బడ్జెట్‌లో బెస్ట్ SUV కోసం చూస్తున్నారా? తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న SUVలు ఇవే!
టాటా కర్వ్ (Tata Curvv) త్వరలో విడుదల కానున్న ఒక ముఖ్యమైన కూపే ఎస్యూవీ. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లీటరుకు 11 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
అంతేకాకుండా 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా అనేక లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందిస్తోంది కంపెనీ. అయితే మార్కెట్లో దీనికి పోటీగా నిలబడే 3 ప్రముఖ కార్ల ధర, ప్రత్యేకతల గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

కియా సెల్టోస్ (Kia Seltos): టాటా కర్వ్‌కు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. సాధారణ వినియోగదారులకు ఇది చాలా అందుబాటు ధరలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.19 లక్షల నుంచి రూ. 20.51 లక్షల వరకు ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు గ్లేసియర్ పెర్ల్ వైట్, అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కింగ్ సిల్వర్ వంటి అనేక రంగుల్లో లభిస్తుంది.
కొత్త సెల్టోస్ కారు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లతో అందుబాటులో ఉంది. ఇది లీటరుకు 17 నుండి 20 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ స్క్రీన్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

స్కోడా కుషాక్ (Skoda Kushaq): ఇది కూడా ఒక పాపులర్ ఎస్యూవీ. ఇది వినియోగదారులకు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షల నుండి రూ. 19 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 5 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు హాయిగా ఇందులో జర్నీ చేయవచ్చు. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ స్కోడా కుషాక్ కారు 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది లీటరుకు 18.09 నుంచి 19.76 కిలో మీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఇందులో 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt): ఈ కూపే ఎస్యూవీ టాటా కర్వ్‌కు గట్టి పోటీదారుగా నిలువనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుండి టాప్ వేరియంట్ ధర రూ. 14.10 లక్షల వరకు ఉండవచ్చు. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇది లీటరుకు 18 నుండి 19.5 కిలో మీవరకు మైలేజ్ ఇస్తుంది.
కొత్త సిట్రోయెన్ బసాల్ట్ బయటి భాగంలో చాలా లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే వంటి వివిధ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. కూడా లభిస్తుంది. ఈ కారు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








