ఎలక్ట్రిక్ కార్ల సేల్స్.లో కొత్త రికార్డు సృష్టించిన టాటా.. కస్టమర్లకు థాంక్స్ చెప్పేందుకు భారీ ఆఫర్!

భారత ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది. తమ ఎలక్ట్రిక్ కార్ మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ సంస్థ ఈవీల అమ్మకాల్లో మరో రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఈ సంస్థ 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా.. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది.‌ వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పేందుకుగాను రానున్న 45 రోజులపాటు తమ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఆఫర్లను ఈ సంస్థ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ 45 రోజుల సెలబ్రేషన్ పీరియడ్‌లో భాగంగా.. పాత వినియోగదారులతో పాటు కొత్తగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి వివిధ బెనిఫిట్స్‌ను అందిస్తోంది టాటా సంస్థ. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్, 100% ఆన్-రోడ్ ఫైనాన్స్ ఆప్షన్స్ వంటివి ఉన్నాయి. కొత్త కస్టమర్లు తమ ఏదైనా ప్యాసింజర్ వాహనాల ఎక్స్చేంజ్ కింద బోనస్‌ను రూ. 50,000 వరకు పొందవచ్చు.

Tata Motors 2 Lakh EV Sales

అలాగే ఫైనాన్సింగ్ సదుపాయాన్ని మరింత సులభతరం చేస్తూ.. జీరో-డౌన్ పేమెంట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది టాటా సంస్థ. దీంతో 100% ఆన్-రోడ్ ఫైనాన్స్ అందుకోవచ్చు. అలాగే చార్జింగ్ విషయంలోనూ.. టాటా పవర్ చార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలలపాటు కల్పిస్తున్న ఉచిత చార్జింగ్ సదుపాయాన్ని పొడిగించింది. దీంతోపాటు తమ ఈవీని కొనుగోలు చేసే వారికి 7.2 kW AC ఫాస్ట్ హోమ్ ఛార్జర్ ఉచితంగా అందిస్తోంది.

పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాన్ని మరింత మెరుగుపరుస్తూ.. టాటా నెక్సాన్, టాటా కర్వ్ ఈవీలపై 6 నెలల పాటు ఉచితంగా ఛార్జింగ్ బెనిఫిట్ అందిస్తోంది ఈ సంస్థ. అలాగే తమ ప్రస్తుత వినియోగదారులు తమ ఈవీలను అప్‌గ్రేడ్ చేసుకునే విషయంలో ప్రోత్సాహకాలను కూడా టాటా సంస్థ అందిస్తోంది.

Tata Motors 2 Lakh EV Sales Offer

ఈ 2 లక్షలకు పైగా కస్టమర్లతో టాటా సంస్థ ఈవీలు ఐదేళ్ల వ్యవధిలో 5 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. తద్వారా 7 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో టాటా మోటార్స్ సంస్థ కీలకంగా తోడ్పడింది. అంతేకాకుండా.. ఈవీ స్పేస్‌లో అతిపెద్ద 4-వీలర్ తయారీ సంస్థగా అవతరించింది.

8 వేలకు పైగా ఈవీ వినియోగదారులు కలిసి సగటున లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు టాటా సంస్థ చెబుతోంది. ఇది తమ బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌పోలియోకు సాక్ష్యంగా ఉన్నట్లు పేర్కొంది.‌ ఈ సంస్థ మాస్ ఆడియన్స్ సులభంగా ఈవీ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకుగాను ఎకో సిస్టంను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

2027 నాటికి 4,00,000కు పైగా ఛార్జింగ్ పాయింట్స్‌ని ఏర్పాటు చేసి భారత్‌లో పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచనున్నట్లు టాటా సంస్థ ఇటీవల ప్రకటించింది. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారిస్తూ..‌ భారత్‌లో ఈవీల వాడకం పెంచేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. రానున్న ఎలక్ట్రిక్ వాహనాల వాడకం మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2025, 15:01 [IST]
English summary
Tata motors 2 lakh ev sales offers 45 days for new and existing customers details here
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+