ఎంజీ, మహీంద్రాకు చుక్కలే.. ఒక్క ఛార్జ్‌తో 500 కిమీ.. జూన్ 3న టాటా హారియర్ ఈవీ వచ్చేస్తోంది
అమ్మకాల పరంగానే కాదు, వేర్వేరు ధరల శ్రేణుల్లో అనేక రకాల మోడళ్లను విడుదల చేస్తూ టాటా మోటార్స్ భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఇప్పుడు కేవలం ఒకే ఒక్క మోడల్ అయిన విండ్‌సర్‌తో ఎంజీ టాటాను వణికిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలతో మహీంద్రా కూడా ఎదుగుతోంది. ఈ పరిస్థితుల్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేసి ఎంజీని, మహీంద్రాను అధిగమించాలని టాటా ప్రయత్నిస్తోంది.
రాబోయే కొద్ది నెలల్లో హారియర్ ఈవీ, సఫారి ఈవీ, సియెర్రా ఈవీ, అవిన్య ఈవీ వంటి కొత్త ఈవీ మోడళ్లను విడుదల చేయడానికి టాటా ప్లాన్ చేస్తోంది. వీటిలో హారియర్ ఈవీ మొదట విడుదల కానుంది. భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన కార్ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ ప్రస్తుత లైనప్‌లో ఇదే ప్రీమియం మోడల్ కానుంది. ఇప్పుడు హారియర్ ఈవీ లాంచ్ తేదీ వెల్లడైంది. దాని గురించి వివరంగా చూద్దాం.

2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారు ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించింది. మొదటిసారి చూసినప్పటి నుంచి కంపెనీ దీని టీజర్‌లను కూడా షేర్ చేసింది. ఇప్పుడు టాటా కొత్త ఈవీ కోసం ఎదురుచూపులు ముగియనున్నాయి. 2025 జూన్ 3న టాటా హారియర్ ఈవీ అధికారికంగా విడుదల కానుంది.
టాటా కొత్త Acti.ev (జనరల్ 2) ఆర్కిటెక్చర్‌పై హారియర్ ఈవీని నిర్మించారు. ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించబడింది. బ్యాటరీని ఫ్లోర్‌లో అమర్చడం వంటి కొన్ని ప్రత్యేక మార్పులు ఈవీ కోసం చేశారు. హారియర్ ఈవీ ఖచ్చితమైన బ్యాటరీ సామర్థ్యాన్ని టాటా ఇంకా వెల్లడించలేదు. ఇది 55 kWh కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. టాటా హారియర్ ఈవీ స్పెషాలిటీ దాని రేంజ్.

టాటా మాత్రమే కాదు ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న ఈవీల గురించి ప్రధాన ఫిర్యాదు వాటి తక్కువ రేంజ్. టాటా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెబుతున్నారు. ఇది టాటా C75 టెస్టింగ్ ప్రకారం ఉన్న రేంజ్ లెక్కలు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ వస్తే, ఇకపై దూర ప్రయాణాలు కూడా ధైర్యంగా వెళ్లవచ్చు.
అంటే హారియర్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఈజీగా వెళ్లొచ్చు. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ కారు ఏ రకమైన రోడ్లనైనా అధిగమించడానికి డ్రైవర్లను అనుమతిస్తుంది. రియర్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 500Nm టార్క్ అందిస్తుంది. పికప్ స్పీడ్, స్ట్రాంగ్ ఆఫ్-రోడింగ్ కెపాసిటీతో ఈ కారు చాలా మందిని ఆకర్షిస్తుంది.

డిజైన్ పరంగా చూస్తే టాటా హారియర్ ఈవీ దాని ఐసీ ఇంజిన్ వెర్షన్‌తో చాలా సారూప్యతలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, మార్పు కోసం ఈవీ-స్పెసిఫిక్ అంశాలు జోడించబడ్డాయి. దీనికి క్లోజ్డ్ గ్రిల్ (షీల్డ్ ఫ్రంట్ గ్రిల్), ఈవీ బ్యాడ్జింగ్, సిల్వర్ బాడీ క్లాడింగ్, ఆకర్షణీయమైన లైటింగ్, కనెక్టెడ్ లైట్ బార్‌ను టాటా అందించింది. కొత్త 'టర్బైన్-బ్లేడ్' స్టైల్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ ఎస్‌యూవీకి ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ టచ్‌ను అందిస్తాయి.
ఇది ప్రీమియం మోడల్ కాబట్టి దాని గొప్పదనం లోపల కూడా చూడవచ్చు. డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెర్రైన్ మోడ్‌ల కోసం రోటరీ డయల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. దీనితో పాటు, కొత్త కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓటీఏ అప్‌డేట్‌లు, అధునాతన డ్రైవింగ్ మోడ్‌లు కూడా అందించబడతాయి.

భారతదేశంలోని ప్రీమియం ఈవీ విభాగాన్ని రీజనరేట్ చేసేందుకు వస్తున్న టాటా హారియర్ ఈవీ ధర సుమారు 25 లక్షల నుండి 30 లక్షల రూపాయల వరకు ఎక్స్‌షోరూమ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ధర శ్రేణిలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ ZS ఈవీ, రాబోయే మారుతి ఈవిటారా కంటే ఒక అడుగు ముందుంటుంది హారియర్ ఈవీ. BYD ఈమాక్స్ 7 మోడల్‌కు కూడా హారియర్ ఈవీ గట్టి పోటీనిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








