను అందించింది.

అయినప్పటికీ, ఛాతీ రక్షణ మాత్రం ఈ టెస్ట్‌లో కొంత పేలవంగా ఉందని నివేదికలో స్పష్టంచేసింది. అంటే, సైడ్ ఇంపాక్ట్ సమయంలో ప్రయాణీకుల ఛాతీ రక్షణను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది. ఇక సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో ఆల్ట్రోజ్ తన బలమైన నిర్మాణాన్ని నిరూపించింది. ఈ పరీక్షలో కారుకు పెద్దగా లోపాలు కనిపించకపోవడంతో, BNCAP ఆల్ట్రోజ్ పనితీరును సంతృప్తికరంగా రేటింగ్ చేసింది.

Tata Altroz Facelift Received 5 Star Safety Rating In Bncap Details

మొత్తానికి, టాటా ఆల్ట్రోజ్ క్రాష్ టెస్ట్ ఫలితాలు ఈ మోడల్ భద్రతా ప్రమాణాలు ఎంత బలంగా ఉన్నాయో చూపించాయి. కొన్ని చిన్న ప్రాంతాల్లో మెరుగుదలకు అవకాశం ఉన్నా, మొత్తంగా ఆల్ట్రోజ్ డ్రైవర్, ప్రయాణీకుల రక్షణలో అత్యుత్తమ ఫలితాలను సాధించి తన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సమర్థంగా నిలబెట్టుకుంది.

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6.89 లక్షల నుండి రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీని CNG వెర్షన్ 26.90 కిమీ/కిమీ, డీజిల్ 23.60 కిమీ/కిమీ, పెట్రోల్ వేరియంట్లు 19.33 కిమీ/లీ వరకు మైలేజీని చేస్తాయి. ఇది మైలేజ్ పరంగా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2025, 13:59 [IST]
English summary
Tata altroz facelift received 5 star safety rating in bncap details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+