1,000 మంది కూడా ఈ టాటా కారును కొనలేదు.. రూ.5.99 లక్షల ఫ్యామిలీ కారుకు ఏమైంది?

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (TATA MOTORS) ఎప్పటినుంచో భద్రతకు ప్రతీకగా నిలుస్తూ వస్తోంది. ప్రయాణికుల రక్షణ కోసం అత్యున్నత సేఫ్టీ ప్రమాణాలను పాటించే కార్లను తయారు చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. గడచిన కాలంలో ఒకప్పుడు దేశీయ మార్కెట్లో అగ్రస్థానాన్ని సంపాదించిన టాటా, ప్రస్తుతం మాత్రం పోటీ తీవ్రత కారణంగా కొంచెం వెనుకబడింది. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి కంపెనీలు తమ అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంటే, టాటా మోటార్స్ ఇప్పుడు నాల్గవ స్థానంలో నిలవాల్సి వచ్చింది. అయితే, టాటా తన పోటీని ఎదుర్కొనేందుకు నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తోంది. ICE ఆధారిత వాహనాలకే పరిమితం కాకుండా, ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా వరుసగా మార్కెట్లోకి తీసుకువస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి కృషి చేస్తోంది.

నెక్సాన్, పంచ్, హరియర్ వంటి SUV మోడళ్లతో పాటు EV వెర్షన్లకు కూడా మంచి స్పందన వస్తోంది. సాధారణంగా టాటా కార్లకు మార్కెట్లో విశ్వసనీయత ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సక్సెస్ లో ఒక మోడల్ మాత్రం బ్రాండ్ అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్వడం లేదు. అదే టాటా టియాగో సెడాన్ వెర్షన్ టిగోర్ (Tigor). ఈ కాంపాక్ట్ సెడాన్‌కు మార్కెట్లో అంతగా ఆదరణ లభించడం లేదు.

Tata Motors Compact Sedan Tigor July 2025 Sales 968 Units Recorded

తాజా గణాంకాల ప్రకారం, జూలై 2025లో టాటా కేవలం 968 టిగోర్ యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 1,495 యూనిట్లతో పోలిస్తే 35 శాతం తగ్గుదల. ఒకప్పుడు సెడాన్ కార్ల మార్కెట్లో అవకాశాలు ఉన్నప్పటికీ, SUVలు, క్రాసోవర్ మోడళ్లు పెరుగుతున్న క్రేజ్ కారణంగా సెడాన్ డిమాండ్ పడిపోయింది. దానికి తోడు టాటా టిగోర్‌లో ప్రత్యేకంగా ఆకర్షించే ఫీచర్లు లేకపోవడం ఒక మైనస్ అయింది.

టాటా మోటార్స్‌లో అత్యల్పంగా అమ్ముడవుతున్న కారు టిగోర్ అయినప్పటికీ, ఈ కాంపాక్ట్ సెడాన్ తన డిజైన్, ఫీచర్లు, భద్రత పరంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. టాటా నుంచి స్మాల్ ఫ్యామిలీ సెడాన్ కోసం చూస్తున్న వారికి టిగోర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ధరల విషయానికి వస్తే, దీని బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలు, అదే CNG వేరియంట్ ధర రూ. 7.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tata Motors Compact Sedan Tigor July 2025 Sales 968 Units Recorded

ఈ కారు XT, XZ ప్లస్ లక్స్, XM, XZ, XZ ప్లస్ వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. బడ్జెట్‌కు తగ్గట్టుగా కస్టమర్లు ఎంపిక చేసుకోవడానికి సహకరిస్తుంది. టాటా టిగోర్‌ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఈ కారుకు ప్రధాన బలం. 86 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల ఈ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

ఇది సిటీ డ్రైవింగ్‌లోనూ, హైవేపై డ్రైవ్ చేసేటప్పుడు కూడా సులభతర అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు, CNG ఆప్షన్ కూడా ఉండటంతో, మైలేజ్‌ కోరుకునే వినియోగదారులకు ఇది నిజంగా ఒక వరంగా మారింది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి టిగోర్ CNG వేరియంట్ ఖర్చులను గణనీయంగా తగ్గించగలదు. పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.28 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.

Tata Motors Compact Sedan Tigor July 2025 Sales 968 Units Recorded

అదే, మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.3 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. CNG మాన్యువల్ వేరియంట్ లీటరుకు అద్భుతమైన 26.49 kmpl మైలేజీని అందించడం వల్ల, రోజువారీ ప్రయాణికులకు ఇది అత్యంత ఆర్థికమైన ఎంపికగా నిలుస్తోంది. ఇలా పెట్రోల్ - CNG వేరియంట్‌లలోనూ టాటా టిగోర్ తన కస్టమర్లకు మైలేజీ పరంగా సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, August 18, 2025, 14:45 [IST]
English summary
Tata motors compact sedan tigor july 2025 sales 968 units recorded more details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+