894 మంది మాత్రమే ఈ కారును కొన్నారు.. ఒకప్పుడు జనాలు ఎగబడ్డారు.. మరి ఇప్పుడు ఏమైంది?
భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన కార్లను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా తన ఫ్లాగ్‌షిప్ Suv అయిన హారియర్ (harrier) గురించిన వివరాలను వెల్లడించింది. లేటెస్ట్ ఫీచర్స్, ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరుతో మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు మంచి స్పందనను అందుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో దీని అమ్మకాల పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవలి సేల్స్ నివేదిక ప్రకారం, మే నెల 2025లో టాటా హారియర్ SUV కేవలం 894 యూనిట్లను మాత్రమే అమ్ముడుపోయింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 1,625 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 44.98 శాతం తగ్గుదలగా నమోదు అయింది.
ఈ ట్రెండ్ ప్రస్తుత ఏడాది మొదటి నాలుగు నెలల్లోనూ కొనసాగింది. జనవరి నుండి ఏప్రిల్ వరకు అమ్మకాల్లో ఎటువంటి పెరుగుదల కనిపించలేదు. జనవరిలో 1,488 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో 1,376, మార్చిలో 1,265, ఏప్రిల్‌లో 1,012 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ గణంకాలను గమనిస్తే, నెలలకెలా అమ్మకాల సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి హారియర్‌కు సంబంధించి మార్కెట్ డిమాండ్ తగ్గుతోందని సూచిస్తోంది.

దీనికి ప్రధాన కారణం పెరిగిన పోటీ, వినియోగదారుల అభిరుచుల మార్పు, ఇతర టాటా మోడళ్లు మార్కెట్లో కస్టమర్లను అట్రాక్ట్ చేయడం. అదే సమయంలో ఇతర తయారీదారులు కూడా ఇదే ధరలో లేటెస్ట్ ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.దీంతో అమ్మకాల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తుంది. హారియర్ అమ్మకాలు పెంచడానికి టాటా కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో దీని సేల్స్ పెరిగే అవకాశం ఉంది.
టాటా హారియర్ ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.26.25 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ SUV పలు వేరియంట్లలో స్మార్ట్, స్మార్ట్ (ఓ), ప్యూర్, ప్యూర్ (ఓ), ఫియర్‌లెస్ ప్లస్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారుల భిన్న అవసరాలకు తగ్గట్టు ఈ వేరియంట్లు రూపొందించబడ్డాయి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా హారియర్ 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది శక్తివంతమైన పని సామర్థ్యాన్ని చూపుతూ, డ్రైవింగ్‌లో మంచి స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

వినియోగదారుడు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి, ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టీరియర్ నుండి చూస్తే, టాటా హారియర్‌కు ఒక ఆకర్షణీయమైన, మస్క్యులర్ డిజైన్ కనిపిస్తుంది. కళ్లను ఆకట్టుకునేలా ఉన్న దీని బాడీ కట్స్, స్పోర్టీ గ్రిల్, స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్ హారియర్‌కు ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.
ఇది కోరల్ రెడ్, పెబుల్ గ్రే, లూనార్ వైట్, ఒబెరాన్ బ్లాక్, సీవీడ్ గ్రీన్ వంటి రంగుల్లో అందుబాటులో ఉండటం వినియోగదారులకు ఎన్నుకునే అవకాశాన్ని పెంచుతోంది. మైలేజీ పరంగా చూస్తే ఇది సుమారు 16.8 kmpl వరకు ఇస్తుంది. దీనిలో 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, దీని వల్ల ఎక్కువ సార్లు ఫ్యూయల్ నింపాల్సిన అవసరం ఉండదు.

ఇంటీరియర్ పరంగా, హారియర్ 5 సీట్ల SUV. దీని లోపలి భాగం విశాలంగా ఉండటంతో ప్రయాణికులకు కంఫర్ట్‌గా ఉంటుంది. మరింతగా లగేజీ ఉంచేందుకు ఇందులో 445 లీటర్ల బూట్ స్పేస్ కల్పించబడింది. ఇది ఫ్యామిలీ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం చక్కటి ఎంపిక. కొలతల పరంగా హారియర్ 4605 మిమీ పొడవు, 1922 మిమీ వెడల్పు, 718 మిమీ ఎత్తు కలిగి ఉంది.దీనిప్రెజెన్స్ రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.
ఈ కారు ప్రయాణీకులకు ప్రమాద సమయంలో రక్షణ అందించడానికి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), క్రూయిజ్ కంట్రోల్, 60-డిగ్రీ కెమెరా వంటి పలు అత్యాధునిక సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








