యాక్సిడెంట్ అవుతుందన్న భయం లేకుండా ఈ టాటా ఈవీ కారును కొనచ్చు! పెద్దలు, పిల్లల సేఫ్టీలో ఏకంగా 5 స్టార్

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది టాటా మోటార్స్ (tata motors). ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లు ప్రమాదాల్లోనూ ప్రయాణికులను ఎంతగానో కాపాడతాయనే పేరు సంపాదించుకున్నాయి. గతంలో టాటా కార్లు Bharat NCAP (భారత్ ఎన్‌‌క్యాప్) క్రాష్ టెస్ట్‌లలో వరుసగా 5-స్టార్ సేఫ్టీ రేటింగులు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే ట్రెడిషన్‌ను కొనసాగిస్తూ టాటా హారియర్ ఈవీ (tata harrier ev) తన మొదటి క్రాష్ టెస్ట్‌లోనే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి మరోసారి టాటా గౌరవాన్ని పెంచింది. ఎలక్ట్రిక్ SUVల విభాగంలో ఇది సాధించిన ఈ ఘనత, భద్రతతోపాటు పనితీరులోనూ ఈ కారు ఎలాంటి ప్రమాణాలు పాటించిందో స్పష్టంగా తెలియజేస్తోంది.

సాధారణంగా ఈవీ వాహనాల్లో చాలామంది ముందుగానే బ్యాటరీ సేఫ్టీ, కన్స్ట్రక్షన్ స్టబిలిటీ, ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటి అంశాలపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ హారియర్ EV వాటన్నిటికీ సమాధానం చెప్పినట్లైంది. పిల్లలు, పెద్దలు.. అందరినీ కాపాడగల ఆల్-రౌండ్ ప్రొటెక్షన్ అందించగల ఈ SUV, వాస్తవంగా భారతీయ కుటుంబాలకు భద్రతా పరంగా గ్యారెంటీ ఇచ్చే కారుగా ఇకమీదట నిలవనుంది.

Harrier EV Has Received 5 Star Safety Rating Crash Test

ఇంతకుముందు వాగమోన్‌లోని ఎలిఫెంట్ రాక్ వంటి కఠిన మార్గాలను అధిగమించగలదని కానీ హారియర్ EV ఇప్పటికే నిరూపించింది. అంటే, ఇది స్టైల్‌గా కనిపించడమే కాదు, అవసరమైన సందర్భాల్లో శక్తివంతంగా రియాక్ట్ అయ్యేలా డిజైన్ చేయబడింది. మరో ముఖ్యమైన విషయం ఈ 5-స్టార్ రేటింగ్ హారియర్ EV అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. Bharat NCAP క్రాష్ టెస్ట్‌లలో హారియర్ EV సాధించిన రిజల్ట్‌లు చూస్తే, ఈ కారును నమ్మకంగా కొనచ్చు.

భారత NCAP క్రాష్ టెస్ట్‌ వివరాలను ఒకసారి చూసినట్లయితే, పెద్దల సేఫ్టీ విభాగంలో హారియర్ EV అద్భుతమైన స్కోర్ సాధించింది. మొత్తం 32లో 32 పాయింట్లు సాధించి, ఇది పూర్తి భద్రతా ప్యాకేజీ అని నిరూపించుకుంది. అంటే డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరికీ అన్ని యాంగిల్స్ నుంచి పట్టు కలిగిన రక్షణ ఉండేలా వాహనం రూపొందించబడింది. పిల్లల భద్రత విషయంలోనూ హారియర్ EV వెనుకపడలేదు.

Bncap Harrier Crash Test

49లో 45 పాయింట్ల స్కోర్‌ను సాధించి, కుటుంబాలతో ప్రయాణించే వారు అత్యధికంగా నమ్మే SUVగా నిలబడింది. ఇది కేవలం సీటు బెల్ట్‌లు లేదా ఎయిర్‌బ్యాగ్స్ మాత్రమే కాదు , పిల్లల భద్రత పరంగా డైనమిక్ ప్రొటెక్షన్, అన్ని ప్రామాణిక అంశాలలో హారియర్ EV అత్యుత్తమంగా రాణించింది. భారత్ NCAP డైనమిక్ టెస్ట్‌లలో, పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్షల్లో హారియర్ EV మొత్తం 24 పాయింట్లకు 24 పాయింట్లు సాధించింది.

ఇంకా, 18 నెలల, 3 సంవత్సరాల వయస్సు గల వారి కోసం ప్రత్యేకంగా వెనుక ఏర్పాటు చేసిన i-సైజ్ సీటింగ్ ఇన్‌స్టాలేషన్‌లకు కూడా 12కి 12 పాయింట్లు లభించాయి. అంటే, చిన్న పిల్లలను తీసుకెళ్లే సమయంలో కూడా ఈ కారు భద్రతను కల్పిస్తుందని స్పష్టమవుతోంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో హారియర్ EV ప్రతి టెస్ట్‌లో 16కి 16 పాయింట్లను సాధించింది.

Harrier EV Has Received 5 Star Safety Rating In Bncap

అంటే ముందు భాగం నుండి ఎదురయ్యే ప్రమాదాల్లో గానీ, పక్క నుంచి గానీ ప్రయాణికులకు గరిష్ట రక్షణ లభించేలా టాటా మోటార్స్ అతి జాగ్రత్తగా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఇంకా, వాహన అసెస్‌మెంట్ విభాగంలో 13 పాయింట్లకు 9 పాయింట్లు సాధించింది. ఇది డిజైన్ స్టబిలిటీ, తయారీ నాణ్యత, బ్రేకింగ్ సిస్టమ్, ప్యాసింజర్ క్యాబిన్ స్టెబిలిటీ వంటి అంశాలలో హారియర్ EV పటిష్టంగా ఉందని చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణ.

టాటా హారియర్ EV రెండు బ్యాటరీ ప్యాక్ 65 kWh, 75 kWhలలో అమర్చబడి ఉంటుంది.ఈ బ్యాటరీ ప్యాక్‌లో RWD, QWD అనే రెండు మోటార్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. 75 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్నటువంటి RWD వేరియంట్‌లు ఒకే ఛార్జ్‌పై 627 కి.మీ.ల రేంజ్ అందిస్తాయని కంపెనీ తెలిపింది. RWD వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షల నుండి రూ. 27.49 లక్షల వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2025, 15:55 [IST]
English summary
Tata harrier ev has received 5 star safety rating tn the bharat ncap crash test
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+