ఇండియాలో అందరి నోట ఈ కారు గురించే.. సొంతం చేసుకోవాలంటే 10 వారాలు ఆగాల్సిందే!

టాటా మోటార్స్ (tata motors) ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టిన హారియర్ EV దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలతోనే ఈ కారు చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగి, ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జూలై 2న బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 10,000 బుకింగ్‌లు నమోదు కావడం హారియర్ EVపై ఉన్న ప్రజల అంచనాలు ఎంత ఎక్కువో స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం ప్రారంభంలోనే కాకుండా, బుకింగ్ వేగం ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగడం మరో విశేషం. టాటా ఈ కారులో మెరుగైన టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్ ప్యాకేజ్‌ను అందించింది. ఫలితంగా, కొనుగోలు దారుల్లో ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హై-స్పెక్ వేరియంట్‌లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉంది.

ప్రస్తుతం ఈ కారుకి 10 వారాల వరకు వేటింగ్ లిస్టు ఉండటం, ఈ SUV మార్కెట్లో ఎంత హాట్ ప్రోడక్ట్‌గా ఉన్నదో తెలుస్తుంది. ఈ SUVను కొనాలనుకునే వారు కొంచెం ఓర్పు చూపాల్సిందే. డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఉత్పత్తి-డెలివరీ మధ్య ఉన్న గ్యాప్ పెరిగింది. అందుకే 10 వారాల వరకూ వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ కారు కస్టమర్లను బాగా ఆకట్టుకోవడం కారణంగా అధికంగానే బుకింగ్స్ వచ్చాయి.

Tata Harrier Ev Long Waiting Period 10 Weeks More Details Inside

ముఖ్యంగా మిడ్-స్పెక్ మోడల్, టాప్-ఎండ్ మోడల్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ధర, ఇతర వివరాలను చూసినట్లయితే, రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్‌లు రూ.21.49 లక్షల నుంచి రూ.27.49 లక్షల వరకు ఉంటాయి. టాటా తన RWD మోడళ్లకు మంచి పవర్ డెలివరీ, స్థిరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించింది. ఇంత పెద్ద ఎలక్ట్రిక్ SUV ఈ ధరల దగ్గర అందుబాటులో రావడం భారతీయ మార్కెట్‌కి నిజంగానే అదృష్టం‌గా చెప్పుకోవచ్చు.

మరింత అధిక పనితీరు కోరుకునే డ్రైవర్‌లను దృష్టిలో పెట్టుకుని టాటా QWD (AWD) వ్యవస్థను కూడా అందిస్తోంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌లు రూ.28.99 లక్షల నుండి రూ.30.23 లక్షల మధ్య ధరలో లభిస్తాయి. ఇలాంటి శక్తివంతమైన సెటప్‌తో రోడ్డు పైనైనా, ఆఫ్-రోడ్ పైనైనా నమ్మకంగా డ్రైవ్ చేయగల SUVగా హారియర్ EV నిలుస్తోంది. 65 kWh, 75 kWh అనే రెండు శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

Tata Harrier Ev Long Waiting Period 10 Weeks More Details Inside

75 kWh బ్యాటరీతో వచ్చే స్టీల్త్ ఎడిషన్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పనితీరు పరంగా చూస్తే, 65 kWh వెనుక చక్రాల డ్రైవ్ వెర్షన్ 538 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక 75 kWh వెర్షన్ విషయంలో 622 కి.మీ వరకు రేంజ్ అందుతుంది. వాస్తవ ప్రపంచ డ్రైవింగ్‌లో కూడా 500 కి.మీకు పైగా సులభంగా అందుకోగలదని నమ్మకంగా చెప్పొచ్చు.

భద్రతా విషయంలో టాటా హారియర్ EV మరొకసారి తన శక్తి, నాణ్యతను నిరూపించుకుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో హారియర్ EV అద్భుతమైన ఫలితాలను సాధించింది. మొత్తం 32 పాయింట్లలో 32 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించడం ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ISOFIX మౌంట్స్, సెటప్ స్టెబిలిటీ, పర్ఫెక్ట్ క్రాష్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం.

Tata Harrier Ev Long Waiting Period 10 Weeks More Details Inside

క్రాష్ టెస్టుల్లో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 16 పాయింట్లు, అలాగే సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో కూడా 16 పాయింట్లకు 16 పాయింట్లు సాధించడం నిజంగా గొప్ప విషయం. ఈ రెండు పరీక్షల్లో పర్ఫెక్ట్ స్కోర్ రావడం అంటే కారు నిర్మాణ మృదుత్వం, సామర్థ్యం, బాడీ రిజిడిటీ అన్నీ అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయని నిరూపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 10, 2025, 16:31 [IST]
English summary
Tata harrier ev long waiting period 10 weeks more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+