టాటా ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కొనడానికి ఇదే మంచి ఛాన్స్.. ధరలు భారీగా తగ్గాయి బాస్‌!

దేశంలో అన్నివర్గాల వారికి సరిపడే కార్లను తయారు చేస్తూ చేరువైన దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్. ప్రసుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈవీల్లోనూ ఈ కంపెనీ తనకు తిరుగులేదని అనేకసార్లు నిరూపించింది. ఈ సంస్థ నుంచి వచ్చిన పంచ్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఈవీలను మరింతమందికి చేరువచేసేలా టాటా సంస్థ ఓ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లపై భారీగా ధర తగ్గింపు ప్రకటించింది. ఆ విశేషాలేంటో చూసేద్దాం.

టాటా మోటార్స్ ఈవీలపై ప్రకటించిన ఈ ఆఫర్ 2024 స్టాక్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. వేరియంట్‌ను బట్టి.. దీంట్లో ధర తగ్గింపు ఉంటుంది. ఇది గ్రీన్ బోనస్, ఎక్స్‌ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రూపంలో వినియోగదారులు పొందగలుగుతారు. టాటా నెక్సాన్ ఈవీపై ఈ నెలలో రూ.40,000 వరకు తగ్గింపు ఉంది. దీని వేరియంట్, ఛార్జర్ టైప్, రేంజ్‌తో సంబంధం లేకుండా అన్నింటికి ఇది వర్తిస్తుంది.

Tata Nexon EV

అయితే.. ఈ ఆఫర్ 2024 స్టాక్‌కి మాత్రమే వర్తిస్తుందని టాటా స్పష్టం చేసింది. ఈ టాటా నెక్సాన్ ఈవీ.. టాటా ఎలక్ట్రిక్ లైనప్స్‌లో మొదటి కారు. ఇది 45 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వచ్చి మంచి రేంజ్ అందిస్తుంది. ఇక పంచ్ ఈవీ 3.3 kW AC Wall Box Charger‌తో వచ్చే స్మార్ట్, స్మార్ట్ ప్లస్ వేరియంట్లపై రూ.40,000 బెనిఫిట్స్‌ పొందవచ్చు.

ఇక 3.3 kW chargerతో ఉండే మిగతా మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ ఆఫర్ రూ. 50,000గా ఉంది. అలాగే 7.2 kW AC ఛార్జర్‌ని ఎంచుకుంటే ఈ కారుపై రూ. 70,000 వరకు డిస్కౌండ్ పొందగలుగుతారని టాటా సంస్థ చెప్పింది. ఇక దీంట్లోని మిగతా వేరియంట్లన్నింటిపై రూ.40,000 వరకు రాయితీ లభిస్తుంది.

Tata Punch EV Discount

టాటా మోటార్స్ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారుగా ఉన్న టాటా కర్వ్ ఈవీపై రూ. 70,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఇది కూడా కేవలం 2024 స్టాక్స్‌పై మాత్రమే లభిస్తుంది. ఇది అన్ని వేరియంట్లకు అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ.. 55 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 167 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక టాటా టియాగో ఈవీ అన్ని వేరియంట్లపై రూ. 85,000 వరకు ఆఫర్ ప్రకటించింది టాటా సంస్థ. ఈ టాటా టియాగో ఈవీ దేశంలోనే సరసమైన ధరలో లభించే ఈవీ అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ డిస్కౌంట్ దీంట్లోని 3.3kW ఛార్జర్‌తో ఉండే XT వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీంట్లోని టాప్ వేరియంట్ XZ ప్లస్ వేరియంట్‌పై రూ.60,000 వరకు తగ్గింపు అందుకోవచ్చు.

Tata Curvv February Discount

ఇప్పుడు టాటా టియాగోలోని XZ+ వేరియంట్ మినహా మిగతా అన్ని వేరియంట్లపై రూ. 40,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే.. ఇది 3.3kW ఛార్జర్‌తో వచ్చే కార్లపై మాత్రమే వర్తిస్తుంది. గత నెలలో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో విడుదల చేశారు. దీంట్లోని గ్రిల్ డిజైన్‌ హెడ్‌లైట్స్, రీడిజైన్‌డ్ 14- అంగుళాల అలాయ్ వీల్స్ ఈ ఈవీకి కొత్త లుక్‌ని అందిస్తుంది.

ఈ కారుని మూడు కొత్త కలర్‌ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టింది టాటా సంస్థ. అవి Supernova Copper, Chilli Lime and Arizona Blue. అలాగే ఈ ఈవీలో10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, టాటా లోగోతో ఉండే టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉంటాయి.

ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, షార్క్-ఫిన్ యాంటెన్నా, అప్డేటెడ్ డ్రైవర్ డిస్‌ప్లే, HD రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ.8 లక్షల నుంచి రూ.11.14 లక్షలుగా ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ. రేంజ్ అందించగలదు. ఈ కారు 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, February 9, 2025, 7:20 [IST]
English summary
Tata motors announced discounts on electric lineups check all offer prices here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+