దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు.. సేల్స్ కౌంటర్ వద్ద భారీ క్యూ! అత్యంత సేఫెస్ట్ కారుకు ఫుల్ క్రేజ్

టాటా మోటార్స్ నెక్సాన్ (Tata Motors Nexon) నవంబర్ నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగా సంచలనం సృష్టించింది. సంవత్సరాల తరబడి మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాలు ఆధిపత్యం చెలాయిస్తోన్న అత్యంత పోటీభరితమైన సెగ్మెంట్‌లో, నెక్సాన్ వరుసగా మూడో నెల కూడా టాప్ స్థానాన్ని కాపాడుకోవడం చిన్న విషయం కాదు. భారతీయ కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు, మార్కెట్ దిశ ఏమిటి, నమ్మకం ఎక్కడికి మారుతోంది అన్న ప్రశ్నలకు నెక్సాన్ అమ్మకాలు స్పష్టమైన సమాధానమే ఇచ్చాయి. తాజాగా విడుదలైన సేల్స్ గణంకాల ప్రకారం, నవంబర్ నెలలో నెక్సాన్ 22,434 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇది అక్టోబర్‌లో నమోదైన 22,083 యూనిట్లతో పోలిస్తే వృద్ధిగా చెప్పవచ్చు.

ఇది స్వల్ప స్థాయిలో పెరుగుదల అయినప్పటికి కాలం మారుతున్న మార్కెట్లో నెక్సాన్ కారుకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదని ఈ సంఖ్యలను చూస్తేనే అర్థం అవుతుంది. అలాగే, ఇది సెప్టెంబర్‌లో సాధించిన 22,573 యూనిట్ల అమ్మకాలతో సహజమైన కొనసాగింపే. వరుసగా మూడు నెలలు 22,000 యూనిట్లకు పైగా అమ్మకాలు జరగడం, అత్యంత కఠినమైన 4 మీటర్ల లోపు SUV మార్కెట్‌లో నెక్సాన్ గొప్ప స్థిరత్వంతో ముందుకు సాగుతోందని చూపిస్తోంది.

Tata Motors Nexon November 2025 Sales Recorded 22434 Units More Details

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 4 మీటర్ల సెగ్మెంట్‌ చాలా కాలంగా మారుతి సుజుకి ఆధీనంలో ఉన్నది. బ్రేజా, ఫ్రోనెక్స్‌ల వంటి ప్రాచుర్యం పొందిన మోడళ్లను వెనక్కి నెట్టి నెక్సాన్ మూడు నెలలు వరుసగా నెంబర్ వన్‌గా నిలవడం టాటా మోటార్స్‌కు అపూర్వ విజయమే. ఇది కేవలం ఒక మోడల్ గెలుపు కాదు... భారతీయ కస్టమర్ అభిరుచుల్లో చోటు చేసుకుంటున్న నిశ్శబ్ద మార్పు కూడా.

మరో కీలక విషయం ఏమిటంటే, ఇది వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలవడం.. FY22లో నెక్సాన్ 1.24 లక్షల యూనిట్లు, తర్వాతి సంవత్సరం FY23లో దాదాపు 1.72 లక్షల యూనిట్ల భారీ అమ్మకాలు, FY24లో కూడా 1.71 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. FY25లో అమ్మకాలు 1.63 లక్షల యూనిట్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ, FY26కి వచ్చినప్పుడు సంవత్సరం ముగియకముందే 1.30 లక్షల యూనిట్ల మార్క్‌ను దాటేసింది.

Tata Motors Nexon November 2025 Sales Recorded 22434 Units More Details

ఈ కారు బడ్జెట్ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.7.32 లక్షల నుండి రూ. 14.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ పెట్రోల్+CNG ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. వేరియంట్‌ను బట్టి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ను జత చేశారు. మైలేజ్ విషయానికి వస్తే ఇది 17 నుండి 24 kmpl వరకు ఇస్తుంది.

ఈవీ వెర్షన్‌లో కూడా లభిస్తున్న ఈ కారు ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.49 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. బ్యాటరీ పనితీరు విషయానికి వస్తే, నెక్సాన్ EV 30 కిలోవాట్ (kWh), 45 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 275 నుండి 489 కి.మీ. పరిధిని అందిస్తుంది. ప్రధానంగా నెక్సాన్ కారు ఇండియాలో అత్యంత సేఫ్టీ అందించే వాటిలో మొదటి స్థానంలో ఉంటుంది.

Tata Motors Nexon November 2025 Sales Recorded 22434 Units More Details

భారత్ NCAPలో ICE వెర్షన్‌ అయినా, ఎలక్ట్రిక్ వెర్షన్‌ అయినా, రెండూ 5 స్టార్ రేటింగ్ సాధించడం నెక్సాన్‌కు ఒక పెద్ద మైలురాయి. ఇది కేవలం టెస్ట్‌లో పొందిన మార్క్ మాత్రమే కాదు... రోడ్డుపైన ఆ కారు మీ కుటుంబాన్ని ఎంతగా కాపాడగలదో నిరూపణ కూడా. నెక్సాన్‌ బాడీ నిర్మాణం, ప్రమాదం సంభవించినప్పుడు కేబిన్‌ స్ట్రక్చర్‌ డిస్టార్ట్‌ కాకుండా ప్రయాణికులకు సేఫ్ జోన్‌ను కల్పించడం నెక్సాన్‌ను మరింత విశ్వసనీయంగా నిలబెడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 3, 2025, 15:23 [IST]
English summary
Tata motors nexon november 2025 sales recorded 22434 units more details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+