ఇంత బ్లాక్ బ్యూటీ ఎప్పుడైనా చూశారా? 622 కి.మీ రేంజ్‌తో కొత్త స్టెల్త్ ఎడిషన్.. ఒక్కసారి చూసినవారంతా ఫిదా!
ప్రముఖ కార్ల తయారీదారు అయినటువంటి టాటా మోటార్స్ (tata motors) కొత్తగా 2025 టాటా హారియర్ EV ని కొత్త రూపంలో విడుదల చేసింది. దీని పేరు స్టెల్త్ ఎడిషన్ (Stealth Edition). ఇది పూర్తి స్థాయిలో టాప్-స్పెక్ ఎంపవర్డ్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ దీని ధరను రూ.28.24 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ప్రీమియమ్ బ్లాక్ అవతారం, అత్యాధునిక సౌకర్యాలు, ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్‌తో కలిపి, ఇది భారత మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ SUV లలో ఒక విశిష్టమైన స్థానం ఆక్రమిస్తుందని చెప్పవచ్చు. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ స్టెల్త్ బ్లాక్ బాడీ పెయింట్‌తో ఒరిజినల్, అసాధారణమైన లుక్‌ను అందిస్తుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ సరికొత్తగా అనిపిస్తుంది. ఇంటీరియర్‌లో కూడా బ్లాక్ థీమ్ బాగా ఆకట్టుకుంటుంది.
ఈ కారులో ప్రధాన ఆకర్షణగా 19-అంగుళాల బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్. వీటితో పాటు, సిగ్నేచర్ స్టెల్త్ ఎడిషన్ బ్యాడ్జింగ్, లోపల, బయట చెక్కిన ప్రత్యేక గుర్తింపులు ఈ ఎడిషన్‌కు స్పెషల్ ఆకర్షణను తీసుకువస్తాయి. కొన్ని కాస్మెటిక్ మార్పులు తప్ప, స్టెల్త్ ఎడిషన్‌లో సాధారణ హారియర్ EV మోడళ్లకు లభించే అత్యాధునిక ఫీచర్లు అన్నీ ఉన్నాయి. దాని సొగసైన బ్లాక్ అవతారం వెనుక, అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యాలు దాగివుంటాయి.

ఇది శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, టాటా మోటార్స్ 75 kWh సామర్థ్యాలున్న బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తుంది. స్టెల్త్ ఎడిషన్ రెండు రకాల డ్రైవ్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది, అంటే వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను పొందుతారు. పూర్తి ఛార్జ్ మీద ఇది 622 కి.మీ వరకు రేంజ్ అందించగలదు.
స్టెల్త్ ఎడిషన్ భారతీయ ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో అత్యధిక రేంజ్ కలిగిన మోడళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ కారులో మొత్తం 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది, ఇది డ్రైవింగ్‌కి మరింత సౌలభ్యం, నమ్మకాన్ని తీసుకువస్తుంది. డ్రైవర్ సీటు 6-వే పవర్ అడ్జస్ట్‌మెంట్‌తో వస్తుంది, ఇంకా మెమరీ ఫంక్షన్ కూడా కలిగి ఉంటుంది, ఒక క్షణంలో మీ సీటు పొజిషన్‌ను సెట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది.

అలాగే, పెద్దదైన పనోరమిక్ సన్‌రూఫ్ , ప్రకాశవంతమైన బయటి వాతావరణాన్ని చూడటానికి అనుకూలంగా ఉంటుంది. ఇంటీరియర్ సెంటర్‌లో ఉండే శామ్‌సంగ్-పవర్డ్ 14.53 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అన్ని స్మార్ట్ కనెక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. దానికి తోడు, JBL ఆడియో సిస్టమ్ వలన మ్యూజిక్‌కు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. రోడ్ల పరిస్థితులకు తగ్గట్టుగా టెర్రైన్ రెస్పాన్స్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇవన్నీ కలిపి, స్టెల్త్ ఎడిషన్ కేవలం స్టైలిష్ కాస్మెటిక్ ప్యాకేజ్ మాత్రమే కాకుండా, టాటా హారియర్ EVలో దొరికే అన్ని ఫీచర్లను సమగ్రంగా అందించే ప్రత్యేక వెర్షన్‌గా నిలుస్తుంది. ప్రయాణికుల భద్రత విషయానికి వస్తే, హారియర్ EVను టాటా మోటార్స్ అన్ని వేరియంట్లతో పాటు ప్రత్యేక స్టెల్త్ ఎడిషన్‌లోనూ ఏడు ఎయిర్‌బ్యాగులు అందించింది. ఇవి ప్రమాద సమయంలో పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తాయి.

ఇంకా, డ్రైవింగ్‌ను మరింత సులభం చేయడానికి, 360-డిగ్రీ సౌరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్ లభిస్తుంది. ఇది కారు చుట్టూ ఉన్న పరిస్థితులను క్లియర్‌గా చూపిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వలన విపత్కర పరిస్థితుల్లో కారు కంట్రోలింగ్ కోల్పోకుండా నిలిచేలా చేస్తుంది. ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ముందు-వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహనం పార్కింగ్ సమయంలో సౌకర్యాన్ని, భద్రతను మరింత పెంచుతాయి.
తదుపరి స్థాయిలో, హారియర్ EVలో లెవల్-2 ADAS ఫీచర్లు ఉంటాయి. ఇవి క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్టెన్స్ వంటి ఆధునిక డ్రైవింగ్ సాంకేతికతలతో ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. భద్రత పరంగా ఈ వాహనం అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు పొందింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ BNCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకోవడం టాటా హారియర్ EVకు గర్వకారణం.


Click it and Unblock the Notifications








