బుక్ చేసుకున్న వారికి పండుగే.. ఈ నెలలోనే రోడ్డు మీద దర్జాగా తిరగనున్న టాటా హారియర్ ఈవీ

ఇండియన్ కస్టమర్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా హారియర్‌ ఈవీ ఒకటి. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. గత నెల జూన్ 27న టాటా హారియర్‌ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత, జూలై 2న ఈ కారుకు బుకింగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు పుణెలోని టాటా ఫ్యాక్టరీలో హారియర్‌ ఈవీ ఉత్పత్తి కూడా అధికారికంగా మొదలైంది.

దీంతో బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ జూలై నెలలోనే టాటా హారియర్‌ ఈవీ డెలివరీలు మొదలవనున్నాయి. ఈ వార్త హారియర్‌ ఈవీ కోసం ఎదురుచూస్తున్న భారతీయ కస్టమర్లకు నిజంగా పెద్ద సంతోషాన్ని ఇచ్చింది. టాటా హారియర్‌ ఈవీలో మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. అవి 65kWh, 75kWh.

Tata Harrier EV

65kWh బ్యాటరీ కేవలం రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని డ్రైవింగ్ రేంజ్ 538 కిలోమీటర్లు ఉంటుందని టాటా మోటార్స్ చెబుతోంది. 75kWh బ్యాటరీ ప్యాకులో రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి.

75kWh రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ డ్రైవింగ్ రేంజ్ 627 కిలోమీటర్లు. 75kWh ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ డ్రైవింగ్ రేంజ్ 622 కిలోమీటర్లు. ఇంత మంచి రేంజ్ ఆఫర్ చేయడంతో లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా హారియర్‌ EVలో చాలా ఫీచర్లు ఉన్నాయి. లెవెల్ 2 ADAS, ప్రయాణికుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వర్షం పడితే ఆటోమెటిగ్గా పనిచేసే వైపర్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమెటిక్ హెడ్‌లైట్లు ఇవి వెలుతురును బట్టి హెడ్‌లైట్లు ఆటోమెటిగ్గా ఆన్/ఆఫ్ అవుతాయి.

Tata Harrier EV

పనోరమిక్ సన్‌రూఫ్ టాటా హారియర్‎లో లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో టాటా హారియర్‌ ఈవీ మార్కెట్లోకి వచ్చింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న టాటా హారియర్‌ ఈవీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్ ధర రూ.30.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత మార్కెట్లో మహీంద్రా XEV 9e లాంటి ఎలక్ట్రిక్ కార్లకు టాటా హారియర్‌ ఈవీ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. రాబోయే నెలల్లో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కస్టమర్లకు మంచి రేంజ్, అద్భుతమైన ఫీచర్లతో పాటు సరసమైన ధరలో ఈవీలు అందుబాటులోకి వస్తున్నందుకు ఇది చాలా మంచి విషయం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 5, 2025, 11:11 [IST]
English summary
Tata harrier ev is here indias awaited car production starts competitors trouble has begun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+