డజన్ల కొద్ది ఫీచర్స్, అదిరిపోయే డిజైన్‌తో టాటా కొత్త కార్లు వచ్చేశాయ్.. ఈ కొత్త ఎడిషన్ లుక్ మాములుగా లేదు!
ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో ఇండియాలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్(tata motors) 2025 ఏడాదిలో తన హవాను చూపించడానికి సిద్ధమైంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ఈవెంట్‌లో రెండు SUVలు హారియర్ స్టీల్త్ ఎడిషన్ ( Harrier Stealth Edition), సఫారీ స్టీల్త్ ఎడిషన్ (Safari Stealth Edition) మోడళ్లను ఆవిష్కరించగా, ఇప్పుడు వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇదే ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ నెక్సాన్ EV, సఫారీ, హారియర్ బందీపూర్ ఎడిషన్‌లను కూడా ప్రదర్శించింది. ఇవన్నీ కూడా సందర్శకులను బాగా ఆకట్టుకున్నాయి. వీటిలో సఫారీ, హారియర్ స్టీల్త్ ఎడిషన్లను తాజాగా కస్టమర్ల చెంతకు తీసుకువచ్చింది.
టాటా హారియర్ స్టీల్త్ ఎడిషన్ ధర రూ. 24.85 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 5 మంది కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. దీన్ని ఫియర్‌లెస్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది ప్రధానంగా కస్టమర్లకు రెండు వేరియంట్ల ఆప్షన్లలో లభిస్తుంది. హారియర్ ఫియర్‌లెస్+ స్టీల్త్ ఆటోమెటిక్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.26.49 లక్షలుగా ఉంది.

అదే హారియర్ ఫియర్‌లెస్+ స్టీల్త్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ.25.09 లక్షలుగా ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. ఇది బోల్డ్ లుక్‌తో కనిపిస్తుంది. దీని ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ కార్బన్ నోయిర్ థీమ్‌తో వస్తుంది. మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్ కారుకు అందంగా కనిపిస్తుంది. ఎక్స్‌టీరియర్‌ను మరింత ఆకట్టుకునే విధంగా మార్చడంలో 19-అంగుళాల మ్యాట్ బ్లాక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణ.
డజన్ల కొద్ది ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు. క్యాబిన్‌లో ప్రయాణికులకు అవసరమయ్యే అన్ని సదుపాయాలు ఉంటాయి. వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ సెటప్‌తో పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్‌లు, ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి లెవల్-2 ADAS వంటి ఫీచర్లను కూడా ఈ కారులో అందిచారు.

ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, స్టీల్త్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ లాగానే దీనిలో కూడా అదే విధమైన సెటప్‌ను ఇచ్చారు. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 168 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు.
చివరగా, టాటా సఫారీ స్టీల్త్ ఎడిషన్ గురించి తెలుసుకోవాలంటే, దీన్ని అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ ఆధారంగా నిర్మించారు. అకంప్లిష్డ్+ స్టీల్త్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.25.74 లక్షలుగా ఉంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.27.14 లక్షలు. అలాగే, 6 సీట్ల ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 27.24 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. సఫారీలో ఉన్నట్లుగానే అదే ఇంజిన్ సెటప్‌ను దీనిలో కూడా అందించారు.

టాటా సఫారీ స్టీల్త్ ఎడిషన్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 168 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా బ్లాక్ లెథరెట్ ఇంటీరియర్ థీమ్, మ్యాట్ బ్లాక్ ఎక్స్టీరియర్‌తో వస్తుంది. అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి కూడా అత్యుత్తమ ప్రమాణాలు ఉన్నాయి. ఈ రెండు కార్లు కూడా లోపల డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో వచ్చాయి.


Click it and Unblock the Notifications








