సింగిల్ ఛార్జ్‌ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హాయిగా వెళ్లొచ్చు.. టాటా నుంచి కొత్త ఈవీ ఆవిష్కరణ

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతుంది. ఇండియాలో ఈవీలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో కంపెనీ వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం హ్యుందాయ్, మహీంద్రా, కియా మోటార్స్ వంటి వాహన తయారీదారులు ఈవీ సగ్మెంట్‌లో మంచి మార్కెట్ కలిగి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కూడా ఈవీ కారును తీసుకురావడంతో ఈ విభాగంలో పోటీ మరింత పెరిగింది. దీంతో భారత ప్రజలకు అత్యంత సేఫ్టీ ప్రమాణాలతో అత్యుత్తమైన నాణ్యతతో కార్లను తీసుకువస్తుందనే ప్రసిద్ధ పేరు కలిగిన టాటా మోటార్స్ ఇప్పుడు తన హారియర్ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ (Harrier Suv Electric) రూపంలో ఆవిష్కరించింది.

ఇప్పటికే టాటా హారియర్ ఎస్‌యూవీ ICE వెర్షన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే కొత్త ఏడాదిలో దీన్ని ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చింది. గతంలో మొదట హారియర్ EV కాన్సెప్ట్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ICE ప్లాట్‌ఫారమ్‌తో పోలిస్తే ఇది అప్‌డేట్‌డ ఫీచర్స్‌తో వచ్చింది.

Tata Harrier New Electric Suv Car

టాటా హారియర్ EV డిజైన్ ICE వేరియంట్ మాదిరిగా ఉంటుంది. కర్వ్ కాన్సెప్ట్ చూసినట్లయితే కొద్ది పాటు మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దగా అయితే ఎలాంటి కొత్త మార్పులు కనిపించడం లేదు. కొత్త గ్రిల్, అధునాతన LED ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ కారు ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది.

ఈ కారులో వెహికల్-టు-వెహికల్ (V2V),వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్ కెపాసిటీలు ఉన్నాయి. కనెక్ట్ చేయబడిన కార్ టెక్, కొత్త టెర్రైన్ మోడ్‌లు, క్లౌడ్-కనెక్ట్ టెలిమాటిక్స్ వంటివి ఉంటాయి. హారియర్ పెట్రోల్, డీజిల్ కార్లతో కొత్త ఈవీలో లోపల కొత్త మార్పులు ఉన్నాయి. కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌, కనెక్టివిటీ, ADAS వంటి ఫీచర్స్ ఉన్నాయి.

టాటా హారియర్ EVలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. దీంతో కారుకు ఎక్కువ శక్తి అందుతుంది. దీనిలో అమర్చిన బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే ఏకంగా 500 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంటుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, దీనిలో పెద్ద 75 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించి ఉంటారని తెలుస్తుంది. అలాగే మరో బ్యాటరీ ఆప్షన్‌లో కూడా లభించవచ్చు.

టాటా మోటార్స్ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే మార్కెట్లో పలు మోడళ్లను కూడా విజయవంతంగా విక్రయిస్తుంది. Tata Nexon EV, Tigor EV, punch Ev, Tiago EV, Tata కర్వ్ ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త కారు కూడా త్వరలో అమ్మకానికి అందుబాటులోకి రాబోతుంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2025, 20:58 [IST]
English summary
Tata harrier new electric suv car unveiled in auto expo 2025 all details check
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+