భలే ఫ్లాన్ వేసింది భయ్యా టాటా.. ఏకంగా ఛావా సినిమా హీరోను రంగంలోకి దింపేసింది! దేనికోసమో తెలుసా?
భారతీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన వాహనాల సేల్స్‌లో దూసుకుపోతుంది. తాజాగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి తయారీదారులకు బలమైన పోటీ ఇవ్వడానికి, మరిన్ని ఎక్కువ విక్రయాలను సాధించడానికి ఇప్పుడు ఒక కొత్త అడుగు వేసింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన ఛావా సినిమాలో నటించిన బాలీవుడ్ సూపర్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky kaushal )ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సినిమా దాదాపు బాక్సాఫీస్ వద్ద 750 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఆయనకు యువతలో మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. అందుకే విక్కీ కౌశల్ ద్వారా తమ వాహనాలను యువతతో పాటు కుటుంబాలకు చేరువ చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది.
టాటా-విక్కీ కౌశల్ కలయిక ఒక పెద్ద విజయం అని చెప్పాలి. ఈ భాగస్వామ్యం టాటా వాహనాల సేల్స్‌ను కొత్త మైలురాయికి తీసుకెళ్తుంది. టాటా మార్కెటింగ్ వ్యూహంలో ఇది ఒక గేమ్-చేంజర్ ప్రయత్నం అవుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం కావడంపై స్టార్ హీరో విక్కీ కౌశల్ మాట్లాడుతూ, భారతీయ ప్రజలకు ఎంతో ఇష్టమైన టాటా మోటార్స్ ప్రయాణంలో భాగం కావడం గర్వకారణం అని అన్నారు.

కొత్త ప్రచారంలో భాగంగా టెక్ ది కర్వ్‌లో విక్కీ కనిపించనున్నారు. ఈ కారు భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో అమ్మకాలలో మెరుగైన స్థానంలో కొనసాగుతుంది. రత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా కర్వ్ EV కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి కూపే-రకం ఎలక్ట్రిక్ SUV. ఇది దాని ఆకట్టుకునే ఫీచర్స్, లేటెస్ట్ ఫీచర్స్‌తో కస్టమర్లకు బాగా చేరువ అవుతుంది. దీన్ని 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ మోడల్‌గా ప్రవేశపెట్టారు.
రెండు సంవత్సరాల వెయిటింగ్ తర్వాత, కర్వ్ EV అధికారికంగా వచ్చింది. కర్వ్ EV ప్రత్యేక ఆప్షన్లు, సాంకేతికతల కారణంగా ఇతర వాహనాలకు భిన్నంగా ప్రజల నుంచి ఆదరణను సంపాదిస్తుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ 45 kWh, 55 kWh ఆప్షన్లలో లభిస్తుంది. చిన్న బ్యాటరీ ఆప్షన్ 150 bhp పవర్, 215 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అదే పెద్ద బ్యాటరీ ప్యాక్ 167 bhp పవర్, 215 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 70kW ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 40 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. రెండు వేరియంట్లలో కూడా లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉన్నాయి. దీనిలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వాయిస్ అసిస్టెంట్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా అత్యుత్తమమైన ప్రమాణాలను కలిగి ఉంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, చుట్టుపక్కల చూడటానికి 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ కీప్ అసిస్ట్ వంటి మొదలైన ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర వచ్చేసి రూ. 17.49 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ. 21.99 లక్షల వరకు ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








