టాటా మోటార్స్‌కు భారీ దెబ్బ.. అతి దారుణంగా పడిపోయిన ఆ కారు సేల్స్.. కంపెనీకి చెమటలు!
భారతీయ SUV మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందనే నమ్మకంతో టాటా మోటార్స్ (Tata Motors) ఎంతో ప్రతిష్టాత్మకంగా కూపే-స్టైల్ SUV టాటా కర్వ్(Tata Curvv)ను తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్, బోల్డ్ రోడ్ ప్రెజెన్స్, ఎలక్ట్రిక్, ఐసీఈ టెక్నాలజీ ఎంపికలతో కర్వ్‌పై మొదట భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ మోడల్‌కి మార్కెట్లో స్పందన రాలేదని తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు స్పష్టమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో టాటా కర్వ్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడం కంపెనీకి పెద్ద షాక్‌గా మారింది. ముఖ్యంగా వార్షిక గణాంకాలు చూస్తే కర్వ్ 73% వరకు నష్టాన్ని చవిచూసిన మోడల్‌గా నిలిచింది.
2024 అక్టోబర్‌లో 5,351 యూనిట్లు అమ్ముడు పోయిన ఈ SUV, 2025 అక్టోబర్‌లో మాత్రం కేవలం 1,432 యూనిట్లకే పరిమితమైంది. ఇంత భారీ తగ్గుదల టాటా లైనప్‌లో మరే మోడల్‌లోనూ కనిపించలేదు. అందుకే గత నెలలో అత్యధిక నష్టాలను చవిచూసిన టాటా వాహనంగా కర్వ్ పేరు నిలిచిపోయింది. ఈ తగ్గుదల కేవలం వార్షిక ప్రాతిపదికన మాత్రమే కాదు, నెలవారీ అమ్మకాలలో కూడా కొనసాగుతోంది.

ప్రారంభంలో మంచి హైప్ ఉన్నా, మార్కెట్లో ఉన్న తీవ్రమైన పోటీ, కూపే SUV డిజైన్ అందరికీ నచ్చకపోవడం, సెగ్మెంట్‌లో ఇప్పటికే బలమైన ప్రత్యర్థులు ఉండడం వంటి అంశాలు కర్వ్ అమ్మకాలపై ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. కర్వ్‌ను టాటా కొత్త ట్రెండ్‌ను ప్రారంభించే మోడల్‌గా ప్లాన్ చేసినప్పటికీ, ప్రస్తుత అమ్మకాల పరిస్థితులు చూస్తే కస్టమర్ల అంచనాలను అందుకునే స్థాయి వరకు చేరలేకపోయిందనేది వాస్తవం.
సెప్టెంబర్ 2025లో 1,566 యూనిట్లు డెలివరీ చేయబడిన టాటా కర్వ్, అక్టోబర్‌లో ఆ సంఖ్యను నిలబెట్టుకోలేకపోయింది. నెలకాల వ్యవధిలోనే కర్వ్ అమ్మకాలు సుమారు 9 శాతం తగ్గడం కంపెనీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే వార్షిక అమ్మకాలలో భారీ తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ మోడల్, నెలవారీ గణాంకాల్లో కూడా స్థిరంగా నిలబడలేకపోవడం మార్కెట్ డైనమిక్స్ ఎంత వేగంగా మారుతున్నాయో చూపిస్తోంది.

అయితే, ఈ పరిస్థితులను మార్చాలని టాటా మోటార్స్ పూర్తిగా ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా క్లచ్-ఫ్రీ డ్రైవింగ్ అనుభూతిని మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఇటీవల కర్వ్ మోడల్‌లో కొన్ని కీలక నవీకరణలను చేసింది. ఈ అప్‌డేట్స్ కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా, ఆధునిక SUV కోరుకునే ప్రీమియం ఫీల్‌ను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పుల్లో కొత్త ఫీచర్ల చేర్పులు ఉన్నాయి.
మరింత క్లీనుగా, మోడర్న్‌గా కనిపించే కొత్త ఇంటీరియర్ థీమ్, అలాగే కర్వ్, కర్వ్ EV మోడళ్ల కోసం కొత్త అప్హోల్స్టరీ మెటీరియల్ ఉన్నాయి. ఈ అప్‌డేట్లు కర్వ్ క్యాబిన్ లుక్, టచ్‌ను మెరుగుపరుస్తూ, యువతను ఆకర్షించేలా రూపొందించబడ్డాయి. మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోలేక అమ్మకాలు తగ్గుతున్నా, తన మోడల్‌ను తిరిగి రైల్‌పైకి తెచ్చే దిశగా టాటా మోటార్స్ చేస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో ఎంత వరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

కర్వ్ ICE వెర్షన్‌లో మూడు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, ఇది నగరాల్లో స్మూత్ పనితీరు, హైవేలపై చురుకైన స్పందనను అందిస్తుంది. రెండోది 1.2-లీటర్ GDi డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్, ఇది మరింత పవర్‌తో పాటు మెరుగైన ఇంధన సమర్థతను అందించే ఆధునిక ఇంజిన్ టెక్నాలజీ. డీజిల్ ఎంపిక కోరుకునే వారికి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉందని టాటా స్పష్టంగా తెలిపింది.
EV వెర్షన్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందిస్తోంది. 40.5kWh బ్యాటరీ నగర వినియోగానికి సరిపడే ప్రాక్టికల్ రేంజ్‌ను అందిస్తే, 55kWh పెద్ద బ్యాటరీ ఎక్కువ ప్రయాణాలు చేసే యూజర్ల కోసం డిజైన్ చేయబడింది. పెద్ద బ్యాటరీ సుమారు 502 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తుంది, ఇక చిన్న బ్యాటరీ సుమారు 430 కి.మీ. రేంజ్ అందించడం దీన్ని మధ్యస్థాయి సెగ్మెంట్ EVలలో మంచి పోటీదారుగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








