జనాల అభిమానం మారిందా? రతన్ టాటా కంపెనీకే షాక్ ఇచ్చారు.. పడిపోయిన సేల్స్

మే నెల ముగిసి ఇప్పుడు జూన్ నెలలోకి వచ్చాము. కొత్త నెల ప్రారంభంతో ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి తయారీదారులు తమ అమ్మకాలను విడుదల చేస్తుంటారు. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా మే నెలకు సంబంధించిన విక్రయాల నివేదికను ప్రకటించింది. ఈ నివేదికలో స్పష్టంగా ఒక మార్పు కనిపిస్తుంది. 2024 మేతో పోలిస్తే, 2025 లో ఇదే నెలలొ టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కొంత తగ్గుదల చూసింది. గడిచిన ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,697 కార్లను విక్రయించగా, ఈ ఏడాది మే నెలలో ఈ సంఖ్య 41,557కి మాత్రమే పరిమితమైంది. అంటే, టాటాకు దేశీయ అమ్మకాల పరంగా ఈసారి కొంత వెనకడుగు వేసినట్లు చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో అమ్మకాలు తగ్గినప్పటికీ, టాటా మోటార్స్ ఎగుమతుల పరంగా మంచి గణంకాలను సాధించింది.

టాటా మోటార్స్ ఈ సమీక్ష నెలలో 483 కార్లను ఎగుమతి చేసింది. అదే 2024 మేలో 378 కార్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇది గతేడాది కంటే మెరుగైన సంఖ్యలు. దేశీయంగా అమ్మకాలు తగ్గినప్పటికి అంతర్జాతీయంగా మాత్రం కంపెనీ వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయని దీనర్థం. దేశీయంగా కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం అమ్మకాల పరంగా కూడా కంపెనీకి ఈసారి క్షీణత తప్పలేదు.

Tata Motors May 2025 Sales 11 Percent Down

మే 2024లో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో 46,697 కార్లను విక్రయించగా, 378 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ రెండు కలిపితే మొత్తం 47,075 కార్లు అమ్ముడయ్యాయి. కానీ మే 2025లో ఈ గణాంకాలు తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా 41,557 కార్లు మాత్రమే విక్రయించగలిగిన టాటా, ఎగుమతులలో మాత్రం కొంత మెరుగుదలతో 483 కార్లను పంపింది. అయినప్పటికీ, మొత్తం అమ్మకాల పరంగా ఇది 42,040కి మాత్రమే చేరుకుంది.

ఇది దాదాపు 11 శాతం తగ్గుదల, ఇది టాటా మోటార్స్‌కి ఆందోళన కలిగించే పరిణామం. దేశీయంగా కస్టమర్ల నమ్మకాన్నిపెంచుకోవాల్సిన అవసరం కంపెనీకి స్పష్టంగా ఎదురవుతోంది. ప్రత్యేకించి SUV విభాగంలో పెరుగుతున్న పోటీకి తట్టుకోగల ఉత్సాహం టాటా మోడళ్లలో కనిపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏమిటంటే, మహీంద్రా అండ్ మహీంద్రా తన దూకుడు కొనసాగిస్తూ, మే 2025లో కూడా టాటాను మళ్లీ వెనక్కు నెట్టింది.

Tata Motors Sales

మే నెలలో మహీంద్రా 52,431 కార్లను విక్రయించి మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టాటా మాత్రం, దేశీయ మార్కెట్లో కేవలం 41,557 కార్ల అమ్మకాలతో రెండవ స్థానానికి పరిమితమైంది. ఈ పరిణామాల మధ్య, టాటా మోటార్స్ తన మార్కెట్ పట్టు తిరిగి సాధించాలంటే కొత్త మోడళ్ల విడుదల, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, మరింత ఆకర్షణీయమైన ధరలు వంటి మార్గాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఏప్రిల్ 2025 నుంచే ఆటోమొబైల్ రంగంలో ఉన్న పోటీ పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపించాయి. టాటా మోటార్స్ ఏప్రిల్‌లో కేవలం 45,199 కార్లను విక్రయించగలిగింది. అదే సమయంలో, మహీంద్రా కంపెనీ మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తూ 52,330 కార్లను విక్రయించడం విశేషం.

Tata Motors May 2025 Sales 11 Percent Down

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2025, 12:50 [IST]
English summary
Tata motors may 2025 sales 11 percent down compared to previous
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+