ఆ కంపెనీ కార్ల కోసం షోరూమ్‌ల ముందు జనాల భారీ క్యూ.. ఒక్క రోజే 10,000 కార్ల డెలివరీ

భారతదేశంలో జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన 22వ తేదీ ఆటోమొబైల్ రంగానికి ఒక కీలక మలుపు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం, వాహనాలపై జీఎస్టీ పన్ను రేటును 28 శాతం నుంచి కేవలం 18 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా, ఇంతకు ముందు వాహనాలపై అదనంగా విధించే సెస్ కూడా తొలగించబడింది. దీని ఫలితంగా చిన్న కార్ల నుంచి మధ్యతరహా కార్ల వరకు అన్ని వర్గాల్లో ధరలు గణనీయంగా తగ్గాయి. లగ్జరీ వాహనాల విషయంలో మాత్రం 40 శాతం జీఎస్టీ పన్ను కొనసాగుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే మొత్తం వ్యయం కొంతవరకు తక్కువయ్యింది. ఈ మార్పు ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక పెద్ద ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసిన కస్టమర్లు, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన వెంటనే షోరూమ్‌లకు తరలి వచ్చారు.

కొత్త పన్ను విధానం కారణంగా ధరలు తగ్గడమే కాకుండా, పండుగ సీజన్ ఆఫర్లు కూడా జత కావడంతో కస్టమర్ల ఉత్సాహం రెట్టింపైంది. ప్రత్యేకంగా టాటా మోటార్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన మొదటి రోజే తమ వాహనాల ధరలను తగ్గించడమే కాకుండా ప్రత్యేక పండుగ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ రెండు ప్రయోజనాలు కస్టమర్లను ఆకర్షించగా, ఒకే రోజులో 10,000 కార్లను డెలివరీ చేశారు.

Tata Motors Delivery 10000 Cars In Single Day After Gst Rate Cut Details

టాటా మోటార్స్ అధికారిక ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 22న నాడు దేశవ్యాప్తంగా ఉన్న తన అధీకృత షోరూమ్‌ల నుంచి 10,000 కార్లను కస్టమర్లకు అందించింద. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, భారత ఆటోమొబైల్ రంగంలో ఒక రికార్డుగా నిలిచే ఘనత. ఒకే రోజు అంత భారీ స్థాయిలో వాహనాలను డెలివరీ చేసిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ స్థానం సంపాదించడం విశేషం.

కేవలం మొదటి రోజే 25,000 మంది కస్టమర్లు టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లను సందర్శించి వాహనాలను బుక్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. తక్కువ ధరలో వాహనం దొరకబోతుందన్న నమ్మకం, పండుగ సీజన్ ఉత్సాహంతో కలవడంతో కొనుగోలు ఉత్సాహం రెట్టింపైంది. టాటా మోటార్స్ జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ సీజన్ ఆఫర్లను కూడా ప్రకటించడం వినియోగదారులకు అదనపు లాభాన్ని అందించింది. దీంతో వాహనాల ధరలు మరింత తగ్గాయి.

Tata Motors Delivery 10000 Cars In Single Day After Gst Rate Cut Details

టాటా టియాగో ధర రూ.75,000 తగ్గడం మొదలు పెట్టి, టిగోర్ రూ.1.04 లక్షలు తగ్గింది. అదే విధంగా ఆల్ట్రోజ్‌పై రూ.1.31 లక్షల తగ్గింపు, పంచ్‌పై రూ.1.25 లక్షలు, నెక్సాన్‌పై రూ.1.55 లక్షలు, హారియర్‌పై రూ.1.48 లక్షలు, సఫారీపై రూ.1.50 లక్షల వరకు తగ్గింపులు అమలు చేయబడ్డాయి. ఈ ధరల తగ్గింపులు కేవలం సంఖ్యల ఆట మాత్రమే కాదు, కస్టమర్ల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించి వారికి వాస్తవ లాభాన్ని అందించాయి.

ఒకే రోజులో 10,000 కార్లను డెలివరీ చేయడం ఆటోమొబైల్ రంగంలో చాలా పెద్ద రికార్డ్‌గానే పరిగణించవచ్చు. సాధారణంగా ఒక బ్రాండ్ లేదా కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున వాహనాలను ఒకే రోజులో కస్టమర్ల చేతికి అందించడం అరుదు. ఈ అంచనాలు కేవలం ఆ రోజు వరకు మాత్రమే కాకుండా, రెండవ రోజు, మూడవ రోజు కూడా ఇలాగే డెలివరీలు భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Tata Motors Delivery 10000 Cars In Single Day After Gst Rate Cut Details

మొత్తం మీద, జీఎస్టీ 2.0 వాహనాల ధరలను మరింత సులభతరం చేయడంతో పాటు, వినియోగదారులలో కార్లను కొనుగోలు చేయాలనను పెంచింది. పన్ను తగ్గింపుతో వచ్చిన ఈ ఉత్సాహం పండుగ సీజన్ వాతావరణంతో కలవడంతో షోరూమ్‌లు సందడిగా మారాయి. ఈ పరిస్థితి రాబోయే నెలల్లో ఆటోమొబైల్ రంగం అమ్మకాలను మరింతగా పెంచబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2025, 12:16 [IST]
English summary
Tata motors delivery 10000 cars in single day after gst rate cut details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+