రావణుడి దేశంలో రాముడి కార్లు విడుదల.. ఎగబడి కొంటున్న జనం.. ఇంతకీ ఏంటా కంపెనీ.. ఏమా కథ ?
భారతదేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మార్కెట్ కు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో కార్లను విడుదల చేస్తుంది. సేఫ్టీ, లేటెస్ట్ ఫీచర్ల కారణంగా ఈ కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రజలు కూడా కారు కొనాలనుకుంటే ఆలోచించే ఫస్ట్ కంపెనీ టాటా మోటార్స్. ఇప్పటికే ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. తాజాగా మరో దేశంలోనూ టాటా మోటార్స్ కొన్ని మోడల్స్ లాంచ్ చేసింది.
టాటా మోటార్స్, శ్రీలంకలో టాటా మోటార్స్ ఏకైక అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయిన DIMOతో కలిసి తన కొత్త సిరీస్ ప్యాసింజర్ వాహనాలను(ఎలక్ట్రిక్ వాహనాలతో సహా) విడుదల చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ టాటా మోటార్స్ SUVలు ఎంత సక్సెస్ ఫుల్ గా విక్రయాలు జరుపుకుంటున్నాయనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శ్రీలంకలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడానికి టాటా మోటార్స్ టియాగో EVని, టాటా పంచ్, నెక్సాన్, కర్వ్‌లతో పాటు విడుదల చేసింది.

సేల్స్ అండ్ సర్వీస్: టాటా మోటార్స్ నుండి అన్ని ICE కార్లు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మూడేళ్లు లేదా 1,25,000 కి.మీ. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వస్తున్నాయి. ఇంకా, ఈవీలోని హై-వోల్టేజ్ బ్యాటరీ, మోటారుకు ఎనిమిదేళ్లు లేదా 1,65,000 కి.మీ వారంటీ అందిస్తోంది.
టాటా మోటార్స్, డిమో తన ఓనర్ షిప్ ఎక్స్ పీరియన్స్ సమయంలో టాటా మోటార్స్ నుండి శిక్షణ పొందిన టెక్నికల్ ఎక్స్ పర్ట్స్, డెడికేటెడ్ సేల్స్ కన్సల్టెంట్స్, సర్వీస్ అడ్వైజర్ల నుండి 24/7 ఎఫీషియంట్ టెక్నికల్ సపోర్ట్ నుండి కస్టమర్లు ప్రయోజనం పొందవచ్చని తెలిపాయి. అదనంగా, DIMO టాటా మోటార్స్ సిఫార్సు చేసిన సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్, స్పెషల్ టూల్స్, ఎక్విప్ మెంట్ కోసం గణనీయమైన పెట్టుబడులు పెట్టింది.

కస్టమర్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరచడానికి అన్ని రిపేర్స్, సర్వీస్ ఇండస్ట్రీ స్టాండర్స్ కు కట్టుబడి ఉంటాయి. ఇది శ్రీలంకలో అత్యంత విశ్వసనీయ ఆటోమోటివ్ భాగస్వామిగా DIMO స్థానాన్ని పెంచుతుందని టాటా కంపెనీ తెలిపింది. ఇప్పటికే అక్కడ టాటా మోటార్స్, డిమో ఆటోమోటివ్ ఎక్సలెన్స్‌లో ముందంజలో ఉన్నాయి.
కొత్త ఐసిఇ, ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను ప్రవేశ పెట్టడంతో , రెండు కంపెనీలు శ్రీలంక ఆటోమోటివ్ మార్కెట్‌లో సాటిలేని ప్రొడక్ట్స్, టెక్నాలజీ, సర్వీసులతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని డిమో పేర్కొంది. టియాగో ఈవీ(Tiago.ev) అనేది ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఇది ఇప్పటికే భారత్, నేపాల్, భూటాన్ లలో తనదైన ముద్ర వేసింది.

"మా విశ్వసనీయ భాగస్వామి అయిన డిమోతో శ్రీలంక ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త విప్లవాన్ని సృష్టించగలం. అందరికీ అసాధారణమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తామని నమ్మకంగా ఉన్నాం" అని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ యష్ ఖండేల్వాల్ అన్నారు. మార్కెట్ తిరిగి ఓపెన్ అయిన తర్వాత శ్రీలంకలోకి ప్రవేశించిన మొదటి ప్యాసింజర్ వాహన బ్రాండ్ టాటా మోటార్స్.
ఈ కంపెనీ సరికొత్త ICE, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి ఆటోమొబైల్ రంగంలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అత్యంత తక్కువ ధరలకు ఇన్నోవేషన్, సేఫ్టీ, స్టెబిలిటీ కలిగి ఉంటుంది. శ్రీలంక వినియోగదారులకు అత్యుత్తమ సర్వీసులను అందించడంలో ఎల్లప్పుడు ముందుంటామని, కస్టమర్లకు అండగా ఉంటామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ పండిట్ తెలిపారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








