ఈ టాటా కారుకి దేశంలో భారీ డిమాండ్.. సొంతం చేసుకోవాలంటే 3 నెలలు ఆగాల్సిందే! అంత డిమాండ్ ఎందుకో?
టాటా కర్వ్ SUV ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి హాలీవుడ్ హీరో అయితే ఎలా ఉంటుందో అలా దూసుకుపోతోంది. ఈ మోడల్‌పై వినియోగదారుల ఆసక్తి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇటీవల అమలులోకి వచ్చిన GST తగ్గింపు దాని ధరను గణనీయంగా తగ్గించి, వినియోగదారుల దృష్టిని మరింతగా ఆకర్షించింది. ధర తగ్గిన వెంటనే షోరూమ్‌లలో కర్వ్ కోసం చేసిన విచారణలు, బుకింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఈ డిమాండ్ పెరుగుదల ఒక విధంగా కారుకు పాపులారిటీని చాటుతుంటే, మరోవైపు డెలివరీ వేచి ఉండే కాలాన్ని పెంచే పరిస్థితి కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం కర్వ్ SUV కోసం ఎదురుచూడాల్సిన వెయిటింగ్ పిరియడ్ 8 నుండి 12 వారాలు, అంటే దాదాపు 2 నుండి 3 నెలలు దాకా వెళ్లిపోయింది.
బుకింగ్ చేసిన వెంటనే కారును పట్టుకెళ్లే రోజులు లేవు; ఇప్పుడు ఓపికతో ఎదురుచూడాల్సిన పరిస్థితి. కాబట్టి టాటా కర్వ్ కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ పొందేందుకు దాదాపు 60 నుంచి 90 రోజులు పట్టొచ్చు. అధిక డిమాండ్ కారణంగా ఉత్పత్తి షెడ్యూల్ కూడా బిగబట్టినట్లే ఉండటంతో, ఈ వెయిటింగ్ పిరియడ్ త్వరగా తగ్గే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు.

టాటా కర్వ్ బేస్ వేరియంట్ ప్రస్తుతం రూ.9,65,690 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ SUVను తయారు చేసే విధానం పూర్తిగా సౌకర్యం,యు పనితీరును దృష్టిలో పెట్టుకున్నట్టే కనిపిస్తుంది. ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, టాటా కర్వ్ మూడు శక్తివంతమైన ఇంజిన్‌లతో లభిస్తోంది. అందులో 1.2-లీటర్ రెవోట్రాన్ నేచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 88.2 kW పవర్, 170 Nm టార్క్‌ను అందిస్తుంది.
రోజువారీ డ్రైవింగ్‌కు సరిపోయే స్మూత్ పనితీరును ఇస్తుంది. 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ హైపెరియన్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్ మాత్రం 91.9 kW పవర్, 225 Nm టార్క్‌తో స్పోర్టీ డ్రైవింగ్‌ను కోరుకునే వారికి సరైన ఎంపికగా మారుతుంది. డీజిల్‌ను ఇష్టపడేవారికి 1.5-లీటర్ క్రియోజెట్ ఇంజన్ అందుబాటులో ఉంది, ఇది 86.7 kW శక్తి మరియు 260 Nm టార్క్‌ను ఇస్తూ, పొడవాటి ప్రయాణాల్లో మైలేజ్, పనితీరు రెండింటినీ సమతుల్యం చేస్తుంది.

భద్రత విషయానికి వస్తే, టాటా కర్వ్ తన సెగ్మెంట్‌లో అత్యంత ఆధునిక టెక్నాలజీలను కలిగి ఉన్న మోడళ్లలో ఒకటి. డ్రైవింగ్ సమయంలో రక్షణ, రోడ్డు మీద నియంత్రణ, ఇవి అన్నీ ఒకే వాహనంలో సమన్వయం చేయబడినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా లెవల్ 2 ADAS సూట్ ఈ విభాగంలో కర్వ్‌ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లుతుంది. స్టాప్, గో ఫీచర్‌తో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ హైవే డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది.
360-డిగ్రీ 3D సరౌండ్ వ్యూ కెమెరా టైట్ పార్కింగ్ స్పేసుల్లో బెస్ట్. అదే విధంగా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి స్మార్ట్ ఫీచర్లు లేన్ మార్చే ప్రతి సమయంలో అదనపు నమ్మకాన్ని ఇస్తాయి. లేన్-డిపార్చర్ వార్నింగ్ (LDW) వాహనం లేన్‌ను వదిలి బయటికి వెళ్లినప్పుడు వెంటనే డ్రైవర్‌కు హెచ్చరిక పంపుతుంది. లేన్-కీప్ అసిస్ట్ (LKA) మాత్రం స్టీరింగ్‌ను స్వల్పంగా సరిచేసి కారును తిరిగి అదే లేన్‌లోకి తీసుకు వచ్చేలా చూపిస్తుంది.



Click it and Unblock the Notifications








