తక్కువ ధరలో, ఎక్కువ మైలేజీ ఇచ్చే డీజీల్‌ కారు ఇదే.. మీ ఖర్చులకు ‘టాటా’ చెప్పండి!

కారు అంటే ఒకప్పుడు ధనవంతులకే సొంతం. కానీ ఇప్పుడు అది ఇంటింటి ప్రయాణ సాధనం. ఆఫీస్‌కి వెళ్లాలన్నా.. ఏ ఆదివారం పూటో ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్లాలన్నా కారు తప్పనిసరి. అంతలా.. అందరి జీవితాల్లో భాగమైపోయింది. కారులో ప్రయాణించడం ఓకే.. కానీ, దాన్ని మెయింటైన్ చేయడమే ఒకింత రిస్కు అని ఫీల్ అవుతుంటారు చాలామంది. అసలే రోజురోజుకీ ఫ్యూయల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే... తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావాలనే కోరుకుంటారు. అలాంటి వారి కోసం టాటా ఆల్ట్రోజ్ మోడల్ కారు.. పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది దేశంలోనే అత్యంత తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే డీజిల్ కారుగా పేరుపొందింది. దాని విశేషాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ కారు మోడల్ ధర రూ. 6.50 లక్షల నుంచి మొదలవుతుంది. దీని టాప్-ఎండ్ మోడల్ కారు ధర రూ.11.16 లక్షలుగా ఉంది. ఇక ఇందులో డీజిల్ వేరియంట్ అయితే రూ.8.70 లక్షలతో అందుబాటులో ఉంది. ఈ డీజిల్ వేరియంట్.. 345 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. మొత్తంగా చూస్తే ఆల్ట్రోజ్ కారు 26కి పైగా వేరియంట్లలో లభిస్తుంది.

Tata Altroz Racer Diesel Car Mileage

ఇందులో XE, XZ+ వేరియంట్లు డీజిల్ ఇంజిన్‌తో వస్తాయి. ఇక టాటా ఆల్ట్రోజ్ డీజిల్ ఇంజిన్ గమనిస్తే... ఇది 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 90PS పవర్, 200 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ ద్వారా ఒక్క లీటర్ డీజిల్‌తో ఏకంగా 23.64 kmpl మైలేజీ లభిస్తుంది.

సేఫ్టీ విషయంలోనూ టాటా ఆల్ట్రోజ్ ఏమాత్రం తీసిపోదు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంట్లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు ఈ కారు సేఫ్టీ కిట్‌లో ఉన్నాయి. అందువల్ల ఈ కారుకి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ పొందింది.

Tata Altroz Racer Diesel Version Price

దీని ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ కారు డ్రైవర్ సీట్ హైట్- అడ్జస్టబుల్‌ చేసుకోవచ్చు. లెదర్ స్టీరింగ్ వీల్, లెదరెట్‌ సీట్లతో ఇది వస్తుంది. అంతేకాకుండా ఇందులో పవర్ విండోస్,‌ అడ్జస్టబుల్ హెడ్‌లైట్స్‌, ఫాగ్ ల్యాంప్స్‌ (ఫ్రంట్ అండ్ రియర్), అలాగే ఒక రియర్ డీఫాగర్ కూడా ఉంటాయి.

ఇది 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్ రూఫ్ యాంబియెంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలతో లభిస్తుంది. తక్కువ ధరలో అట్రాక్టివ్ ఫీచర్లతో లభించే కారు టాటా ఆల్ట్రోజ్ మాత్రమే అని చెప్పొచ్చు. ఇన్ని ఫీచర్లతో లభిస్తున్న ఈ డీజిల్ వేరియంట్ కారు రూ.8.70 లక్షలకే లభించడం విశేషం.

Tata Altroz Racer Variants

ఇంజిన్ ఆప్షన్లు: టాటా ఆల్ట్రోజ్ 1.2 లీటర్ NA పెట్రోల్, 1.2 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అన్ని ఇంజిన్ ఆప్షన్లకు సరిపడేలా 5 స్పీడ్ MT ఇందులో ఉంటుంది. ఇది ఐదు మోనోటోన్ కలర్‌ (Downtown Red, Arcade Grey, Avenue White, Opera Blue and Cosmic Dark) ఆప్షన్స్‌తో లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 4, 2025, 14:28 [IST]
English summary
Tata altroz racer lowest price diesel car with highest mileage check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+