టాటా కార్ల మార్కెట్లో‌ మంట పెట్టేసింది! ప్రత్యర్థులను భయపట్టేలా సరికొత్త కారును దింపుతుంది

ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే టాటా మోటార్స్ నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. టాటా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2025 మోడల్‌ ఆల్ట్రోజ్‌ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. 2020లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, 2021లో డార్క్ ఎడిషన్‌ను పొందిన తర్వాత ఇదే మొదటి సారి డిజైన్ పరంగా ఓ ప్రధాన అప్‌డేట్‌ను పొందుతోంది. ఈ సారి టాటా ఆల్ట్రోజ్ మరింత శక్తివంతమైన, అదిరిపోయే విధంగా మన ముందుకు వస్తుంది. డిజైన్ పరంగా చాలా అపడేట్స్ ఉన్నాయి. పూర్తిగా మారిన బాడీ లైన్లు, బోల్డ్ 3D ఫ్రంట్ గ్రిల్ దీనికి స్పోర్టీ గంభీరతను అందిస్తున్నాయి.

ముఖ్యంగా, కొత్తగా పరిచయం చేసిన లూమినేట్ LED హెడ్‌లాంప్స్ ముందు భాగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అంతే కాదు, వెనుక భాగంలో ఇన్ఫినిటీ కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లాంప్స్ ఆకట్టుకుంటాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కొత్తగా కనిపిస్తుండగా, నిలువుగా అమర్చిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో కొత్త ఫ్రంట్ బంపర్ మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. వీటికి అనుగుణంగా, కొత్త ఐదు స్పోక్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ ఫినిష్‌ను జోడిస్తున్నాయి.

Tata Motors New Altroz 2025

టాటా మోటార్స్ ప్రకారం, కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను 2025 మే 22న అధికారికంగా మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ డిజైన్ అప్‌డేట్‌ మార్కెట్లో అత్యుత్తమ స్టైలింగ్‌కు పోటీగా నిలిచేలా కనిపిస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ఆల్ట్రోజ్ ఇప్పటి వరకు ఉన్న మోడల్ కంటే మరింత ఫ్యూచరిస్టిక్, ప్రీమియం రూపాన్ని సంతరించుకుంది. టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ లైనప్‌లో కొత్త శకం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఈ మోడల్ స్పష్టంగా చూపిస్తోంది.

2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పటి వరకు ప్రీమియం సెగ్మెంట్లో మాత్రమే కనిపించే అనేక సౌకర్యాలు ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఇప్పుడు లభిస్తున్నాయి, ఇది తన క్లాస్‌లో అసాధారణ స్థాయిలో నిలుస్తోంది. ఇది ఇప్పుడు 360-డిగ్రీ కెమెరా సదుపాయంతో వస్తుంది, ఇది పార్కింగ్‌ను ఎంతో సులభతరం చేస్తుంది. అంతేకాదు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్‌ కూడా ఇందులో భాగంగా ఉంది.

Tata Motors New Altroz

దీని వల్ల రోడ్డుపై ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. iRA కనెక్ట్ చేయబడిన వెహికల్ టెక్నాలజీ ద్వారా యూజర్లు తమ ఫోన్ ద్వారా కారును మానిటర్ చేయడం, ట్రాక్ చేయడం వంటి అనేక పనులను చేయగలుగుతారు. ఇంతకేకాకుండా, ఎయిర్ ప్యూరిఫైయర్ వలన కేబిన్‌లో ఎప్పుడూ శుభ్రమైన గాలి లోపలికి వస్తుంది. వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఇవ్వడం ద్వారా కారుపై అంచనాలు పెరిగిపోయాయి.

దీనికి తోడు, యాంబియంట్ లైటింగ్ ఇంటీరియర్‌కు ప్రత్యేకమైన లుక్‌ను కలిగిస్తుంది. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఆల్ట్రోజ్‌‌లో 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, ట్విన్-సిలిండర్ పెట్రోల్-CNG బై-ఫ్యూయల్ వేరియంట్ ఉన్నాయి. అలాగే, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది, ఇది డీజిల్ లవర్స్‌కు మళ్లీ ఒక మంచి అవకాశం అవుతుంది.

New Altroz 2025 Facelift Launch

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2025, 17:20 [IST]
English summary
Tata motors new altroz 2025 facelift will launch on may 22 all top things details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+