ఈ కార్లను సొంతం చేసుకోవాలంటే మీకు అదృష్టం ఉండాలి.. ఇవి అంత స్పెషల్ ఎందుకో తెలుసా?
దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ వినియోగదారులకు అందుబాటు ధరలో వాహనాలను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలకు పోటీగా అమ్మకాలతో దూసుకుపోతుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన ఫీచర్స్‌తో కార్లను విడుదల చేయడంలో టాటా కంపెనీకి దేశంలోని పేరుంది. దేశీయంగా కొత్త కస్టమర్లను సాధించడానికి రెండు ప్రసిద్ధ కార్ మోడళ్లను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కార్ల పేరు 'హారియర్ స్టెల్త్ ఎడిషన్ (Harrier stealth edition)', 'సఫారీ స్టెల్త్ ఎడిషన్ (Safari stealth edition)'. ఇవి ప్రత్యేకమైన ఎడిషన్లు. టాటా సఫారీ 27 సంవత్సరాల గుర్తింపుగా కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే కొనుగోలుకు లభిస్తాయి. టాటా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ స్టెల్త్ ఎడిషన్లు 2,700 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ప్రత్యేకమైన కార్లను స్టెల్త్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అప్‌డేట్ చేశారు. హారియర్ స్టెల్త్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.25.09 లక్షలుగా ఉంది. సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.25.74 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కార్లకు సంబంధించిన బుకింగ్స్ కంపెనీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఓపెన్ అయ్యాయి.

హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ కార్లు ప్రత్యేకమైన ప్రీమియం డిజైన్‌తో, అధునాతన టెక్నాలజీ, అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలతో SUV విభాగంలో అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తాయని కంపెనీ వీటిపై భారీ అంచనాలు పెట్టుకుంది. మ్యాట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ ఈ కార్లకు ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతుంది. R19 బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా ప్రధాన ఆకర్షణ. ఈ కార్లు చూడటానికి లగ్జరీ ఫీలింగ్‌ను అందించే మెడళ్ల మాదిరిగా కనిపిస్తాయి.
హారియర్, సఫారీలను స్పోర్టియర్‌గా మార్చడంలో డార్క్-థీమ్ బ్యాడ్జింగ్, బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్‌ను కీలకంగా ఉన్నాయి. పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉన్న ఇవి రోడ్లపై ప్రయాణిస్తుంటే అందరి చూపు కూడా వీటి మీదే ఉంటుంది. రెండు కార్లు కూడా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పెర్ఫామెన్స్‌ను అందిస్తాయని టాటా మోటార్స్ పేర్కొంటుంది. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి లోపల కార్బన్ నోయిర్ థీమ్‌ను ఇచ్చారు.

మొదటిసారిగా గత జనవరిలో టాటా మోటార్స్ ఈ ప్రత్యేక ఎడిషన్‌లను దేశంలో 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శరకు ఉంచింది. ఆ సమయంలోనే ఈ కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను ఆకట్టుకున్నాయి. వినియోగదారులు సైతం ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే టాటా మోటార్స్ ఇప్పుడు ఆ ప్రత్యేక ఎడిషన్లను అధికారికంగా బుకింగ్స్‌ను ప్రారంభించడం విశేషం.
టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ క్రయోటెక్ BS-VI ఫేజ్ 2 ఇంజిన్‌తో రన్ అవుతుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇంజిన్‌కు జత చేశారు. ప్రయాణికుల రక్షణకు సంబంధించి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2+ ADAS వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








