చూపులతోనే ఆకట్టుకునే బ్లాక్ బ్లాస్టర్! కొత్త ఎడిషన్ ఫీచర్లు చూశాక కొనకుండా ఉండలేరు!
సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల ఫ్లాగ్‌షిప్ కూపే SUV అయిన టాటా కర్వ్ కారును ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన బాడీ డిజైన్, కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, ఇంటీరియర్ లగ్జరీ ఫీచర్స్‌తో కూడిన ఈ మోడల్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ SUV పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇన్ని పవర్‌ట్రెయిన్‌లో లభించడం వలన కస్టమర్లకు మల్టిపుల్ ఆప్షన్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. . ఇది మార్కెట్లో SUV ప్రియులకు ఒక కొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఈ కారు గురించిన ఫీచర్స్ గురించి పూర్తి వివరాలను కింది కథనంలో తెలుసుకుందాం.
ధర: టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ ధర విషయానికి వస్తే, పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 16.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి అదే టాప్ వేరియంట్‌కు రూ. 19.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ అయితే మరింత ధర ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ. 22.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

డిజైన్: డిజైన్ విషయానికి వస్తే, ఇది ఒరిజినల్ కర్వ్ డిజైన్‌ను పోలీ ఉంటుంది. ఇది సాధారణ 'కర్వ్' కారుతో పోలిస్తే కొత్తగా ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇది లోపల బ్లాక్ థీమ్‌తో కనిపిస్తుంది. సాంప్రదాయిక మోడల్‌తో పోలిస్తే బాడీ స్ట్రక్చర్, శైలిలో పెద్దగా మార్పులు లేవు. ఎక్స్‌టీరియర్ మాత్రం బ్లాక్ కలర్‌లో ఆకట్టుకుంటుంది. బ్లాక్ ఫినిష్‌తో కూడిన గ్రిల్, అల్లాయ్ వీల్స్, షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ కలిగి ఉంటుంది.
లోపల కూడా, క్యాబిన్ అంతటా నలుపు రంగు థీమ్ కొనసాగుతుంది, దీనికి క్రోమ్ యాక్సెంట్స్, ప్రీమియం మెటీరియల్స్, లాంగ్ జర్నీ చేసే సమయంలో ఎలాంగి ఇబ్బంది లేకుండా చూడటానికి కంఫర్టబుల్ సీట్లు ఉన్నాయి. ముందు ఫెండర్లపై ప్రత్యేకంగా ఉంచిన డార్క్ బ్యాడ్జ్‌లు ఈ ఎడిషన్ ప్రత్యేకతను మరింత హైలైట్ చేస్తాయి. ఈ డిజైన్ చూసినవారికి ఇది ఆకట్టుకుంటంది.

ఇంజిన్ పనితీరు: ఇది రెండు శక్తివంతమైన ఇంజిన్లతో నడుస్తుంది. మొదటిది 1.2-L TGDI టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. నగర ప్రయాణాలకు డ్రైవింగ్ చేసే విధంగా ఇది స్థిరమైన సాఫ్ట్‌నెస్‌ను అందిస్తుంది. రెండవది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది ఎక్కువ దూర ప్రయాణాలకు, టార్క్ అవసరమయ్యే స్ధితుల్లో బాగా ఉపయోగపడుతుంది. రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి.
ఈ వేరియంట్లు సగటున 17.88 నుంచి 19.25 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తాయి. ఇతర SUV మోడళ్లతో పోలిస్తే మెరుగైన స్థాయిలోనే ఉంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వేరియంట్ గురించి చూసినట్లయితే 55 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను దీనిలో అందించారు. ఈ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారు 167 ps పవర్, 215 nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 502 కి.మీల రేంజ్ అందిస్తుంది.

ఇతర ఫీచర్లు: ఈ కారు 5-సీట్ల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. ఐదు మంది ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9-స్పీకర్ JBL-సౌండ్ సిస్టం, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








