అయ్యో..! టాటా కూడా షాక్ ఇచ్చేసింది.. ఆ ఎస్‌యూవీ పై ఏకంగా రూ.30,000 పెంపు!
టాటా మోటార్స్.. భారతీయులకు సుపరిచితమైన వాహన తయారీ సంస్థ. తమ వాహనాలతో ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల మనసు దోచుకుంటూ వస్తోందీ కంపెనీ. ఎస్‌యూవీల్లోనూ ఈ సంస్థ వాహనాలు చాలా పాపులర్ అయ్యాయి. ఈ సెగ్మెంట్‌లో నెక్సాన్, పంచ్ వంటి కార్లు.. సేల్స్‌లో దూసుకుపోవడమే కాకుండా ఈ సంస్థకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టాయి. ఈ కంపెనీ ఎస్‌యూవీ లైనప్‌లో వినియోగదారులకు చేరువైన మరో వాహనం.. టాటా హరియర్. దీని స్టైలిష్ లుక్, అడ్వాన్స్ డ్ ఫీచర్లు, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఇది వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సంస్థ వినియోగదారులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ హరియర్ ఎస్‌యూవీ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో చూసేద్దాం.
ఈ హరియర్ ఎస్‌యూవీ ఇకపై పాత ధరకు ఉండబోదని టాటా మోటార్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈ కారులోని బేస్ మోడల్ అయిన స్మార్ట్ మ్యాన్యువల్ ఎస్‌యూవీ పై రూ.1,000 మేర ధర పెరిగింది. ఇది కాస్త తక్కువే అయినప్పటికీ దీని ఇతర వేరియంట్ల ధరలు మాత్రం కాస్త ఎక్కువగానే పెరిగాయని చెప్పవచ్చు.

దీంట్లోని Pure Plus (S) Dark Edition Automatic కారు ధర ఏకంగా రూ.21,000 మేర పెరిగింది. ఇక దీంట్లోని ఇతర వేరియంట్ల ధరలు రూ.36,000 మేర పెంచిందీ సంస్థ. ఈ పెరిగిన ధరలతో... ప్రస్తుతం ఈ కారు ఎక్స్- షో రూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.26.65 లక్షల మధ్య చేరింది.
ధర పెంపు మినహా ఈ 5- సీటర్ ఎస్‌యూవీ కారులో ఎలాంటి మార్పులను తీసుకురాలేదు. ఈ కారు 2.0- లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 6- స్పీడ్ మ్యూన్యువల్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించి ఉంటుంది. ఈ ఇంజిన్‌ను BS-VI 2 స్టాండర్డ్స్ ఆధారంగా తయారు చేశారు. ఇది 168 bhp పవర్, 350 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎస్‌యూవీలోని ఫీచర్లను పరిశీలిస్తే ఇది 12.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, నేవిగేషన్ సపోర్ట్, టాటా లోగోతో కూడిన ఫోర్- స్పోక్ మల్టీ- ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో ఉంటుంది. దీంట్లో టచ్- బేస్డ్ HVAC కంట్రోల్స్, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, జేబీఎల్ 10 స్పీకర్ సిస్టం వంటివి కూడా ఉంటాయి.
అంతేగాకుండా దీంట్లో ఎయిర్ ప్యూరిఫయర్, బ్లైండ్- స్పాట్ మానిటర్ సిస్టం, 360- డిగ్రీ సరౌండెడ్ కెమెరా, ADAS సూట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, పవర్డ్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ కారు.. Sunlit Yellow, Coral Red, Pebble Gray, Lunar White, Oberon Black, Seaweed Green, Ash Gray కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇది దీనికి అదిరిపోయే లుక్‌ను అందిస్తుంది.

ఇక ఈ హరియర్ ఎస్‌యూవీ సేఫ్టీ విషయానికి వస్తే ఇది 7 ఎయిర్ బ్యాగులతో ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని రోస్‌లో త్రీ- పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ రిమైండర్స్ , యాంకర్ ప్రిటెన్షనర్స్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రిట్రాక్టర్స్, ప్రిటెన్షనర్స్, లోడ్ లిమిటర్స్ వంటివి కూడా ఉంటాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








