టాటా కార్ల ధరలు రూ.65,000 నుంచి 1.45 లక్షల వరకు పడిపోయాయ్.. ఏ మోడల్ ఎంత తగ్గిందంటే..

టాటా మోటార్స్ (tata motors) వినియోగదారుల కోసం నిజంగా సంతోషకరమైన వార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం కార్లపై GST రేటును గణనీయంగా తగ్గించడం వల్ల, ఆ లాభాన్ని పూర్తిగా తమ కస్టమర్లకు చేరవేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అంటే ఆ తేదీ నుండి సవరించిన ధరలు వర్తించనున్నాయి. ఈ మార్పుతో టాటా మోటార్స్‌కి చెందిన దాదాపు అన్ని హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా, మధ్యతరగతి నుండి ఉన్నత తరగతి వరకు ప్రజాదరణ పొందిన మోడళ్లు..టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ కొత్త GST రేట్ల కారణంగా గణనీయమైన ధర తగ్గింపును చూశాయి.

దీంతో ఒకవైపు కస్టమర్లకు అదనపు ఆర్థిక భారం తగ్గగా, మరోవైపు మార్కెట్లో టాటా మోడళ్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, టాటా మోటార్స్ ఇచ్చిన హామీ కలసి వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మారాయి. ముఖ్యంగా దేశంలో ఇప్పుడు పండుగ సీజన్ మొదలైన తరుణంలో కొత్త కార్లను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నవారు తమకు నచ్చిన కారును తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు.

Tata Motors Car Prices Drop After Gst Reduction In India Full Details Inside

టాటా మోటార్స్ ప్రకటించిన ధరల తగ్గింపులో ప్రతి మోడల్ గణనీయమైన ప్రయోజనం అందిస్తోంది. చిన్న కారు టియాగోపై దాదాపు రూ.75,000 వరకు ధర తగ్గింది. అదే తరహాలో టిగోర్ కొనుగోలు చేసే వారికి రూ.80,000 వరకు లాభం దక్కనుంది. యువతకు బాగా నచ్చే ఆల్ట్రోజ్‌పై తగ్గింపు మరింత ఎక్కువగా రూ.1.10 లక్షల వరకూ చేరుకుంది. చిన్న SUVల విభాగంలో సత్తా చాటుతున్న పంచ్‌ కూడా రూ.85,000 వరకు చౌకగా లభిస్తోంది.

అత్యంత డిమాండ్ ఉన్న నెక్సాన్‌ కొనుగోలు చేసేవారికి అయితే అతి పెద్ద లాభం కనిపిస్తోంది. దాని ధర రూ.1.55 లక్షల వరకూ తగ్గడంతో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. మరోవైపు, కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న కర్వ్ మోడల్‌పై కూడా రూ.65,000 తగ్గింపు వర్తిస్తోంది. పెద్ద SUVల విభాగంలో ఉన్న హారియర్, సఫారీ మోడళ్లపై వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.45 లక్షల వరకు ధరలు తగ్గాయి.

Tata Motors Car Prices Drop After Gst Reduction In India Full Details Inside

ఇటీవల జరిగిన GST కమిటీ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పుకు దారి తీసింది. ఇకపై 1200 సీసీ వరకు పెట్రోల్, CNG ఇంజన్లు, అలాగే 1500 సీసీ వరకు డీజిల్ ఇంజిన్ కార్లపై GST రేటు 28% నుండి 18%కి తగ్గింది. ఈ తగ్గింపు మధ్యతరగతి వినియోగదారులపై ఉన్న భారం గణనీయంగా తగ్గించబోతోంది.

టాటా మోడల్ తగ్గింపు మొత్తం
టియాగో రూ.75,000
టిగోర్ రూ.80,000
ఆల్ట్రోజ్ రూ.1,10,000
పంచ్ రూ.85,000
నెక్సాన్ రూ.1,55,000
కర్వ్ రూ.65,000
హారియర్ రూ.1,40,000
సఫారీ రూ.1,45,000

లగ్జరీ వర్గానికి చెందిన సెడాన్లు, SUVలు, MPVలపై మాత్రం 40% GSTను ఎటువంటి అదనపు సెస్ లేకుండా వసూలు చేయాలని నిర్ణయించారు. టూవీలర్ విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 350 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న స్కూటర్లు, బైక్‌లపై GST రేటు 28% నుండి 18%కి తగ్గింది. అయితే 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల లగ్జరీ బైక్‌లపై GSTను నేరుగా 40% వరకూ పెంచారు.

Tata Motors Car Prices Drop After Gst Reduction In India Full Details Inside

ఈ కొత్త రేట్ల ప్రభావంతో టాటా మోటార్స్ తన కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. టియాగో నుండి సఫారీ వరకు దాదాపు అన్ని మోడళ్లు చౌకగా లభిస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు, అలాగే ఉన్నత వర్గానికి చెందిన కస్టమర్లు కూడా నేరుగా లాభం పొందుతున్నారు. రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌లో కొత్త కారును కలగా కంటున్న వారికి ఇది నిజంగానే ఒక గోల్డెన్ ఛాన్స్‌గా మారింది.

More from DriveSpark

Article Published On: Saturday, September 6, 2025, 9:56 [IST]
English summary
Tata motors car prices drop after gst reduction in india full details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+