టాటా మోటార్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన కస్టమర్లు.. ఈ నెలలో పరిస్థితి మారుతుందా? కొత్త వ్యూహం అవసరమా?
ఇండియాలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను విడుదల చేయడంలో ఎంతో నమ్మకం కలిగిన దేశీయ ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) ఎప్పటికప్పుడు తన అమ్మకాల వివరాలు విడుదల చేస్తుంది. నెల ముగియగానే సేల్స్ డేటాను వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిబ్రవరి ముగిసిన తరుణంలో ఈ నెలలో కంపెనీ విక్రయించిన మొత్తం డేటాను ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం, టాటా మోటార్స్ 2025 ఫిబ్రవరి నెలలో మొత్తం 79,344 యూనిట్లను విక్రయించింది. వీటిలో దేశీయంగా విక్రయించినవే కాకుండా ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు సైతం కలిపి ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి తక్కువగా నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరిలో టాటా మోటార్స్ 86,406 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈసారి 8 శాతం తగ్గింది. భారతీయ ఆటో మార్కెట్లో టాటా కంపెనీకి బలమైన మార్కెట్ ఉంది.
అయితే ఇటీవల ఇతర కార్ల తయారీ కంపెనీలు పోటా పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా మెటార్స్ గట్టి సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎగుమతులు పక్కన పెడితే దేశీయంగా సేల్స్ కొంత తగ్గాయి. ఈ ఫిబ్రవరి నెలలో కంపెనీ లోకల్‌గా కేవలం 77,232 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అదే గత ఏడాది ఇదే నెలలో ఇవి 84,834 యూనిట్లుగా ఉన్నాయి.

సంవత్సరం ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ 9 శాతం క్షీణించాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు సమీక్ష కాలంలో 46,811 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే గత ఏడాది ఇదే సమయంలో అమ్మకాలు 51,321 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది లెక్కన 9 శాతం తగ్గాయి. వాణిజ్య విభాగంలో వాహనాల సేల్స్ 7 శాతం తగ్గి, 32,533 యూనిట్లుగా నమోదయ్యాయి.
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అమ్మకాలను చూసినట్లయితే ఫిబ్రవరి 2025లో 5,343 యూనిట్ల సేల్స్ జరిగాయి. అదే గత ఏడాది ఇదే నెలలో సేల్స్ 6,923 యూనిట్లుగా ఉన్నాయి. అయితే జనవరి 2025లో సేల్స్ 5,240 యూనిట్లతో దగ్గరగా ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అగ్రస్థానంలో ఉండేటటువంటి టాటా మోటార్స్ ఇటీవల కాలంలో మార్కెట్లో బలమైన పోటీని ఎదుర్కొంటుంది.

దీనికి పోటీగా ఇతర కంపెనీల నుంచి అత్యాధునిక ఫీచర్స్, ఆకట్టుకునే మోడళ్లు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో టాటా మోటార్స్ గట్టి సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్యాసింజర్ వెహికల్ విభాగంలో లోకల్‌గా సేల్స్ తగ్గినప్పటికి ఎగుమతులు మాత్రం సానుకూలంగానే నమోదయ్యాయి. ఫిబ్రవరి 2025లో కంపెనీ ఈ సెగ్మెంట్‌కు సంబంధించి 376 యూనిట్లను ఎగుమతి చేయగా, 2024 ఫిబ్రవరిలో ఇది కేవలం 54 యూనిట్లుగా మాత్రమే ఉంది.
టాటా మోటార్స్ ఇండియాలో పంచ్, పంచ్ EV, నెక్సాన్, నెక్సాన్ EV,టియాగో, టియాగో EV,కర్వ్, కర్వ్ EV, టిగోర్, టిగోర్ EV వంటి వాటితో పాటు ఇతర ప్రసిద్ధ కార్లను విక్రయిస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలను విడుదల చేస్తూనే మరో వైపు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం తీసుకొస్తుంది. ఈ 2025లో కంపెనీ మరిన్ని ప్రసిద్ధ మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








