రతన్ టాటా కంపెనీ నుంచి వచ్చిన అద్భుతమైన కారును కొనడానికి ఆసక్తి చూపించని జనం!
భారతదేశపు ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన టాటా ఆల్ట్రోజ్ (Altroz) భారత మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అయితే, మే 2025 అమ్మకాల దృష్టిలో చూస్తే ఈ మోడల్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ మే 2025లో కేవలం 2,779 ఆల్ట్రోజ్ యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 4,983 కార్ల అమ్మకాలతో పోల్చుకుంటే 2,204 యూనిట్లు తక్కువ. ఈ మేరకు ఆల్ట్రోజ్ అమ్మకాల్లో దాదాపు 44 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతానికి అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికి రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం కూడా ఉంది, మే 22న టాటా ఆల్ట్రోజ్ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను టాటా మోటార్స్ అధికారికంగా ప్రారంభించింది. ఈ అప్‌డేట్ అయిన మోడల్ కోసం బుకింగ్‌లు జూన్ 2 నుండి ప్రారంభమయ్యాయి. కొత్త మోడల్ మార్కెట్లోకి రానున్న సమయంలో కస్టమర్లు కొత్త వెర్షన్ కోసం ఎదురుచూడటంతో పాత మోడల్ అమ్మకాలు సహజంగానే తగ్గిపోతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే, రాబోయే నెలల్లో ఆల్ట్రోజ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ పాత వర్షన్‌తో పోలిస్తే ఎన్నో మార్పులతో మెరుగుపడింది. కొత్త మోడల్ రూపకల్పన మరింత లేటెస్ట్‌గా, ఆకర్షణీయంగా మారింది. దీనిలో కొత్త ఫీచర్లను కూడా జోడించారు. కొత్త అప్‌డేట్స్ కారణంగా పాత మోడల్ కొనుగోలు చేయాలనుకున్న వారు తమ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయడం ప్రారంభించారు.ఇది మే 2025లో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాల్లో 44 శాతం తగ్గుదలకు ప్రధాన కారణం.
ఇక తాజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ.6.89 లక్షలుగా నిర్ణయించారు (ఎక్స్-షోరూమ్). ఈ ధరకు ఈ కారులో లభిస్తున్న సాంకేతికత నిజంగా ఆకట్టుకుంటుంది. కారు ఇంటీరియర్‌లో చాలా అడ్వాన్స్‌డు ఆప్షన్లను అందించారు. లోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అలాగే అదే సైజులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ప్రీమియం కార్ల స్థాయిని సూచిస్తున్నాయి.

ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లలో సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, ఆటోమేటిక్ విండ్షీల్డ్ వైపర్లు, అలాగే 8 స్పీకర్ల హర్మాన్ ఆడియో సిస్టమ్ లాంటి లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, మోడరన్‌గా మార్చే అంశాలు. అయితే ఈ ఫీచర్ల అందుబాటులో వేరియంట్ ఆధారిత తేడాలు ఉండే అవకాశముందని గమనించాలి.
అయితే, కొన్ని ముఖ్యమైన భద్రతా లక్షణాలు మాత్రం అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తాయి. వాటిలో ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సేఫ్టీకి ఎంతో ముఖ్యమైన అంశాలు. గతంలో ఈ సెగ్మెంట్ కార్లలో ఇలాంటి భద్రతా ఫీచర్లు ప్రీమియం వేరియంట్లకే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు టాటా మోటార్స్ అన్ని వేరియంట్లలోనూ ఈ అంశాలను అందించడం ద్వారా వినియోగదారులకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తోంది.

2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందించబడుతున్న ఫీచర్లు, ఇందులో ఉన్న సురక్షితత ప్రమాణాలు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను తన సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. కొత్త మోడల్ రూపకల్పనలోనే కాదు, ఇంటీరియర్, సాంకేతికంగా కూడా గణనీయమైన అభివృద్ధిని పొందింది. ఇవి చూస్తుంటే, టాటా ఆల్ట్రోజ్ పాత మోడల్ విక్రయాలు తాత్కాలికంగా తగ్గినా, ఈ కొత్త మోడల్ ఆల్ట్రోజ్ అమ్మకాలకు తిరిగి ఉత్సాహం నింపే అవకాశం ఖచ్చితంగా ఉంది.


Click it and Unblock the Notifications








