టీజర్ విడుదలతో పెరిగిన అంచనాలు.. బడ్జెట్ రెడీ చేసుకోండి.. అదిరిపోయే టాటా కొత్త కారు వచ్చేస్తుంది!
దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొవడానికి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త కస్టమర్లకు మరింత చేరువ కావడానికి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు చేసింది. ఈ కొత్త కారు కంపెనీ అమ్మకాలను పెంచడానికి కీలకం కానుంది. దీనికి సంబంధించిన మొదటి టీజర్‌ను మే 22న విడుదల చేసింది. ఈ టీజర్‌తో పాటు, ధర ప్రకటనకు ముందు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై కొంత స్పష్టత వచ్చింది.
టాటా ఆల్ట్రోజ్ 2020 జనవరిలో మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి కాస్మెటిక్ మార్పులు రాలేదు. ఈ నేపథ్యంలో, టాటా సంస్థ ఇప్పుడు దీన్ని మరింత లేటెస్ట్‌గా మార్చి తీసుకురాబోతుంది. టాటా కార్లను అభిమానించే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ కొత్త పవర్‌ట్రెయిన్‌తో, ప్రస్తుతం కాలంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో విడుదల కాబోతుంది.

ఇంజిన్ పరంగా మార్పులు ఉన్నప్పటికి యాంత్రికంగా దీని నిర్మాణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కాకపోతే ఎక్స్‌టీరియర్‌లో దీని లుక్‌ను మరింత అందంగా మార్చడంలో సహయపడటానికి స్వల్పంగా మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది. అంతర్గతంగా కూడా కొత్త టెక్నాలజీ ఫీచర్లు, ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా కనిపించే అవకాశముంది. ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్ ఐదు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
మొదట 88 hp కెపాసిటీ కలిగిన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇది కలిగి ఉండగా, దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. అదే సమయంలో, ఇతర ఇంధన ఆదారిత వేరియంట్లను కోరుకునే వారి కోసం, టాటా 73.5 hp కెపాసిటీ కలిగి ఫ్యాక్టరీ-ఫిట్ CNG వేరియంట్‌ను అందిస్తోంది. డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి దీనిలో కూడా లభిస్తుంది.

మరోటి 90 hp కెపాసిటీ ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. అయితే, CNG, డీజిల్ వేరియంట్లు మాత్రం కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే కొనుగోలు చేయడానికి లభిస్తాయి. పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టాప్-స్పెక్ ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌లో, 120 hp కెపాసిటీ గల 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది.
ఇది టాటా నెక్సాన్‌లో కనిపించే ఇంజిన్‌తో సమానంగా ఉండటంతో, అధిక శక్తి,, సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడి ఉంటుంది. అయితే రాబోయే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా ఈ ఐదు పవర్‌ట్రెయిన్ ఎంపికలే కొనసాగించే అవకాశముంది. టీజర్ విడుదలతో ఈ కారుపై ప్రస్తుతం అంచనాలు భారీగా పెరిగాయి. తాజా టీజర్ వీడియో ఆధారంగా చూస్తే, రాబోయే ఆల్ట్రోజ్‌లో భారీ మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఉన్న స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌ను కొనసాగిస్తూ, కొత్త Ledగా మార్చారు. వీటికి తోడుగా LED డేటైమ్ రన్నింగ్ లాంప్ (DRL) సిగ్నేచర్ కూడా అందించబడుతోంది, ఇది కారుకు ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తోంది. ఫ్రంట్ బంపర్ కూడా పూర్తి కొత్తగా కనిపిస్తుంది. గ్రిల్ డిజైన్ మరింత స్పష్టత, స్పోర్టీనెస్‌కు దగ్గరగా ఉంటుంది. T మోటిఫ్ డిజైన్‌తో కూడిన LED టెయిల్ లాంప్స్, LED లైట్ బార్ ఆల్ట్రోజ్‌కు వెనుక లుక్‌ను పెంచుతున్నాయి.
వెనుక బంపర్ ఇప్పుడు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. అల్లాయ్ వీల్స్ కోసం కొత్తగా రూపొందించిన EV-ఇన్‌స్పైర్డ్ డిజైన్ కలిగి ఉన్నాయి. ఇంటీరియర్ భాగంలోనూ టాటా మోటార్స్ అప్‌గ్రేడ్‌లు చేసింది. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లు కూడా ఈ కారులో కనిపించనున్నాయి.


Click it and Unblock the Notifications








