15 నిమిషాల్లోనే 250 కి.మీలు.. శక్తివంతమైన టాటా కారు వచ్చేసింది.. ధర, బ్యాటరీ, ఫీచర్స్ వివరాలు ఇవే!

భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన కొత్త ఎలక్ట్రిక్ SUV - హారియర్ EVను ఎట్టకేలకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల అధికారికంగా విడుదలైన ఈ కారుకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. స్టైల్, టెక్నాలజీ, పనితీరు అన్ని కోణాల నుంచి ఈ టాటా కారుకు ఆదరణ వచ్చింది. పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారంగా పనిచేసే ఈ SUVని కంపెనీ రూ. 21.49 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఈ ధరను దృష్టిలో ఉంచుకుంటే, ఇది ప్రీమియం సగటు SUV సెగ్మెంట్‌లోని ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వగలదని అనిపిస్తోంది. ఈ కారులో టాటా AI-ఆధారిత ఫీచర్లు, పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ టెక్నాలజీ, లగ్జరీ క్లాస్ ఫినిషింగ్ వంటి వాటిని అందించింది. దీని గురించి మరిన్ని వివరాలు కింద చూడండి.

డిజైన్: టాటా హారియర్ EV డిజైన్, కలర్స్ పరంగా అందరిని ఆకట్టుకుంటుంది. కారులో స్లీక్ LED హెడ్‌లైట్లు, దానికి తగ్గట్టుగా ఉండే LED డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి, ఇవి రాత్రి సమయంలో మాత్రమే కాకుండా, రోజంతా ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. అలాగే, SUVకి సైడ్ ప్రొఫైల్‌లో ఒక స్పోర్టీ అటిట్యూడ్‌ని తీసుకురావడంలో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటివల్ల కారు డ్రైవింగ్ బీస్ట్‌లా కనిపిస్తుంది.

Tata Harrier Ev

హారియర్ EV మూడు ప్రత్యేకమైన కలర్ షేడ్స్‌లో లభిస్తోంది. గంభీరంగా ఉండే స్టీల్త్ బ్లాక్ (Stealth Black) కారుకు ఒక పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. మెటాలిక్ టచ్‌తో ఉండే ఎంపవర్డ్ ఆక్సైడ్ (Empowered Oxide), స్టైల్, సింప్లిసిటీ కలగలిపిన ప్యూర్ గ్రే (Pure Grey) కారుకు కొత్త అందాన్ని తీసేుకువచ్చాయి. రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి, ఈ కారులో ఇచ్చే కలర్స్ ఒక స్టేట్‌మెంట్ లా మారతాయి.

బ్యాటరీ అండ్ రేంజ్: ఈ ఎలక్ట్రిక్ SUV రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లోకి వచ్చింది. 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఈ కారులో సింగిల్, డ్యూయల్ మోటార్ ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ మోటార్ వెనుక చక్రాల డ్రైవ్, డ్యూయల్ మోటార్ సెటప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో లభిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీ ప్యాక్ ద్వారా ఈ కారు 627 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

Tata Harrier Ev Design Battery

ఇది దాదాపుగా హైదరాబాద్ నుండి ముంబై వరకు దూరం. ఇది 0-100 కి.మీ. వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుంది. టాటా వాహనాలలో ఇప్పటివరకు వచ్చిన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలుస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. 120 kW DC ఫాస్ట్ ఛార్జర్ కేవలం 15 నిమిషాల్లోనే 250 కి.మీ. రేంజ్ అందగలదు. బస్సు స్టాప్ వద్ద కాఫీ తాగేసరికి, మళ్లీ జర్నీకి సిద్ధంగా ఉంటుంది.

ఇతర అంశాలు: ఈ కారులో 5 సీట్లు ఉన్నాయి. ప్రయాణీకులు హాయిగా కూర్చుని ప్రయాణించవచ్చు. సెలవు రోజుల్లో టూర్స్‌ కోసం ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది 502 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ప్రయాణికులకు అవసరమయ్యే చాలా ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. ఇందులో 14.5-అంగుళాలు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే సెటప్ కూడా ఉంటుంది.

Tata Harrier Ev Design

ఇంకా, ఇది పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ కలిగి ఉండటం విశేషం. అదనంగా యాంబియంట్ లైటింగ్, సౌకర్యంగా కూర్చోడానికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, విండో సన్‌బ్లైండ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం JBL బ్లాక్ 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇది 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ అంశాలను కూడా కలిగి ఉంది.

ధర, వేరియంట్లు: ఈ కారుకు నిర్ణయించబడిన ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా)గా ఉంది. ఈ ధరతో ఇది మధ్యస్థ, ప్రీమియం సెగ్మెంట్ లో నిలబడి, పోటీ పడే స్థాయిలో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇది ప్రధానంగా మూడు వేరియంట్లు అడ్వెంచర్ (Adventure),ఫియర్‌లెస్ (Fearless),ఎంపవర్డ్ (Empowered)లలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 4, 2025, 17:15 [IST]
English summary
Tata harrier ev design battery range specifications and variants all top things details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+