ఈ కారుపై భారీ అంచనాలు.. కరెక్ట్ టైంలో టాటా తన ఆయుధాన్ని మార్కెట్లోకి దింపబోతుంది!

టాటా మోటార్స్ (tata motors) ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. నెక్సాన్ EV, టియాగో EV, టిగోర్ EV వంటి మోడళ్లతో ఇప్పటికే బలమైన పునాదిని వేసుకున్న ఈ కంపెనీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా గుర్తించింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్ద స్థాయిలో తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు టాటా మోటార్స్ వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా 2026 ఏడాదిని టాటా మోటార్స్ కీలక సంవత్సరంగా భావిస్తోంది. ఆ ఏడాదిలో పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా 2026లో ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త టాటా అవిన్య (Avinya) EVను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

ఇది 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సాధారణ టాటా EVల కంటే కొంచెం ఎక్కువగా ఉండనుందని అంచనా. మార్కెట్ వర్గాల ప్రకారం, టాటా అవిన్య EV ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. దీంతో ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌కు ఒక కీలక మోడల్‌గా మారనుంది.

Tata Avinya Electric Suv Expected Launch By End Of 2026

ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా అవిన్య కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ ప్రదర్శించింది. ఆ కాన్సెప్ట్ మోడల్ డిజైన్, ఫ్యూచరిస్టిక్ లుక్, ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కొత్త తరహా స్టైలింగ్, ఇంటీరియర్ డిజైన్, సస్టైనబుల్ మెటీరియల్స్ వినియోగం వంటి అంశాలు టాటా అవిన్యను మిగతా EVల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి.

కొత్త టాటా అవిన్య EV డిజైన్ పరంగా చూసుకుంటే, ఇది వెడల్పుగా, రోడ్డుపై బలమైన ఉనికిని చూపించే ఎలక్ట్రిక్ SUVగా రూపుదిద్దుకుంటుందని అంచనా. ప్రస్తుతం కంపెనీ అధికారికంగా పూర్తి కొలతలను వెల్లడించకపోయినా, అందుతున్న సమాచారం ప్రకారం ఈ కారు సుమారు 4,300 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే దాదాపు 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ సుమారు 2,900 మిల్లీమీటర్ల వీల్‌బేస్ ఉండే అవకాశముంది.

Tata Avinya Electric Suv Expected Launch By End Of 2026

సీటింగ్ లేఅవుట్ పరంగా అవిన్య EV 5 సీట్ల అమరికతో రానుంది. దీంతో ముందు, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులకు సరిపడా లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభించి, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా అలసట లేకుండా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఎలక్ట్రిక్ సెటప్‌తో రానుందని సమాచారం. ఈ కారుకు రెండు బ్యాటరీ ఆప్షన్లు అందించే అవకాశం ఉంది. ఒకటి 65 kWh బ్యాటరీ ప్యాక్ కాగా, మరొకటి 75 kWh బ్యాటరీ ప్యాక్.

ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా. ఇది భారత మార్కెట్లో లభించే అనేక ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే మంచి రేంజ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ SUVలో మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండే అవకాశముందని చెబుతున్నారు. దీనికి తోడు ABS(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉండటంతో పాటు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వ్యవస్థ కూడా ఉంటుంది.

Tata Avinya Electric Suv Expected Launch By End Of 2026

మొత్తం మీద చూస్తే, 2026 చివరి నాటికి టాటా అవిన్య EVను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనే టాటా మోటార్స్ ఆలోచన. ఇప్పటికే టాటా EVలపై ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడిన నేపథ్యంలో, అవిన్య EV మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో, ప్రీమియం డిజైన్‌తో రానుండటం కొనుగోలుదారుల అంచనాలను మరింత పెంచుతోంది. కాన్సెప్ట్ దశలోనే ఆకట్టుకున్న ఈ ఎలక్ట్రిక్ SUV, ప్రొడక్షన్ వెర్షన్‌లో ఇంకా ఆధునికంగా, ఫీచర్లతో నిండిన మోడల్‌గా మారుతుందని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 24, 2025, 15:15 [IST]
English summary
Tata avinya electric suv expected launch by end of 2026
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+