దేశంలో అందరు ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది.. పవర్‌ఫుల్ 627 కి.మీ రేంజ్ కారు డెలివరీలు స్టార్ట్!
టాటా మోటార్స్ (Tata Motors) దేశీయంగా నమ్మకానికి నిలయంగా పేరొందిన ఆటోమొబైల్ బ్రాండ్. ప్రయాణికుల సేఫ్టీకి ఇది అత్యంత ప్రాధాన్యత అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఇంధన ఆధారిత వాహనాలను విడుదల చేస్తూనే, అదే సమయంలో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే పలు ఈవీ కార్లను విక్రయిస్తున్న కంపెనీ ఇటీవల టాటా హారియర్ ఈవీ (tata harrier Ev)ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పటిష్ట స్థానాన్ని పొందాలన్న టాటా లక్ష్యానికి ఇది బలమైన మెరుగుదల. వాగమోన్‌లోని ఏనుగు కొండను అధిరోహించిన తర్వాత, ఈ SUV దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ టెస్ట్ డ్రైవ్ విజయం టాటా హారియర్ EV సామర్థ్యాన్ని, ఎలక్ట్రిక్ కార్లలో కూడా కారు సత్తాను నిరూపించింది.
ఇప్పుడు, టాటా మోటార్స్ హారియర్ EV డెలివరీలు అధికారికంగా ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా EV ప్రియుల కోసం ఒక కీలక ఘట్టం. స్టైలింగ్, టెక్నాలజీ, రేంజ్.. అన్నింటిలోను హారియర్ EV గట్టిగానే నిలబడింది. అత్యాధునిక ఫీచర్లతో, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో హారియర్ EV ఇప్పుడు రోడ్లపైకి అడుగుపెడుతోంది. హారియర్ EV అందుబాటులోకి రావడం ద్వారా టాటా, భారతదేశంలో EV విప్లవాన్ని మరింత వేగవంతం చేసింది.

టాటా హారియర్ EV దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో డెలివరీలు మొదలయ్యాయి . వినియోగదారులు తమ కొత్త కారును ఎంతో ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు. ఇది కేవలం మరో ఎలక్ట్రిక్ వాహనం కాదు, టాటా మోటార్స్ ప్రారంభించిన ఈవీ విప్లవానికి మరో మెరుగైన అడుగు. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ.21.49 లక్షల నుంచి రూ.28.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)ఉంటుంది. ఇది అడ్వెంచర్, అడ్వెంచర్ S, ఫియర్‌లెస్ ప్లస్, ఎంపవర్డ్ వేరియంట్లలో లభిస్తుంది.
ప్రతి వేరియంట్‌కి తన ప్రత్యేకతలు ఉన్నాయి. డిజైన్ పరంగా ఫ్యూచరిస్టిక్ లుక్స్, లోపల మోడ్రన్ ఫీచర్లు, టాటా ట్రస్ట్‌కు తగ్గదేలా సేఫ్టీ, రేంజ్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ పరంగా హారియర్ EV ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఈ SUV మార్కెట్లోకి రావడం ద్వారా టాటా మోటార్స్ తన నమ్మకాన్ని, విజన్‌ను మళ్లీ నిరూపించుకుంది. టాటా హారియర్ EV ఎలక్ట్రిక్ SUV ప్రముఖతకు మరో కారణం దీని టెక్నికల్ స్పెసిఫికేషన్లు.

ఈ SUVలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు 65 kWh, 75 kWh లభిస్తున్నాయి. ఇవి పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 538 కి.మీ నుండి 627 కి.మీ వరకు ప్రయాణించగలవు, ఇది సిటీలోనూ, హైవే ట్రిప్‌లలోనూ పూర్తి నమ్మకాన్ని ఇస్తుంది. పర్ఫామెన్స్ పరంగా చూస్తే, హారియర్ EV గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. అంతే కాకుండా, ఇది 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగానికి వెళ్లగలదు.
ఛార్జింగ్ విషయానికి వస్తే, 7.2 kW AC ఛార్జర్ ద్వారా ఈ SUVను 10 గంటల్లో 10 శాతం నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇది ఓవర్‌నైట్ ఛార్జింగ్‌కు అనువైనదిగా ఉంటుంది. టాటా హారియర్ EVలో కేవలం బలమైన రేంజ్, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ మాత్రమే కాదు, లగ్జరీకి కూడా పూర్తిగా న్యాయం చేస్తుంది. ఈ SUV క్యాబిన్ డిజైన్ ఒక ప్రీమియం ఫీల్‌ను అందించడంలో పూర్తిగా విజయవంతమైంది.

ఇంటీరియర్ పరంగా, హారియర్ EVలో 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇది మల్టీ-ఫంక్షనల్, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్‌కు ప్రత్యేకంగా 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక AC వెంట్స్ వంటి హై-ఎండ్ ఫీచర్లు హారియర్ EVని ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ SUVగా నిలబెడుతున్నాయి.


Click it and Unblock the Notifications








