చేతి నిండా డబ్బు సంపాదించి పెట్టే టాటా వ్యాన్.. చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు

భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (Tata Motors) అనే పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేనిది. సాధారణ ప్రయాణికుల కార్ల నుంచి ప్రారంభించి, వాణిజ్య వాహనాల వరకు విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందిస్తూ దేశీయ మార్కెట్లో అగ్రస్థానాన్ని సాధించింది. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ స్థానం మరింత బలంగా ఉంది. తేలికపాటి వాహనాల నుంచి హెవీ డ్యూటీ ట్రక్కుల వరకు అన్ని విభాగాల్లోనూ తమదైన ముద్ర వేసి, చిన్న వ్యాపారాలు చేసే వారిని, పెద్ద ఎంటర్‌ప్రైజ్‌లను సమానంగా ఆదరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో, వినియోగదారుల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చడానికి, చిన్న వ్యాపారాలు, సరకు రవాణాలో నిమగ్నమయ్యే వారికి సౌకర్యంగా ఉండేలా టాటా మోటార్స్ తన ప్రఖ్యాత ఏస్ (Ace) శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది.

ఇది ఏస్ గోల్డ్+(Ace Gold+) పేరుతో అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో లభించే ఈ డీజిల్ వేరియంట్, చిన్న వ్యాపారాలు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అవసరాల కోసం ఒక ప్రాక్టికల్ సొల్యూషన్‌గా నిలుస్తోంది. దీని ధర వచ్చేసి రూ.5.52 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఏస్ గోల్డ్+ వాహనాన్ని ప్రత్యేకతగా నిలబెట్టేది దాని ఆధునిక ఫీచర్లు, అద్భుతమైన పనితీరు. డిజైన్ పరంగా ఇది సొగసుగా, ఆపరేట్ చేయడంలో సులభంగా ఉండేలా రూపొందించబడింది.

Tata Motors Cargo Vehicle Ace Gold Launched In India At Rs 5 52 Lakh Details Inside

పైగా, తక్కువ ఇంధన వ్యయం, బలమైన ఇంజిన్ పనితీరు కారణంగా ఇది వ్యాపారులు, చిన్న తరహా రవాణాదారుల కోసం మరింత లాభదాయకంగా మారనుంది. టాటా మోటార్స్ ఇప్పటివరకు తన వాణిజ్య వాహనాలను విశ్వసనీయతతో అందిస్తూ వచ్చినందున, ఈ కొత్త వేరియంట్ కూడా అదే నమ్మకాన్ని మరింత బలపరచనుంది. ఇప్పటికే భారతదేశంలో టాటా ఏస్ శ్రేణి వాణిజ్య వాహనాల విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందింది.

అందులోనూ కొత్తగా లాంచ్ అయిన ఏస్ గోల్డ్+ తన తక్కువ ధర, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఫీచర్లు, బలమైన ప్రదర్శనతో మరింత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశముంది. వ్యాపార అవసరాలకు సరిపోయే విధంగా ఇది మార్కెట్లో మంచి ఆదరణ పొందడం ఖాయం అని చెప్పవచ్చు. టాటా మోటార్స్ Ace Gold+ చిన్న వ్యాపారులు, రవాణాదారులు, వీధి వ్యాపారులు అందరికీ నిజమైన సహాయకరంగా నిలిచేలా రూపొందించబడింది.

పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే, ఇందులో అమర్చిన టర్బోచార్జ్డ్ D-Cor ఇంజిన్ 22 PS పవర్, 55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ కారణంగా, వాహనం సిటీ రోడ్లు, హైవేలు, చిన్న వీధులు అన్నింటికీ తగిన పనితీరు ఇస్తుంది. అంతేకాదు, 900 కిలోల పేలోడ్ సామర్థ్యం ఉండటం వల్ల పెద్ద మొత్తంలో సరకు రవాణా చేయాలనుకునే చిన్న వ్యాపారులు కూడా దీన్ని నమ్మకంగా ఉపయోగించవచ్చు.

మరో హైలైట్, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని వివిధ రూపాల్లో తయారు చేయవచ్చు. పూర్తిగా మూసివున్న వాహనంగా మార్చుకోవచ్చు, లేక హార్డ్ టాప్, సాఫ్ట్ టాప్ లేదా పూర్తిగా ఓపెన్ వాహనంగా వాడుకోవచ్చు. ఇది వ్యాపారాల విభిన్న అవసరాలను తీర్చుతుంది. అందువల్ల, వస్తువులను రవాణా చేసే చిన్న వ్యాపారుల నుండి రోడ్డు పక్కన షాపులు ఏర్పాటు చేసేవారికి, వీధి వ్యాపారం చేసేవారికి, భారీ వస్తువులను నిర్వహించే వారందరికీ బెస్ట్.

దీని సర్వీస్ గురించి కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారతదేశవ్యాప్తంగా టాటా మోటార్స్‌కు ఇప్పటికే ఉన్న 2,500కి పైగా అవుట్‌లెట్‌లు, విస్తృతమైన స్పేర్ పార్ట్స్ నెట్‌వర్క్, ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉన్న బాగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల బృందం వలన వాహనం యజమానులు ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

More from DriveSpark

Article Published On: Saturday, September 20, 2025, 13:02 [IST]
English summary
Tata motors cargo vehicle ace gold launched in india at rs 5 52 lakh details inside
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+