కొండలు, గుట్టలు అవలీలగా ఎక్కేస్తుంది.. రూ.50,000 తక్కువకే టాటా హారియర్ నయా మోడల్
భారతదేశంలో కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్ తమ ప్రముఖ హారియర్ ఎస్‌యూవీలో మరిన్ని మార్పులతో కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. కొత్తగా వచ్చిన అడ్వంచర్ X, అడ్వంచర్ X+ వేరియంట్‌ల ధరలు రూ.18.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది పాత మోడల్‌తో పోలిస్తే ఏకంగా రూ.55,000 వరకు తక్కువ. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త హారియర్ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
టాటా మోటార్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ అయిన హారియర్‌లో కొత్త వేరియంట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అవే అడ్వెంచర్ X, X+ వేరియంట్లు. పాత అడ్వెంచర్ వేరియంట్‌లతో పోలిస్తే, కొత్త వేరియంట్‌ల ధరను దాదాపు రూ. 50,000 వరకు తగ్గించింది. కానీ ఫీచర్లలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదు. ఈ కొత్త వేరియంట్ల ప్రారంభ ధర రూ. 18.99లక్షలుగా ఉంది. అక్టోబర్ 31, 2025వరకు మాత్రమే ఈ ధరలు చెల్లుబాటులో ఉంటాయి.

కొత్త హారియర్ అడ్వెంచర్ వేరియంట్‌ల డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. పాత మోడల్ లాగే ఇది కూడా చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త వేరియంట్‌లు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తాయి. అలాగే సీవీడ్ గ్రీన్ అనే ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్ కలర్ (టాప్-స్పెక్ వేరియంట్లలో కూడా ఇది లభిస్తుంది), డ్యుయల్-టోన్ బ్లాక్, ట్యాన్ ఇంటీరియర్ థీమ్ ఈ అడ్వెంచర్ X ట్రిమ్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, ఆటో వైపర్స్ అనే అదనపు ఫీచర్ ఇందులో ఉంది. పాత మోడల్‌లో ఉన్నట్లుగానే పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి యధావిధిగా ఉన్నాయి.

అడ్వెంచర్ X+ వేరియంట్‌లో అడ్వెంచర్ X వేరియంట్ ఫీచర్లతో పాటు రియర్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) సూట్ కూడా లభిస్తాయి. అయితే, పాత అడ్వెంచర్+, అడ్వెంచర్+ A వేరియంట్‌లలో ఉన్న 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కొత్త వేరియంట్‌ల నుంచి తొలగించారు.
టాటా హారియర్‌కు గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ కారులో డ్రైవర్ డోస్ ఆఫ్ అలర్ట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, క్వాడ్ డిస్క్ బ్రేకింగ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కొత్త అడ్వెంచర్ వేరియంట్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ADAS ఫీచర్ లభిస్తుంది. ఈ ధరలో ఈ ఫీచర్ లభించడం ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫీచర్ ఆటోమేటిక్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 167 bhp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తుంది.
టాటా హారియర్ ఎస్‌యూవీలో వివిధ వేరియంట్లు ఉన్నాయి. టాటా హారియర్ బేస్ వేరియంట్ స్మార్ట్ ధర రూ.14,99,990. ఇది బేస్ మోడల్ అయినప్పటికీ, ఇందులో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లు లభిస్తాయి. దీని తర్వాత వచ్చే ప్యూర్ X వేరియంట్ ధర రూ.17,99,000. ప్యూర్ X వేరియంట్‌లో స్మార్ట్ వేరియంట్ కంటే కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయి.
కొత్తగా విడుదలైన అడ్వెంచర్ X వేరియంట్ ధర రూ.18,99,000. పాత అడ్వెంచర్ మోడల్ కంటే ఇది రూ.55,000 తక్కువ ధరలో లభిస్తుంది. దీనిలో అదనపు ఫీచర్లను అందిస్తారు. అడ్వెంచర్ X+ వేరియంట్ ధర రూ.19,34,000. ఇది అడ్వెంచర్ X కంటే మరింత అడ్వాన్సుడ్ ఫీచర్లతో వస్తుంది.
టాటా హారియర్ టాప్-ఎండ్ మాన్యువల్ వేరియంట్లు ఫియర్‌లెస్ X, ఫియర్‌లెస్ X+. ఫియర్‌లెస్ X ధర రూ.22,34,000. ఇందులో చాలా ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ఇక అన్నిటికంటే అత్యున్నత మోడల్ అయిన ఫియర్‌లెస్ X+ ధర రూ.24,44,000. ఇందులో ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఈ ధరలను బట్టి చూస్తే అవసరాలు, బడ్జెట్‌ను బట్టి టాటా హారియర్‌లో సరైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








