అందరు ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 627 కిలోమీటర్ల రేంజ్ కారు బుకింగ్స్ స్టార్ట్

భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఐసీఈ ఆధారిత కార్లతో పాటు ఈవీలను కూడా విడుదల చేస్తుంది. ఇప్పటికే పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలు వంటి వాటితో మార్కెట్లో బలమైన ఈవీ తయారీదారుగా ఉన్నటువంటి హారియర్ ఈవీ ద్వారా తన స్థానాన్ని మరింత పెంచుకుంటుంది. టాటా హారియర్ EV ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా అధునాతన ఫీచర్స్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారుపై కస్టమర్లు ఇప్పటికే అధిక అంచనాలు పెట్టుకున్నారు. దాని డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ అన్నీ కలిపి భవిష్యత్తు తరహా డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయని టాటా మోటర్స్ చెబుతోంది.

ఎంతో కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న కొత్త హారియర్ EV కోసం బుకింగ్‌లు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ SUVను కొనాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి బుకింగ్ చేసుకోవచ్చు, లేదా సమీపంలోని డీలర్‌షిప్‌కి వెళ్లి బుకింగ్ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. బుకింగ్ కోసం రూ.21,000 ముందస్తు చెల్లింపు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, టాటా మోటర్స్ వినియోగదారులకు ఆకర్షణీయమైన లాయల్టీ బోనస్‌ను అందిస్తోంది.

Tata Harrier Electric Suv

హారియర్ EVను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా రూ.లక్ష వరకు లాయల్టీ బోనస్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇది టాటా బ్రాండ్‌కి ఇప్పటికే ఉన్న వినియోగదారులు, కొత్త కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది. హారియర్ EV ఎలక్ట్రిక్ SUV విభాగంలో టాటా మోటార్స్ బ్రాండ్ పేరు, నమ్మకాన్ని మరింత పెంచుతుందని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు.

టాటా హారియర్ EV నిజంగా ప్రీమియం ఎలక్ట్రిక్ SUV స్థాయికి తగ్గట్టు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUVకి 65 కిలోవాట్ల(kWh), 75 కిలోవాట్ల (kWh)కెపాసిటీ కలిగిన రెండు వేరే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు అవసరాన్ని బట్టి వీటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, ఈ హారియర్ EV 538 కి.మీ. నుండి గరిష్టంగా 627 కి.మీ. వరకు నిరంతరాయంగా ప్రయాణించగలదు.

Tata Harrier Electric Suv Bookings Opend

దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 180 కి.మీలు. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని సాధించడం దీని పర్ఫార్మెన్స్‌కు నిదర్శనం. ఈ ఎలక్ట్రిక్ SUV బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు రెండు విధాల ఛార్జింగ్ సౌకర్యాలు కలవు. 7.2 kW సామర్థ్యం గల AC ఛార్జర్‌ని ఉపయోగిస్తే, 10 నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 10.7 గంటల సమయం పడుతుంది.

అదే విధంగా, వెంటనే ఛార్జింగ్ అవసరమైతే 120 kW సామర్థ్యం గల DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. టాటా హారియర్ EV, అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, డిజైన్‌తో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు రూ.21.49 లక్షల ప్రారంభ ధరతో, రూ.28.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది.

Tata Harrier Electric Price

వినియోగదారుల అవసరాల ఆధారంగా అడ్వెంచర్, అడ్వెంచర్ S, ఫియర్‌లెస్ ప్లస్, ఎంపవర్డ్ అనే నాలుగు వేరియంట్లలో ఎంపిక చేసుకోవచ్చు. అందమైన డిజైన్‌కి తోడు, ఈ కారు స్టీల్త్ బ్లాక్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 5 సీట్ల విస్తారమైన క్యాబిన్, 502 లీటర్ల బూట్ స్పేస్ సౌకర్యంతో, కుటుంబ ప్రయాణానికి అనువుగా రూపొందించబడింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 3, 2025, 16:17 [IST]
English summary
Tata harrier electric suv bookings opend more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+