టాటా, మహీంద్రా, అశోక్ లేలాండ్.. కమర్షియల్ వెహికల్ సేల్స్‎లో తోపు కంపెనీ అదే.. దాన్ని మించింది లేదు

భారతదేశంలో కమర్షియల్ వెహికల్ విభాగం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు, రవాణా రంగానికి ఇవి కీలకమైనవి. లారీలు, గూడ్స్ ఆటోలు వంటి కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల గణాంకాలను చూస్తే, ఒక్క నెలలోనే వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. జూలై నెలలో మార్కెట్ ఎలా ఉంది.. ఏ కంపెనీలు ఎంత అమ్మి లాభపడ్డాయో పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

గత జూలై నెలలో భారతీయ వాణిజ్య వాహనాల మార్కెట్ మొత్తం 76,439 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం జూలై నెల అమ్మకాలతో (76,261 యూనిట్లు) పోలిస్తే కేవలం 0.23% స్వల్ప వృద్ధి మాత్రమే. అయితే, అంతకు ముందు నెల, అంటే జూన్ నెల అమ్మకాలతో(73,367 యూనిట్లు) పోల్చి చూస్తే, జూలైలో అమ్మకాలు 4.19% పెరిగాయి. ఈ గణాంకాలు ఈ మార్కెట్ స్థిరమైన వృద్ధిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Tata Mahindra and Ashok Leyland Who Led the Commercial Vehicle Segment in July

కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల్లో టాటా మోటార్స్ మొదటి స్థానంలో నిలిచింది. జూలై నెలలో టాటా మొత్తం 25,244 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం జూలై నెల అమ్మకాలతో (27,617 వాహనాలు) పోలిస్తే, ఈసారి అమ్మకాలు 8.59% తగ్గాయి. అయినప్పటికీ, టాటా మార్కెట్‌లో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది.

ఇక రెండవ స్థానంలో ఉన్న మహీంద్రా సంస్థ జూలైలో 20,442 వాహనాలను అమ్మింది. ఇది గత సంవత్సరం జూలై (19,039 వాహనాలు)తో పోలిస్తే 7.37% వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా తన అమ్మకాలను పెంచుకుని బలమైన పోటీదారుగా నిలిచింది.

Tata Mahindra and Ashok Leyland Who Led the Commercial Vehicle Segment in July

టాటా, మహీంద్రాల తర్వాత, ఇతర ప్రముఖ కంపెనీలు కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి. అశోక్ లేలాండ్ 14,174 వాహనాలను విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది, గత ఏడాదితో పోలిస్తే ఇది 1.39% వృద్ధి. నాల్గవ స్థానంలో ఉన్న వీఈసీవీ (VECV) 7,125 వాహనాలను అమ్మి 6.52% వృద్ధిని సాధించింది.

ఐదవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి 3,589 వాహనాలను విక్రయించి 1.30% స్వల్ప వృద్ధిని చూపించింది. అలాగే ఫోర్స్ మోటార్స్ 1,950 వాహనాలను అమ్మి 2.58% వృద్ధిని సాధించింది. ఇసుజు సంస్థ 1,568 వాహనాలతో 9.57% వృద్ధిని నమోదు చేసి మంచి పురోగతిని చూపించింది.

Tata Mahindra and Ashok Leyland Who Led the Commercial Vehicle Segment in July

ఈ వృద్ధి ధోరణిలో, డైమ్లర్ సంస్థ మాత్రం జూలైలో 1,436 వాహనాలను అమ్మి 9.17% క్షీణతను చవిచూసింది. గత ఏడాది ఇదే నెలలో(1,581 వాహనాలు) కంటే తక్కువ అమ్మకాలు జరిగాయి. అయితే, మిగిలిన చిన్న కంపెనీలు మొత్తం కలిసి 911 వాహనాలను అమ్మి, గత ఏడాదితో(481 వాహనాలు) పోలిస్తే ఏకంగా 89.40% భారీ వృద్ధిని సాధించడం విశేషం. ఇది మార్కెట్‌లో కొత్త కంపెనీల రాక, వాటికి లభిస్తున్న ఆదరణను సూచిస్తోంది.

మొత్తంగా, భారత వాణిజ్య వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మొత్తం అమ్మకాలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఈ విభాగంలో ఉన్న చాలా కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. రాబోయే పండుగ సీజన్‌లో, రవాణా, వ్యాపార కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఈ విభాగంలో అమ్మకాలు ఇంకా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధి దేశ ఆర్థిక పురోగతికి సానుకూల సంకేతం.

Tata Mahindra and Ashok Leyland Who Led the Commercial Vehicle Segment in July

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2025, 8:21 [IST]
English summary
Tata mahindra and ashok leyland who led the commercial vehicle segment in july
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+