టాటా మోటార్స్‌కు భారీ దెబ్బ.. అతి దారుణంగా పడిపోయిన సేల్స్.. ఎన్ని కార్లు కొన్నారంటే?
భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ పేరు ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా భారతీయ వినియోగదారులను తమ వాహనాలతో ఆకట్టుకుంటూ వస్తోంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరికీ సరపడే వాహనాలతో వినియోగదారులకు చేరువైంది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో ఈ సంస్థకు కష్టకాలం కొనసాగింది. గతనెలలో 78,159 యూనిట్ల వాహనాలను అమ్మినప్పటికీ ఇయర్- ఆన్- ఇయర్ సేల్స్ పరంగా మాత్రం ఇది 7 శాతం పడిపోయింది. ఇక ఈ సంస్థ అమ్మకాలు జనవరి నెలలో ఏ విధంగా కొనసాగాయో ఈ కథనంలో చూసేద్దాం.
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను కలుపుకుని ఈ సంస్థ ఈ జనవరి నెలలో 80,314 యూనిట్ల కార్ల అమ్మకాలు జరిపింది. అయితే.. 2024 జనవరిలో జరిగిన 86,125 యూనిట్ల విక్రయాల కంటే ఇది తక్కువే!
ఈసారి ప్యాసెంజర్ వెహికిల్(PV) విభాగంలో టాటా మోటార్స్ సంస్థ తక్కువ అమ్మకాలు నమోదు చేసింది. గత నెలలో టాటా సంస్థ 48,316 యూనిట్ల అమ్మకాలు జరపగా ఇది అంతకుముందు ఏడాదిలో జరిపిన అమ్మకాల కంటే 10.36శాతం(5,557 యూనిట్లు) తక్కువ. 2024 జనవరి నెలలో 54,033 యూనిట్లను విక్రయించిందీ సంస్థ.

ప్యాసింజర్ వెహికిల్స్ కేటగిరీలో.. దేశీయ మార్కెట్లో 48,076 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇది 2024 జనవరిలో జరిపిన 53,633 యూనిట్ల అమ్మకాల కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇక ఈ పతనం విదేశీ మార్కెట్లో కూడా కొనసాగింది. 240 యూనిట్ల సేల్స్‌తో అంతర్జాతీయ అమ్మకాల్లో ఈ నెలలో 40శాతం క్షీణత నమోదైంది. 2024లో జనవరి నెలలో అంతర్జాతీయంగా 400 యూనిట్లను విక్రయించిందీ సంస్థ.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లోనూ జనవరి నెల టాటా మోటార్స్ సంస్థకు చేదు జ్ఞాపకాలే మిగిల్చిందనే చెప్పవచ్చు. అతి పెద్ద ఈవీ పోర్ట్ ఫోలియో సంస్థగా కొనసాగుతున్నప్పటికీ.. ఈ ఏడాది జనవరి నెలలో 5,240 యూనిట్ల ఈవీలనే ఈ సంస్థ సేల్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 6,979 యూనిట్లను విక్రయించింది. ఇది 25శాతం తక్కువ కావడం గమనార్హం.

అయితే కమర్షియల్ వెహికిల్(CV) సెగ్మెంట్ మాత్రం కొంచెం ఫర్వాలేదన్నట్లుగా కొనసాగింది. హెవీ కమర్షియల్ వెహికిల్ ట్రక్కుల విక్రయాల్లో 8,990 యూనిట్ల 1శాతం వృద్ధి నమోదు అయింది. 2024 జనవరి నెలలో ఈ సంఖ్య 8,906 యూనిట్లుగా ఉంది. ఇక ఇమ్మీడియేట్ లైట్ మీడియం కమర్షియల్ వెహికిల్స్(ILMCV) ట్రక్కుల సెగ్మెంట్‌లో 5,298 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 12శాతం వృద్ధి కనబర్చింది.
2024లో ఈ సంఖ్య 4,743 యూనిట్లుగా ఉంది. ప్యాసెంజర్ క్యారియర్స్ వాహనాల్లో 4,582 యూనిట్ల 18శాతం వృద్ధితో మెరుగైన డిమాండ్ కనబడ్డప్పటికీ.. స్మాల్ కమర్షియల్ వెహికిల్ (SCV) కార్గో, పిక్-అప్ ట్రక్స్ సెగ్మెంట్ మాత్రం 15శాతం వార్షిక పతనం నమోదైంది. ఈ సెగ్మెంట్‌లో ఏడాది జనవరిలో 11,213 యూనిట్ల అమ్మకాలు జరగగా.. 2024 జనవరిలో 13,122 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

ఈ మిశ్రమ పర్ఫార్మెన్స్ కారణంగా దేశీయంగా మొత్తం CV అమ్మకాల్లో 2శాతం స్వల్ప పతనం నమోదైంది. ఈ సెగ్మెంట్‌లో 2025 జనవరి నెలలో 30,083 యూనిట్ల అమ్మకాలు జరగగా.. 2024 జనవరిలో 30,643 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
గత నెలలో PV , CV సెగ్మెంట్‌లో ప్రతికూలతలు ఎదురైనప్పటికీ.. ఈ కంపెనీ అధిక డిమాండ్ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. దీని ద్వారా సేల్స్‌లో తన సత్తా చాటాలని ఈ సంస్థ భావిస్తోంది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పో లో ఈ సంస్థ లేటెస్ట్ మోడల్స్, టెక్నాలజీని ఆవిష్కరించి ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications








