5.53 లక్షల మంది కంపెనీ పేరు చూసి కొన్నారు.. ఈ బ్రాండ్‌నే ఎందుకు నమ్ముతున్నారు? అంత స్పెషల్ ఎంటి?

భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) సేల్స్ పరంగా దూసుకుపోతోంది. మార్చి నెల ముగిసిన నేపథ్యంలో వివిధ తయారీదారులు తమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. అలాగే పాత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా తన అమ్మకాల డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, మార్చి 2025లో మహీంద్రాను అధిగమించి, అమ్మకాల పరంగా మళ్లీ తన బలాన్ని నిరూపించుకుంది. దేశీయ మార్కెట్లో టాటా కార్లకు వస్తున్న ఆదరణను నిరూపిస్తూ, మార్చి 2025లో 51,616 కార్లు అమ్ముడుపోయాయి. ఇది గత నెల అంటే ఫిబ్రవరిలో జరిగిన 46,437 కార్ల అమ్మకాలతో పోలిస్తే, బాగానే వృద్ధి చెందింది.

కేవలం నెల రోజుల్లోనే 11.16 శాతం సేల్స్ పెరగడం కంపెనీకి సంతోషం కలిగించే విషయం. అదే గత ఏడాది మార్చి 2024లో మొత్తం 50,110 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది దేశీయంగా 3.01 శాతం వృద్ధి. టాటా మోటార్స్ శ్రీలంక, మారిషస్‌లలో ఎగుమతుల 256 యూనిట్లు ఎక్కువగా పెరిగాయి. ఇది గత ఏడాది 187 యూనిట్లు కాగా, ఈ సారి అది 37 శాతం వృద్ధి చెందింది.

Tata Motors Fy2025 And March Month Sales Report

ఈవీల సేల్స్ మర్చిలో 5,353 యూనిట్లతో 20.56 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో కొంత క్షీణతను ఎదుర్కొంది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 5,53,585 వాహనాలను విక్రయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం అంటే ఎఫ్‌వై 24లో 5,70,955 వాహనాలు అమ్ముడయ్యాయి. గణంకాలను చూసినట్లయితే ఇది వార్షిక ప్రాతిపదికన 3.04 శాతం తక్కువ నమోదు కావడం గమనార్హం.

2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో, అమ్మకాలు 1,46,127 యూనిట్లుగా నమోదయ్యాయి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.73 శాతం తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో విక్రయాలు కొంత తగ్గినప్పటికీ, అంతర్జాతీయంగా గణనీయమైన డిమాండ్ పెరిగింది. అందుకే కంపెనీ ఎగుమతుల విభాగంలో కొంత ఊరట నిచ్చే వృద్ధిని నమోదు చేయడం విశేషం. మార్కెట్‌లో తీవ్రమైన పోటీ, మారుతున్న కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్‌తో విడుదల చేస్తూ సక్సెస్ సాధిస్తుంది.

Tata Motors Fy2025 And March Month Sales

టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగం 2025 మార్చిలో కొంత క్షీణతను ఎదుర్కొంది. మొత్తం 41,122 యూనిట్లు విక్రయమైనప్పటికీ, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం తగ్గుదల నమోదు అయింది. ఈ తగ్గుదల కేవలం ఒక్క నెలలో మాత్రమే పరిమితం కాలేదు; నాల్గవ త్రైమాసికం, మొత్తం ఆర్థిక సంవత్సరలో కూడా ఇలాగే కనిపించింది. చిన్న వాణిజ్య వాహనాల రవాణా, పికప్ ట్రక్కుల అమ్మకాలు 17 శాతం తగ్గాయి.

అయితే కంపెనీ సానుకూల అంశం ఏమిటంటే భారీ వాణిజ్య వాహనాలు (HCV), మధ్య తరహా, తేలికపాటి మధ్యస్థ వాణిజ్య వాహనాలు (ILMCV) ట్రక్కులు అమ్మకాల్లో ఎక్కువగా వృద్ది సాధించడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో టాటా మోటార్స్ మెరుగైన సేల్స్‌ను సాధించింది. వాణిజ్య వాహనాల ఎగుమతులు 44 శాతం వృద్ధి సాధించడం టాటా మోటార్స్‌కు గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తుంది.

Tata Motors March Sales

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, టాటా మోటార్స్ అనేక ఇతర విభాగాల్లో బలమైన అమ్మకాలను చూపింది. భవిష్యత్తులో మరింత విస్తరణ ద్వారా అలాగే, కొత్త మోడళ్ల ఆవిష్కరణల ద్వారా మార్కెట్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలనే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో పలు కొత్త వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 2, 2025, 17:34 [IST]
English summary
Tata motors fy25 and march month sales report full details check here
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+