టాటా ప్లాన్ వేసిందంటే మిగతా వాళ్లకు దిమ్మతిరిగిపోవాల్సిందే.. డౌన్ పేమెంట్ లేదు, 6 నెలలు ఫ్రీ ఛార్జింగ్!

సామాన్యుడికి ఎలక్ట్రిక్ కారు కల నిజం చేసిన కంపెనీల్లో టాటా మోటార్స్ ముందుంటుంది. నెక్సాన్ ఈవీతో మొదలైన ఎలక్ట్రిక్ విప్లవం.. తర్వాత టియాగో ఈవీ, పంచ్ ఈవీ రూపంలో కొనసాగుతోంది. తక్కువ ధరలో ఇవన్నీ సాధ్యం చేయడంతో ఇతర కంపెనీలకు కూడా ఇదొక స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఎంజీ మోటార్స్‌తో గట్టి పోటీ ఉండడంతో, టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్రతి నెలా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. 2025మే నెల కోసం టాటా మోటార్స్ ప్రకటించిన బ్లాక్ బస్టర్ ఆఫర్లలో కస్టమర్లు ఏకంగా రూ.1.86లక్షల వరకు లాభం పొందొచ్చు. 2లక్షల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల మైలురాయిని దాటిన సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చామని టాటా మోటార్స్ ప్రత్యేకంగా చెబుతోంది. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడళ్లపై అదిరిపోయే బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

Tata Electric Cars

ఈ ఆఫర్‌లో భాగంగా టాటా మోటార్స్ రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, ఇన్స్టాలేషన్‌తో సహా ఉచిత హోమ్ ఛార్జర్ అందిస్తోంది. కస్టమర్లు 6 నెలల పాటు ఉచిత ఛార్జింగ్ కూడా పొందొచ్చు. అయితే కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ కొనేవాళ్లకు టాటా పవర్ ఛార్జర్స్‌లో మాత్రమే ఈ ఉచిత ఛార్జింగ్ వర్తిస్తుంది. దీనితో పాటు జీరో డౌన్ పేమెంట్, 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది.

ఇంకా టాటా ఎలక్ట్రిక్ కార్ల యజమానులు, టాటా ప్యాసింజర్ కార్ల యజమానులు, టాటా గ్రూప్ ఉద్యోగులకు ప్రత్యేక అప్‌గ్రేడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. GeM, CSD, KPKB ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఇక మోడల్ వారీగా డిస్కౌంట్ ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ఆఫర్లు స్థలం, రాష్ట్రం, స్టాక్ లభ్యతను బట్టి మారే అవకాశం ఉంది.

Tata Electric Cars Discount

టాటా ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీ విషయానికొస్తే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 1.30 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇటీవల 2025 మోడల్ ఇయర్‌కు అప్‌డేట్ చేసిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14లక్షల వరకు ఉంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

ఇక టాటా పంచ్ ఈవీ విషయానికొస్తే, ఈ నెల కోసం కంపెనీ రూ. 1.20 లక్షల వరకు బెనిఫిట్స్ ప్రకటించింది. మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రూపొందించిన ఈ మోడల్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల వరకు ఉంది. 25kWh, 35kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్న ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 365 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

Tata

టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీపై రూ. 1.41లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఇది ఒకటి. ఈ మోడల్‌లో 45 kWh, 30 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. హైయర్ కెపాసిటీ వేరియంట్ ఫుల్ ఛార్జ్‌పై 489 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంతేకాదు, 60 kW ఫాస్ట్ ఛార్జర్ వాడితే దాదాపు 40 నిమిషాల్లో 10-80% వరకు ఛార్జ్ చేయొచ్చు.

అదే సమయంలో నెక్సాన్ ఈవీ మీడియం రేంజ్ మోడల్‌లో 30 kWh బ్యాటరీ ప్యాక్ ఉండటంతో, ఫుల్ ఛార్జ్‌పై 275 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ 56 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అయ్యే కెపాసిటీ కలిగి ఉంది. నెక్సాన్ ఈవీ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షల వరకు ఉంది.

Tata Tiago

టాటా కర్వ్ ఈవీపై రూ. 1.71లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు. 2024 సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన ఈ కూపే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49లక్షల నుంచి రూ. 22.24లక్షల వరకు ఉంది. 45 kWh, 55 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ మోడల్‌లో మొదటిది 502 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా, రెండోది సింగిల్ ఛార్జ్‌పై 585 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

పైన చెప్పినట్టుగా ఈ ఆఫర్లు డీలర్‌షిప్, స్థలం, నగరం, రాష్ట్రం, స్టాక్ వంటి వాటిని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గరలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సంప్రదించి ఆఫర్ల గురించి తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం కంపెనీ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ S, అకంప్లిష్డ్ ప్లస్ S అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ, ప్రిస్టీన్ వైట్ అనే ఐదు కలర్ ఆప్షన్స్‌తో ఈ కారు మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. 360డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, iRAకనెక్టెడ్ వెహికల్ టెక్, ఎయిర్ ప్యూరిఫయర్, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ ఫీచర్లతో రాబోతోంది.

ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.2 లీటర్ NAపెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, ట్విన్ సిలిండర్ పెట్రోల్-సీఎన్‌జీ బై-ఫ్యూయల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉండనున్నాయి. గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డీసీఏ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్స్‌ను టాటా మోటార్స్ అందించనుంది. ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఉంటుందని భావిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 15, 2025, 16:15 [IST]
English summary
Tata evs on fire sale zero down payment 6 months free charging up to rs 1 71 lakh off
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+