మిడిల్ క్లాస్ వాళ్లు ఎదురుచూస్తున్న మైలేజ్ కార్.. టాటా కొత్త మోడల్ కోసం బడ్జెట్ సిద్దం చేసుకోండి!

ప్రయాణికుల సేఫ్టీ పరంగా భారతదేశపు నమ్మకమైన అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata motors) గత ఏడాది అనేక కార్లను ఆశించిన మేరకు విక్రయించింది. 2024 ఏడాదిలో కొత్త లాంచ్‌లతో మార్కెట్‌ను షేక్ చేసిన కంపెనీ ఈ ఏడాదిలో కూడా పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు ఇప్పుడు CNG వాహనాల వైపు కూడా టాటా గట్టి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్తగా కర్వ్ సీఎన్‌జీ (Curvv cng) పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారును తాజాగా రోడ్డుపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. మహారాష్ట్రలోని పుణే నగరంలో టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఈ కొత్త కారు కెమెరాలకు చిక్కింది. ఇది టాటా CNG లైనప్‌లో చేరనున్న కొత్త మోడల్ కావడం గమనార్హం.

టాటా ప్రసిద్ధ మోడల్ హారియర్ EV వంటి ప్రధాన లాంచ్‌లతో పాటు, ప్రస్తుతం CNG కార్ వెర్షన్ కూడా త్వరలో ప్రారంభించబడుతుందని సమాచారం. టాటా కర్వ్ డిజైన్ పరంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బాధపడుతున్న ప్రజలకు తక్కువ మెయింటనెన్స్‌‌తో సీఎన్‌జీ కార్స్ బాగా ఉపయోగపడుతాయి. ఈ నేపథ్యంలో కర్వ్ సీఎన్‌జీ భారతీయ కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

Tata Curvv Cng Suv Spotted While Testing

కర్వ్ మోడల్‌కు మార్కెట్లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ మోడల్ CNG వెర్షన్‌లోకి రానుండడం వలన, తక్కువ నిర్వహణ ఖర్చులతో పాటు మెరుగైన మైలేజ్‌ను కోరుకునే వినియోగదారులు ఎగబడి మరి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సబ్-కాంపాక్ట్ SUV వాహనాలకు గట్టి పోటీగా నిలవనుంది. టాటా ఇప్పటికే పంచ్, టిగోర్, టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లను సీఎన్‌జీలో కూడా తీసుకొచ్చింది.

మరో విషయం ఏమిటంటే డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను అందించే ఏకైక కంపెనీ టాటా మోటార్స్ మాత్రమే. టాటా టిగోర్, టియాగో సీఎన్‌జీ కార్లను ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌‌లో లభిస్తున్నాయి. ఇదోక్కటే కాకుండా టాటాకు మరో గుర్తింపు కూడా ఉంది. టాటా నెక్సాన్ CNGని విడుదల చేయడం ద్వారా దేశీయ మొట్టమొదటి టర్బో సీఎన్‌జీ ఎస్‌యూవీని తీసుకొచ్చిన ఆటో కంపెనీగా నిలిచింది.

Tata Curvv Cng Suv Launch

రాబోయే కర్వ్ సీఎన్‌జీ విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ కలిగి ఉండవచ్చని అంచనా. ఈ కారు అంతటా ICNG బ్యాడ్జింగ్ ఉంటుంది. దీని లోపలి భాగంలో మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుందని, కొత్తగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తుంది. లోపల అక్కడక్కడ CNG బ్యాడ్జ్‌లను గుర్తుచేసేలా స్వల్ప మార్పులు ఏమైనా ఉండవచ్చు. గత ఏడాది టాటా కర్వ్ ఇండియాలో విడుదల అయింది.

ఇది వినియోగదారుల కోసం పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కొనుగోలు చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్త సీఎన్‌జీ రాకతో దీని అమ్మకాలు 2025 ఏడాదిలో మరింత పుంజుకోనున్నాయి. ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టాటా కర్వ్ ప్రారంభ ధర రూ.10 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ.19.20 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు లభిస్తుంది.

Tata Curvv Cng Suv

టాటా కర్వ్‌లో 5 మంది కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. లోపల 5 సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. చిన్న ఫ్యామిలీ వినియోగదారులకు, ఫ్రెండ్స్ వీకెండ్స్ లేదా సెలవుల రోజుల్లో టూర్స్ వంటి వాటికి వెళ్లడానికి లాంగ్ జర్నీలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి కారులో 500 లీటర్ బూట్ స్పేస్‌ కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 9, 2025, 15:40 [IST]
English summary
Tata curvv cng suv spotted while testing it will be launch soon in india
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+