ఈ కారే బెస్ట్ అని కస్టమర్లు చెప్పేశారు.. ఒక్క నెలలో 3,770 మంది సేల్స్ కౌంటర్‌ దగ్గర లైన్ కట్టారు!

భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ ఎప్పుడూ పోటీతో నిండి ఉంటుంది. మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 వంటి అమ్మకాల వీరులు ఉన్నా కూడా, టాటా ఆల్ట్రోజ్ (tata altroz) మాత్రం తన ప్రత్యేకతతో, భద్రతతో, ధర-ఫీచర్ల సమతుల్యతతో వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతోంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనాలి అనుకునే వారికి ఆల్ట్రోజ్ ఇప్పుడు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా నిలిచిపోయింది. అందుకే ఈ కారు అమ్మకాల పరంగాను గత కొంతకాలంగా ఓ స్థిరమైన పర్ఫార్మెన్స్‌ను కనబరుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత అక్టోబర్ 2025 నెలలో టాటా ఆల్ట్రోజ్ మరోసారి తన సత్తా చాటింది. ఈ ఒక్క నెలలోనే 3,770 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. గత సంవత్సరం ఇదే నెలలో, అక్టోబర్ 2024లో కేవలం 2,642 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే అమ్మకాలు 1,128 యూనిట్లు పెరిగాయి. ఈ పెరుగుదల సాధారణ వృద్ధి కాదు... 43 శాతం గ్రోత్‌ని ఆల్ట్రోజ్ సాధించింది. మార్కెట్లో భారీ పోటీ ఉన్నా, కొత్త ఫీచర్లు, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, 5-స్టార్ భద్రతా రేటింగ్, కస్టమర్లలో పెరుగుతున్న నమ్మకం ఇవన్నీ కలిసిపోవడంతో ఆల్ట్రోజ్ అమ్మకాలు ఈ స్థాయికి చేరాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఆల్ట్రోజ్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

Tata Motors Altroz October 2025 Sales Recoreded 3770 Units

ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ అత్యంత ఆకర్షణీయమైన ప్రైసింగ్‌తో అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 6.30 లక్షల నుంచే ప్రారంభమవడం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో దీన్ని మరింత పోటీదారుగా నిలబెడుతోంది. ఇక టాప్ వేరియంట్ ధర కూడా ఎక్కువగా పెరగకుండా రూ. 10.51 లక్షల వద్దే ఆగిపోవడం వినియోగదారులకు మంచి ఆఫర్‌లా మారింది.

టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇవి జిఎస్‌టి తగ్గింపు తర్వాతి ఎక్స్-షోరూమ్ ధరలు. జిఎస్‌టి తగ్గడంతో ఆల్ట్రోజ్ పై గరిష్టంగా రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు రావడం మార్కెట్‌ను మరింత ఊపేసింది. ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఇంత తక్కువ ధరకు పొందగలగడం కొనుగోలుదారులకు అసలు లాభం. ఇదే కారణంగా ఆల్ట్రోజ్ అమ్మకాలు ఇటీవల నెలల్లో గణనీయంగా పెరిగాయి.

Tata Motors Altroz October 2025 Sales Recoreded 3770 Units

టాటా ఆల్ట్రోజ్ కేవలం డిజైన్‌, భద్రతతోనే కాదు, శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో కూడా తన తరగతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వినియోగదారుల అవసరాల్ని బట్టి ఆల్ట్రోజ్ మూడు విభిన్న ఇంజిన్ సెటప్‌లలో లభిస్తుంది, ప్రతి ఒక్కదీ పనితీరు, ఫ్యుయల్ ఎఫిషెన్సీ పరంగా తనదైన స్థాయిని చూపిస్తుంది. మొదటిగా, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 88 PS శక్తి మరియు 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రోజువారీ నగర ప్రయాణాలు, హైవే డ్రైవ్‌లలో సరైన బలాన్స్డ్ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, అలాగే మరింత స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోసం 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు లభిస్తున్నాయి. తదుపరి, పేట్రోల్ + CNG ఆప్షన్‌ను కోరుకునేవారికి 1.2-లీటర్ బై-ఫ్యూయల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 73.5 PS పవర్, 103 Nm టార్క్‌ను ఇస్తుంది.

Tata Motors Altroz October 2025 Sales Recoreded 3770 Units

దీని స్మూత్, కాస్ట్-ఎఫెక్టివ్ డ్రైవింగ్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడింది. తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునే కుటుంబాలకు ఈ వేరియంట్ మంచి ఎంపిక. అదే సమయంలో, డీజిల్ పవర్‌ని ఇష్టపడే వారికి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఇది 90 PS పవర్‌తో పాటు 200 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. వేరియంట్లను బట్టి ఈ కారు 19 నుండి 26 kmpl వరకు ఫ్యూయల్ ఎఫిషెన్సీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 21, 2025, 11:10 [IST]
English summary
Tata motors altroz october 2025 sales recoreded 3770 units more details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+