మాస్ స్టైల్‌కి బ్రేక్ లేదు.. ఇప్పటివరకు చూడని పెర్ఫామెన్స్.. కొత్త లుక్‌, ఇంజిన్‌తో టాటా కార్లు వస్తున్నాయ్

భారత వాహన మార్కెట్ ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో తయారీదారుల మధ్య పోటీ ఎక్కువ అయింది. నువ్వా నేనా అన్నట్లుగా కొత్త కస్టమర్లను సంపాదించడానికి లేటెస్ట్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి తమ ప్రసిద్ధ మోడళ్లను మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల డిమాండ్ మేరకు మరింత కొత్తగా మార్చి తిరిగి తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే టాటా మోటార్స్ (Tata Motors) తన హారియర్ (harrier), సఫారీ (safari) లను మరింత కొత్తగా మార్చి తిరిగి మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తుంది.

ఒకప్పుడు గట్టిగా పోటీకి ఎదురైన ఈ రెండు SUVలు, ఇప్పుడు "హాట్ కేకుల్లా" అమ్ముడవుతున్నాయి. మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చినా, టాటా ట్విన్‌లుగా పిలువబడే హారియర్, సఫారీకి ఉన్న ప్రత్యేకతల కారణంగా మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. అయితే ఈ విభాగంలో టాటా మోటార్స్‌ ఈ రెండింటిని డీజిల్ ఆఫ్షన్లలో విక్రయిస్తుంది. చాలా కాలంగా పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో లేదని కొంత మంది కస్టమర్లు భావిస్తున్నారు.

Tata Harrier And Safari Will Launch With Petrol Engine

ప్రత్యర్థులైన మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ వంటి SUVలు పెట్రోల్, డీజిల్ రెండింటిలో లభిస్తుండగా, హారియర్, సఫారీకి ఇప్పటివరకు కేవలం డీజిల్ వేరియంట్లే ఉన్నాయి. దీని వల్ల చాలా మంది కస్టమర్లు తమ ఎంపికను ప్రత్యర్థుల వైపు మళ్లించారు. ముఖ్యంగా పెట్రోల్ SUVలను కోరుకునే వారికి టాటా వాహనాలు ఒక ఆప్షన్‌గా నిలవలేకపోయాయి. అయితే ఇప్పుడు, పరిస్థితి మారబోతోంది.

టాటా మోటార్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, హారియర్, సఫారీ కోసం కొత్తగా అభివృద్ధి చేస్తున్న పెట్రోల్ ఇంజిన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు. కొన్ని అంతర్గత సాంకేతిక సవాళ్ల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయినా, తాజా అప్‌డేట్ ప్రకారం, ఇది ఇక గ్యారంటీగా రోడ్డుపైకి రానుంది. టాటా మోటార్స్ ప్రకటించినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి రానున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో పెట్రోల్ ఇంజిన్ తొలిసారిగా లభించనుంది.

Tata Harrier Petrol Version

పెట్రోల్ మోటార్‌ను జోడించడం వల్ల టాటా SUVల మార్కెట్ డైనమిక్స్ గణనీయంగా మారే అవకాశముంది. టాటా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ పెట్రోల్ మోటార్ వల్ల కంపెనీకి మరింత శక్తిని జతచేస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పటి వరకు కేవలం డీజిల్ ఇంజిన్లతో మాత్రమే లభ్యమవుతున్న ఈ SUVలు, ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన వేరియంట్లుగా అందుబాటులోకి రానుండటంతో ఇతర కంపెనీలకు బలమైన పోటీ ఉంటుంది.

ఈ SUVలు 1.5-లీటర్ TGDi పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా పని చేయనున్నాయి. టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్(TGDi) ఇంజిన్‌ వల్ల, హారియర్, సఫారీ కార్లు మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది. ఈ యూనిట్ 168 bhp పవర్, 280 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, స్మూత్ డ్రైవింగ్ అనుభూతికి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (DCT) కూడా లభించనుంది.

Tata Safari Petro Version

ఈ కొత్త పెట్రోల్ వేరియంట్లు మార్కెట్లోకి రావడం వల్ల, హారియర్, సఫారీ మోడళ్లు మహీంద్రా XUV700, స్కార్పియో-ఎన్ వంటి మల్టీ-ఫ్యూయల్ SUVలకు గట్టి పోటీగా నిలవబోతున్నాయి. ఇప్పటివరకు పెట్రోల్ ఎంజిన్ లేక వెనుకబడిన ఈ రెండు టాటా SUVలు, ఇప్పుడు పూర్తిస్థాయిలో పోటీలోకి అడుగుపెడుతున్నాయి. పెట్రోల్ వేరియంట్ల లాంచ్‌తో, టాటా మోటార్స్ SUV ప్రీమియం విభాగంలో తన స్థానాన్ని మరింత బలపరిచే అవకాశముంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 21, 2025, 17:15 [IST]
English summary
Tata harrier and safari will launch with petrol engine soon more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+