అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా ప్రత్యేమైన కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
దేశీయ ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కర్వ్ తో SUV లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇది మార్కెట్లో కూపే డిజైన్‌తో ప్రసిద్ధ మోడల్‌గా ఉంది. మార్చి 2025లో కేవలం ఒక్క నెలలోనే ఈ కారు 3,785 యూనిట్ల అమ్మకాలు నమోదు చేపి, మార్కెట్లో తన ప్రత్యేకతను మరింత బలమైన మోడల్‌గా ఉంది. యువతలో స్పోర్టీ డిజైన్, కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీతోపాటు ఫ్యూచరిస్టిక్ లుక్స్‌తో కర్వ్ ఆకట్టుకుంటుంది. కస్టమర్లలో ఈ కారుకి ఉన్న ఆదరణను బట్టి చూస్తే, ఇది టాటా మోటార్స్ కు మరో మైలురాయిగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఇప్పుడు 'డార్క్ ఎడిషన్' కర్వ్ ను విడుదల చేసింది. మెరిసే నలుపు రంగులో, మరింత స్టైలిష్‌గా, మరింత మోడెర్న్‌గా రూపొందించిన ఈ వెర్షన్ ఎంతో అందంగా సౌకర్యంగా, శక్తివంతంగా ఉంది.
ఈ కారు మూడురకాల పవర్‌ట్రెయిన్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్‌లో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఆధారిత టాటా కర్వ్ డార్క్ ఎడిషన్, డిజైన్ పరంగా మాత్రమే కాక, ధరల పరంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వెర్షన్, కర్వ్ SUV యొక్క ఫుల్-లోడ్ వేరియంట్‌పై ఆధారపడి తయారైంది. దీని ధర 16.49 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ. 19.52 లక్షల వరకు ఉంది.

ఇక ఎలక్ట్రిక్ వేరియంట్ విషయానికొస్తే, రూ. 22.24 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. ఈ మోడల్, 'ఎంపవర్డ్' అనే ప్రీమియం వేరియంట్ స్థాయిలో ఉంటుందని పేర్కొంటున్నారు. శక్తివంతమైన బ్యాటరీ, లేటెస్ట్ EV టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఇది టాటా ఎలక్ట్రిక్ వాహనాలలో మరో ప్రత్యేక మోడల్‌గా నిలవనుంది. కొత్త టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ SUV, డిజైన్ పరంగా పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు.
దాని పాత మోడల్‌తో మార్చకుండా, ఇందులో చేసిన ఫినిషింగ్ టచ్‌లు ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలిపేలా చేస్తాయి. ఇది పూర్తిగా నలుపు రంగులో అందుబాటులో ఉంటుంది, బ్లాక్ షేడ్‌లో మెరిసే బాడీ, గ్లోసీ బ్లాక్ ఫినిష్ కారుకి సరికొత్త లుక్‌ను అందిస్తుంది. ముందు ఫెండర్లపై ప్రత్యేకంగా ఉంచిన 'డార్క్' బ్యాడ్జ్‌లు, ఇది సాధారణ కర్వ్ కాదు, ఒక ప్రత్యేక ఎడిషన్ అనే విషయం స్పష్టంగా తెలియజేస్తాయి.

ఇంటీరియర్ డిజైన్ మొత్తం బ్లాక్ థీమ్‌ను ఫాలో అవుతూ, డాష్‌బోర్డ్ నుంచి అప్హోల్స్టరీ వరకు కొత్త వినియోగదారులకు నచ్చే విధంగా రూపొందించారు. తాజాగా విడుదలైన 'డార్క్ ఎడిషన్' 1.2-లీటర్ TGDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 125 PS హార్స్‌పవర్ శక్తిని, 225 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లోనూ, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
టాటా కర్వ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 118 PS హార్స్‌పవర్, 260 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. ఇక మైలేజ్ విషయంలో, టాటా కర్వ్ డీజిల్ వేరియంట్ లీటరుకు 17.88 నుండి 19.25 కిలోమీటర్లు అందిస్తుంది. అదే కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్ 55 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








