ఈ ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు! టాటా ఎలక్ట్రిక్ కార్లపై లక్ష రూపాయల వరకు తగ్గింపు.. వివరాల కోసం షోరూమ్‌కు వెళ్లండి
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మాములుగా లేదు. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కార్ల తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ విభాగంలో భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పటికే పలు ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ త్వరలో మరిన్ని మోడళ్లను విడుదల చేయడానికి ప్రయాత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే, మార్కెట్లో ఈవీ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని నిలుపుకోవడానికి మార్చి, 2025లో ప్రత్యేకంగా కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు టాటా మోటార్స్ అందిస్తుంది. తన ప్రసిద్ధ టియాగో(Tiago) EV హ్యాచ్‌బ్యాక్‌పై దాదాపు లక్ష రూపాయాల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఇస్తుంది. 2024, 2025 మోడళ్లపై వేర్వేరు తగ్గింపులు ఉన్నాయి. తక్కువ ధరలో కొత్త ఈవీ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.
2024 టియాగో ఈవీ కారుపై రూ.85,00 వరకు తగ్గింపు ఉంది. అలాగే, అదనంగా రూ. 15,000 వరకు గ్రీన్ బోనస్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. మొత్తంగా కలపి ఈ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అదే 2025 టియాగో ఈవీపై రూ.40 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. దేశంలో బాగా డిమాండ్ ఉన్న టాటా నెక్సాన్‌పై రూ. 40,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి.

అయితే మరో కీలక విషయం ఏమిటంటే ఈ తగ్గింపు 2024 మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. వీటిలో ఎక్స్ఛేంజ్ బోనస్, గ్రీన్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటివి ఉన్నాయి. నెక్సాన్ ఈవీ అన్ని బ్యాటరీ ఆప్షన్స్, ట్రిమ్‌లలో అన్ని వేరియంట్లపై తగ్గింపు ఉంది. అదే 2025 మోడల్‌పై మాత్రం కంపెనీ ఎలాంటి డిస్కౌంట్ అందించడం లేదు. టాటా మోటార్స్ ఈవీ కార్ల విభాగంలో ఇండియాలో నెక్సాన్ కారుకు బాగా డిమాండ్ ఉంటుంది.
టాటా మోటార్స్ తన చిన్న ఎలక్ట్రిక్ కారు అయినటువంటి పంచ్ కారుపై ఈ నెలలో ప్రత్యేకంగా రూ.90 వేల వరకు తగ్గింపును అందిస్తుంది. ఇండియాలో పంచ్ ఒక ప్రసిద్ధ SUV. 2024 మోడల్ 70,000 వరకు తగ్గింపుతో పాటు అదనంగా రూ. 20,000 గ్రీన్ బోనస్ అందుబాటులొ ఉంది. దీంతో మొత్తం ప్రయోజనాలు రూ.90 వేలుగా ఉన్నాయి. టాటా పంచ్ SUV చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లలో కర్వ్ కారుకు దేశీయ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇది ఒక ఎలక్ట్రిక్ SUV కూపే. మార్చి 2025 ఆఫర్‌లో భాగంగా టాటా మోటార్స్ ఈ కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది. ఈ మొత్తంలో నేరుగా రూ. 30,000 తగ్గింపుతో పాటు రూ.20,000 లాయల్టీ బోనస్ ఉంది. ఈ ఆఫర్ 2024 కర్వ్ ఈవీ మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది.
2025 మోడళ్లపై మాత్రం ఎలాంటి ఆఫర్ అందుబాటులో లేదు. కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నవారు టాటా మోటార్స్ ప్రత్యేకంగా అందిస్తున్న ఈ ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలో అదిరిపోయే టాటా కార్లను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యగమనిక ఏమిటంటే, ఈ ఆఫర్స్ ధరలు ప్రాంతాలు, నగరాలను బట్టి మారుతాయి, అందుకే మరింత స్పష్టమైన వివరాల కోసం దగ్గరలోని టాటా మోటార్స్ షోరూమ్‌లో సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నాం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








