దేశంలోనే టాప్‌ సేఫ్టీ రేటింగ్‌ కార్లు లేటెస్ట్‌ ఎడిషన్‌లో వచ్చేశాయి.. సంబరాల్లో మునిగి తేలుతున్న కస్టమర్లు!

టాటా మోటార్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆటోమోబైల్ మార్కెట్లో దీనికి ఉన్న విశ్వసనీయత మరో కంపెనీకి లేదంటే అతిశయోక్తి కాదు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కంపెనీ పాపులర్ SUVలు హారియర్, సఫారీల 'స్టీల్త్ ఎడిషన్' ఆవిష్కరించింది.

ఈ కార్స్ ఫిబ్రవరి 13న అట్టహాసంగా విడుదల అయ్యాయి. కంపెనీ కొత్త సఫారీ స్టీల్త్ ఎడిషన్ మోడల్‌ను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ SUV ముంబైలోని ఒక కస్టమర్‌కు ఈ రోజు కంపెనీ డెలివరీ ఇచ్చింది. తను సంతోషంగా కారును ఇంటికి తీసుకెళ్లిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tata Motors Delivers First Safari Stealth

కొత్త సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 25.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇది సాధారణ సఫారీ SUV'అకంప్లిష్డ్ ప్లస్' వేరియంట్‌కి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఇది స్పెషల్ ఎడిషన్ కావడంతో డిజైన్ లో కొన్ని కాస్మోటిక్ మార్పులు చేశారు. ఈ టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ ఎక్సటర్నల్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పై మ్యాట్ బ్లాక్ పెయింట్ కలిగి ఉంది. దీనికి 'స్టీల్త్' బ్యాడ్జింగ్ వచ్చింది.

దీని ఇంటీరియర్ చక్కగా డిజైన్ చేసింది. కంప్లీట్ బ్లాక్ లెథరెట్ ఇంటీరియర్‌ కలిగి ఉంది. ఇందులో 7సీట్లు ఉన్నాయి. ప్రయాణీకులు సులభంగా ప్రయాణించే విధంగా పెద్ద బూట్ స్పేస్ ఇచ్చారు. కొత్త సఫారీ స్టెల్త్ ఎడిషన్ పవర్‌ట్రెయిన్‌లో కూడా పెద్ద మార్పులు చేయలేదు. ఇది ప్రస్తుత మోడల్ మాదిరిగానే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆఫ్షన్ కలిగి ఉంటుంది. ఇది 168 PS హార్స్‌పవర్, 350ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Motors Delivers

6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది లీటరుకు 15 నుండి 16 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కొత్త టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (12.3 ఇంచులు), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (10.25 ఇంచులు), వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్ వంటి వివిధ పీచర్లతో వస్తుంది.

ఇందులో సేఫ్టీ కోసం 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ప్రయాణీకుల సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. టాటా హారియర్ స్టీల్త్ ఎడిషన్ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు ధరను కంపెనీ రూ. 24.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది నార్మల్ హారియర్ ఫియర్‌లెస్ ప్లస్ వేరియంట్ లాంటిది.

Tata Motors

ఈ రెండు ఎస్‎యూవీలు కొనుగోలు చేయడానికి ఇప్పటికే చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ లను కూడా ప్రారంభించినట్లు టాటా డీలర్ షిప్ లు ధృవీకరించాయి. వీళ్లకు త్వరలోనే డెలివరీలు ఇస్తామని కంపెనీ చెబుతుంది.

Take a Poll

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 17:30 [IST]
English summary
Tata motors delivers first safari and harrier stealth edition customers overwhelmed with joy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+