టాటా హారియర్ ఈవీ కోసం ఎగబడుతున్న జనం.. ఈ కారు బుక్ చేస్తే 7 నెలలు ఆగాల్సిందే!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను టాటా మోటార్స్ క్యాష్ చేసుకుంటుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా నెంబర్ వన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టాటా హారియర్ ఈవీ కారుకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కారు బుకింగ్‌లు గత జూలై 2వ తేదీన ప్రారంభమయ్యాయి.

కేవలం రూ.21,000 ముందస్తు చెల్లింపుతో టాటా వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ కారు కోసం ఎదురుచూసే సమయం (వెయిటింగ్ పీరియడ్) చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. కొన్ని వేరియంట్లకు ఏకంగా 7 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Tata Harrier EV

టాటా హారియర్ ఈవీ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎంపవర్డ్, అడ్వెంచర్, ఫియర్‌లెస్. ప్రతి వేరియంట్‌కు వేర్వేరు ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు, వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఎంపవర్డ్ వేరియంట్‌లో 75 kWh బ్యాటరీ ఆప్షన్ (స్టాండర్డ్, ఆల్-వీల్ డ్రైవ్) ఉంది.

AC ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ వేరియంట్‌ను AC ఫాస్ట్ ఛార్జర్‌తో బుక్ చేస్తే, వెయిటింగ్ పీరియడ్ 12-15 వారాలు (సుమారు 3-4 నెలలు) వరకు ఉంటుంది. AC ఫాస్ట్ ఛార్జర్ లేకుండా ఎంపవర్డ్ 75, ST75, ఆల్-వీల్ డ్రైవ్ 75, ఆల్-వీల్ డ్రైవ్ ST75 వంటి వేరియంట్లకు కూడా 12-15 వారాలు ఎదురుచూడాలి.

Tata Harrier EV

అడ్వెంచర్ వేరియంట్‌లో 65 kWh బ్యాటరీ ఆప్షన్ (స్టాండర్డ్, S65), AC ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్లు ఉన్నాయి. అడ్వెంచర్ 65, 65 (AC ఫాస్ట్ ఛార్జర్‌తో) మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ 28-30 వారాలు (సుమారు 6.5 - 7 నెలలు) వరకు ఉంటుంది. S65, S65 (AC ఫాస్ట్ ఛార్జర్‌తో) మోడళ్లకి వెయిటింగ్ పీరియడ్ 18-21 వారాలు (సుమారు 4.5 - 5 నెలలు) వరకు ఉంటుంది.

ఫియర్‌లెస్+ టాప్-ఎండ్ వేరియంట్‌లో 65 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లతో పాటు, AC ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా, ఫియర్‌లెస్+ వేరియంట్‌కు 18-21 వారాలు (సుమారు 4.5 - 5 నెలలు) వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. టాటా హారియర్ EVకి ఇంత డిమాండ్ ఉండటానికి కారణం దాని అడ్వాన్సుడ్ ఫీచర్లు. ఈ కారులో ఎలాంటి సౌకర్యాలున్నాయో చూద్దాం.

Tata Harrier EV

సేఫ్టీ విషయానికి వస్తే 360 డిగ్రీ వ్యూ కెమెరా, ట్రాన్స్‌పరెంట్ మోడ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, హెచ్‎డీ రియర్ వ్యూ మానిటర్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS లెవెల్ 2 (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), I-VPACతో కూడిన ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ డిసెంట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమెటిక్ హెడ్‌లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియెన్స్ లైటింగ్ వంటివి ఉన్నాయి. యాంబియెన్స్ లైటింగ్ మ్యూజిక్, డ్రైవ్ మోడ్‌తో సింక్ అవుతుంది.

వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) పవర్ షేరింగ్ ఆప్షన్లు కూడా ఈ కారులో ఉన్నాయి. అంటే, కారు బ్యాటరీ నుండి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు లేదా మరో ఈవీకి పవర్ ఇవ్వొచ్చు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా హారియర్ కారు పెట్రోల్/డీజిల్ వెర్షన్లలో ఇప్పటికే ప్రజల్లో చాలా పాపులర్. ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల కాగానే చాలా మంది బుక్ చేసుకుంటున్నారు. అందుకే ఈ కారుకు ఇంత ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ముఖ్యంగా కొన్ని వేరియంట్లకు 7 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది టాటా ఈవీలకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 26, 2025, 17:15 [IST]
English summary
Tata harrier ev book now wait 7 months high demand leads to massive waiting periods
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+