టాటా కంపెనీకి బంగారు గుడ్డులా మారిన కారు.. ఒకే నెలలో రెట్టింపు కన్నా ఎక్కువ అమ్మకాలు
టాటా మోటార్స్ (tata motors) లైనప్‌లో హారియర్ (harrier) ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం సంపాదించిన SUV. దీని బలమైన డిజైన్, నమ్మకమైన పనితీరు,ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ ఇప్పటికే వినియోగదారుల మన్ననలు పొందాయి. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, హారియర్ మీద ఉన్న ఈ క్రేజ్ ఎంతగానో పెరుగుతోందని స్పష్టమవుతోంది. అక్టోబర్ 2025లో టాటా హారియర్ 4,483 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ సంఖ్య చూస్తే సాధారణ పెరుగుదల కాదు, గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,947 యూనిట్లతో పోలిస్తే 130% వృద్ధి. ఒకే సంవత్సరంలో రాబడిన ఈ భారీ పెరుగుదల హారియర్ మార్కెట్లో మళ్లీ తన దమ్ము చూపించిందనే చెప్పాలి.
ఇటీవల వచ్చిన పండుగ సీజన్ కూడా టాటా అమ్మకాలపై భారీగా ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా ఉన్న టాటా షోరూమ్‌లు పండుగ ఫెస్టివిటీతో కళకళలాడితే, అందులో హారియర్‌కి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా నిలిచింది. హారియర్‌ను చూసేందుకు, టెస్ట్ డ్రైవ్ చేయేందుకు, బుకింగ్ చేసేందుకు వచ్చిన కస్టమర్ల రద్దీ షోరూమ్‌లకు మరింత వేడి తెచ్చింది. ఈ డిమాండ్ టాటా మోటార్స్‌కు మరో పెద్ద ప్రోత్సాహంగా మారింది.

ఇప్పటికే దేశంలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోగలిగింది. SUV సెగ్మెంట్‌లో టాటా అందిస్తున్న నాణ్యత, సేఫ్టీ స్టాండర్డ్‌లు వినియోగదారులను మరింతగా ఆకర్షించాయి. టాటా హారియర్ ప్రస్తుతం మధ్య-పెద్ద SUV సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్‌లెస్ వంటి వేరియంట్లలో లభించే ఈ మోడల్, రూ.14 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.25.25 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.
ఒకప్పుడు హారియర్‌ను కేవలం మస్‌క్యులర్ లుక్, రిచ్ ఫీచర్స్, 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ కోసం ప్రజలు గుర్తించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హారియర్‌ను కస్టమర్లు ఒక పూర్తి ఫ్యామిలీ SUVగా, రైడ్ కంఫర్ట్ పరంగా అత్యుత్తమంగా భావించడం ప్రారంభించారు. విశాలమైన క్యాబిన్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, కొత్త టెక్ ఫీచర్లు.. ఇవి అంతా కలిసి దీన్ని మరింత ప్రాక్టికల్, ప్రీమియం ఎంపికగా మార్చాయి.

అయితే, ఈ SUVలో చాలా రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న ఒకే ఒక్క లోపం ఉంది, అదే పెట్రోల్ ఇంజిన్ మిస్సింగ్. డీజిల్ ఇంజిన్ శక్తివంతంగా ఉన్నప్పటికీ, నగర వినియోగదారులు లేదా తక్కువ రన్నింగ్ ఉన్న వినియోగదారులు పెట్రోల్ వేరియంట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. టాటా మోటార్స్, హారియర్, సఫారీ పెట్రోల్ ఇంజిన్ మోడళ్లను డిసెంబర్ 9న అధికారికంగా లాంచ్ చేసి, ధరలను ప్రకటించనుంది.
చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ అప్‌డేట్ రావడంతో టాటా లైనప్ మరింత బలపడనుంది. కొత్త పెట్రోల్ వేరియంట్ రావడం వల్ల, హారియర్ ఇప్పుడు మరింత కస్టమర్ బేస్‌ను ఆకర్షించే అవకాశం ఉంది. ప్రస్తుత హారియర్ కేవలం బలమైన SUV మాత్రమే కాదు, లోపల నిజంగా ప్రీమియం అనుభూతిని ఇచ్చే ఫీచర్ల సమాహారంగా కనిపిస్తుంది. హారియర్ క్యాబిన్‌లో అడుగుపెడితే మొదట కళ్లకు పడేది 12.5-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

ఇది గ్రాఫిక్స్ పరంగా చాలా రిఫైన్‌గా పనిచేస్తుంది. దీనికి తోడు, నావిగేషన్ సపోర్ట్‌తో వచ్చే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు అన్ని సమాచారం ఒకే చూపులో అందిస్తుంది. స్టీరింగ్ వీల్ టాటా అందించిన ప్రకాశించే టాటా లోగోతో కూడిన నాలుగు-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ SUVకి మరింత ఆధునికతను జోడిస్తుంది. లోప టచ్-బేస్డ్ HVAC కంట్రోల్స్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు వాడుకరికి లగ్జరీ అనుభూతినిస్తాయి.


Click it and Unblock the Notifications








