275 కిలోమీటర్ల రేంజ్ ఎలక్ట్రిక్ కారు ధరను లక్ష రూపాయలు తగ్గించిన టాటా.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!
భారతదేశంలో సామాన్యుడికి ఎలక్ట్రిక్ కారు కలను సాకారం చేసిన సంస్థగా టాటా మోటార్స్ (Tata Motors) పేరు గొప్పగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిమిత ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే ప్రజల మనసులో స్థానం సంపాదించడంలో టాటా ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో, కారును కొనాలనుకుంటూ ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఆకర్షణీయమైన అవకాశాల్ని అందిస్తూ టాటా జూన్ నెలలో ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ నెలలో టాటా మోటార్స్ గ్రీన్ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్‌లు వంటి వాటి ద్వారా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అంటే, పాత కారును ఇవ్వడం ద్వారా లేదా వాతావరణానికి అనుకూలంగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న టాటా మోటార్స్, జూన్ 2025ను వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా మార్చింది. ముఖ్యంగా టాటా టియాగో EVపై ఈ నెలలో అందిస్తున్న ప్రత్యేక తగ్గింపులు, కొనుగోలుదారులకు గ్రీన్ వాహనాన్ని సొంతం చేసుకునే మంచి సమయంగా మారుస్తున్నాయి. తక్కువ ధరలో ఈవీ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఆఫర్స్ గురించి కింది కథనంలో చూద్దాం.

2024 మోడల్ ఇయర్‌కి చెందిన టాటా టియాగో బేస్ వేరియంట్ XEపై కంపెనీ రూ. 55,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది ప్రారంభ స్థాయి మోడల్ అయినప్పటికీ, దాని ధరపై వస్తున్న రాయితీ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇక XZ+, XZ+ టెక్ లక్స్ ACFC (7.2kW) వేరియంట్‌లను కోరుకునే వినియోగదారుల కోసం కూడా రూ. 70,000 వరకు ప్రయోజనాలు సిద్ధంగా ఉన్నాయి.
అంతేకాదు, టియాగో EV మిడ్-స్పెక్ XT LR వేరియంట్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందించటం విశేషం. ఇది కారును మరింత బడ్జెట్-ఫ్రెండ్లీగా మారుస్తుంది. అయితే, ఈ అన్ని ఆఫర్లు 2024 మోడల్ ఇయర్ వాహనాలకే పరిమితం కావడం గమనించదగ్గ విషయం. అలాగే, కొత్తగా విడుదలైన 2025 మోడల్ టియాగో EVకి చెందిన అన్ని వేరియంట్‌లపై కూడా రూ. 40,000 వరకు తగ్గింపును కంపెనీ ప్రకటించింది.

ఇది తాజా మోడల్‌ను కొనాలనుకునే వారికి మరింత ఆసక్తికరమైన అవకాశం అవుతుంది. ధర పరంగా చూసినప్పుడు, టియాగో EV ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 11.14 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఇవి వరుసగా 221 కిలోమీటర్లు, 275 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మరో ప్రీమియం ఎలక్ట్రిక్ SUVని కూడా తక్కువలో సొంతం చేసుకోవచ్చు.
అదే, టాటా పంచ్ EV కూడా జూన్ 2025లో ఆకర్షణీయమైన ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఈసారి టాటా కంపెనీ, వినియోగదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వివిధ వేరియంట్‌లపై వివిధ రకాల తగ్గింపులను అందిస్తోంది. 2024 మోడల్ పంచ్ EVలో, లాంగ్ రేంజ్ ACFC వేరియంట్‌లపై రూ.90,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇది ఎక్కువ దూరం ప్రయాణించే వారు కోరుకునే వేరియంట్ కావడంతో, ఈ తగ్గింపు వారికి నిజమైన వరం లాంటిదే.

ఇక ఎంట్రీ-లెవల్ స్మార్ట్, స్మార్ట్ ప్లస్ వేరియంట్‌లను చూసినవారికి, రూ. 45,000 వరకు తగ్గింపు లభించనుంది. మధ్యస్థాయి నుంచి పై స్థాయి మోడళ్లపై కూడా రూ. 70,000 వరకు గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. ఇకపోతే 2025 మోడల్ పంచ్ EV అన్ని వేరియంట్‌లపై కూడా రూ. 40,000 వరకు తగ్గింపును టాటా అందిస్తోంది. అంటే తాజా మోడల్‌ను తీసుకోవాలనుకునే వారికి కూడా ఆదా చేసే అవకాశముంది.
ధరల విషయానికి వస్తే, టాటా పంచ్ EV రూ. 9.99 లక్షల నుండి రూ. 14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తుంది. ఈ కారుకు రెండు బ్యాటరీ ప్యాక్‌లు 25kWh, 35kWh, అలాగే చార్జర్ ఆప్షన్లు 3.3kW, 7.2kW లభ్యమవుతాయి. రేంజ్ పరంగా చూసినట్లయితే 25kWh బ్యాటరీ కలిగిన వేరియంట్‌లు 315 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. అదే 35kWh వెర్షన్‌లు 421 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి.
నెక్సాన్ EV అన్ని వేరియంట్లపై రూ.40,000 తగ్గింపు ఉంది. దీని ప్రారంభ ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.19 లక్షల మధ్య, 30kWh, 45kWh బ్యాటరీ ప్యాక్లో లభిస్తుంది. ఇవి వరుసగా 275 కి.మీ, 489 కి.మీ రేంజ్ అందిస్తాయి. టాటా 2024 మోడల్ సంవత్సరంలో కర్వ్ EV అన్ని వేరియంట్లకు రూ.70,000 ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ.50,000 గ్రీన్ బోనస్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








