పేదల దేవుడు రతన్ టాటా కంపెనీ నుంచి దేశంలోని చిన్న వ్యాపారుల కోసం శక్తివంతమైన మిని ట్రక్

ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మారుమోగేలా ఎంతో అట్టహసంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 విజయవంతంగా జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో వాహన తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. కార్స్, బైక్స్, ఇతర విభాగాలకు చెందిన పలు మోడళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వాణజ్య వాహనాలు కూడా ప్రస్తుత ఈవెంట్‌లో ప్రదర్శనకు అందుబాటులో ఉన్నాయి. పలు తయారీ దారులు సరుకుల రవాణాకు ఉపయోగించే వాహనాలను ఆవిష్కరించారు. వీటిలో కొన్ని ఇప్పుడు బుకింగ్స్‌కు ఉండగా, మరిన్ని మాత్రం భవిష్యత్తులో కొనుగోలుకు రాబోతున్నాయి. ఈ ఈవెంట్‌లో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తన వాణిజ్య వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. వీటిలో మినీ ట్రక్ ఒకటి అక్కడికి వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటుంది.

ఈ మోడల్ పేరు Ace Pro Bi-Fuel. ఇది వివిధ వస్తువులను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించడానికి అనువుగా ఉంటుంది. దీనిని పెట్రోల్/డీజిల్ లేదా CNGతో నడపవచ్చు. మైలేజ్ పరంగా ఇది బాగానే ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇప్పటికే టాటా పెద్ద వాణిజ్య వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. ఈ చిన్న రవాణా వాహనం సరి కొత్తగా అనిపిస్తుంది. దీని డిజైన్ వస్తువులను మోసుకెళ్లడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

Tata Ace Pro Bi Fuel

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సరుకుల రవాణాకు ఇది అత్యుత్తమైన ఆప్షన్ అవుతుంది. ఈ కొత్త మినీ ట్రక్‌లో రౌండ్ షేపులో ఉన్నటువంటి హెడ్‌లైట్లు, మెరుగైన టర్న్ ఇండికేటర్‌లు, వీటికి అనుసంధానించబడిన ఫ్రంట్ బంపర్‌ సెటప్, ముందు అద్దం కింది భాగంలో బ్లాక్ కలర్‌లో ఉన్న డిజైన్‌లో టాటా లోగో ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా ఏస్ వాహనాలతో పోలిస్తే, ఇది మరింత అప్‌డేట్‌గా ఉంటుంది.

డ్రైవర్ సీటు ఉన్నటుంటి క్యాబిన్‌లో మెరుగైన సదుపాయాలను టాటా కంపెనీ అందించింది. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా పలు కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ బై ఫ్యూయల్ మిని ట్రక్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. సరకు రవాణా వాహనం కాబట్టి ప్రయాణంలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి పలు ఆప్షన్లు ఇచ్చింది.

Tata Motors Showcased Ace Pro Bi Fuel Mini Truck

సీటు కూడా చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. సేఫ్టీ కోసం అత్యున్నత ప్రమాణాలను టాటా అందించింది. ADAS ఫీచర్ కూడా ఉంది, ఈ మిని ట్రక్‌ను రివర్స్ చేస్తున్నప్పుడు , ఎవరినైన ఢీకొట్టిన లేదా ముందు వాహనాన్ని కొంచెం తగిలిన కూడా డ్రైవర్లను అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫీచర్స్‌ను కూడా టాటా తన మిని ట్రక్‌లో అందించింది. మొబైల్ అప్లికేషన్ సహయంతో ట్రక్‌లో ఏదైనా సమస్య వచ్చినట్లయితే వెంటనే తెలిసిపోతుంది.

స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్‌లో దాదాపు 31 వరకు ఉంటాయి. దేశంలో వాణిజ్య వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వివిధ వస్తువులను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించడానికి ఇవి తప్పనిసరి. ఈ మిని ట్రక్‌ల ద్వారా లోకల్‌గా ఉన్న ప్రాంతాలకు సరకులు చేరవేయడం చాలా సులువు. ఇప్పుడు ఈ కొత్త వాహనంతో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ విభాగంలో మెరుగైన సేల్స్ సాధిస్తుందని ఆశలు పెట్టుకుంది.

Tata Ace Pro Bi Fuel Design

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2025, 9:30 [IST]
English summary
Tata motors ace pro bi fuel mini truck unveiled in bharat mobility global expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+