టాటా బంపర్ ఆఫర్.. ఆ కార్లపై రూ.1.50 లక్షల తగ్గింపు.. షోరూమ్‌కి వెంటనే పరిగెత్తండి!

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత సురక్షితమైన కార్లను అందించడంలో ప్రసిద్ధి గాంచిన వాహన కంపెనీ ఏదని అడిగితే ప్రతిఒక్కరు కూడా టాటా మోటార్స్ (tata motors) పేరు చెబుతారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ రేటింగ్‌లను సాధించి, "సేఫ్ కార్ అంటే టాటా కదా" అనే నమ్మకాన్ని భారతదేశానికి కలిగించిన బ్రాండ్‌ టాటానే. ఆకట్టుకునే ఇంటీరియర్‌లు, టెక్నాలజీ ఫీచర్లు, ప్రీమియం ఫినిషింగ్ పరంగా టాటా కార్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. మహీంద్రా, హ్యుందాయ్, కియా లాంటి గట్టి పోటీదారులు ఉన్నప్పటికి కూడా వారిని బలంగా ఎదుర్కొని అమ్మకాల్లో మెరుగైన గణంకాలను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ఏప్రిల్ నెలలో తన కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు ఇస్తుంది.

2025 ఏప్రిల్‌లో టాటా మోటార్స్ కస్టమర్లకు భారీ ఊరటనిచ్చేలా భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల కంపెనీ రూ.1.50 లక్షల వరకు రాయితీలు, డిస్కౌంట్లు అందిస్తోంది. ప్రత్యేకించి. రూ. 85,000 వరకు ప్రత్యక్ష వినియోగదారుల డిస్కౌంట్, రూ. 50,000 వరకు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ ఉంది. 2024 మోడల్ కార్ల స్టాక్‌ను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో, పాత మోడళ్లను కొంటున్న వారికి లక్షల రూపాయల విలువైన ప్రయోజనాలు లభించబోతున్నాయి.

Tata Motors Offers Upto rs 1 50 lakh Discount On Punch

2024 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన టాటా పంచ్‌పై కూడా ఆఫర్ ఉంది. ఏప్రిల్ 2025 నెలకు సంబంధించి, టాటా ముఖ్యంగా MY24 స్టాక్‌పై రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా పంచ్ కారుపై రూ. 25,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇది 2024,2025 మోడళ్లకు వర్తిస్తుంది. పెట్రోల్, CNG ఇంజిన్ అన్ని వేరియంట్‌లపై ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

టాటా టియాగో కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన టియాగో 2024 మోడల్‌పై కంపెనీ గరిష్టంగా రూ.35,000 వరకు తగ్గింపు ఇస్తుంది. ఇది అన్ని పెట్రోల్, CNG వేరియంట్లపై ఉంది. టాటా బేస్ XE వేరియంట్ మినహా అన్ని వేరియంట్లపై రూ.25,000 తగ్గింపును అందిస్తుంది. టిగోర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెలలో రూ.45,000 విలువైన తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి.

Tata Motors Offers Upto rs 1 50 lakh Discount On Nexon

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లపై రూ. 1.35 లక్షల వరకు ఆఫర్స్ ఉన్నాయి. నాన్-రేసర్ వేరియంట్లపై గరిష్టంగా రూ.1 లక్ష తగ్గింపు లభించనుండగా, స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకునే ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌పై రూ.1.35 లక్షల వరకు ఆఫర్ పొందొచ్చు. 2025 వెర్షన్ల ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లపై రూ.45,000 వరకు తగ్గింపు లభించనుండటం కొనుగోలుదారులకు అదనపు ఊరటను కలిగిస్తోంది.

కాంపాక్ట్ SUV అయిన నెక్సాన్ కొనుగోలుపై ప్రస్తుతం ప్రత్యేకంగా 2024 స్టాక్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, ఇంకా ఇటీవల విడుదలైన CNG వేరియంట్లపై రూ.35,000 వరకు నేరుగా తగ్గింపు లభిస్తోంది. అదనంగా రూ.10,000 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్, స్క్రాప్ బోనస్ కూడా ఉంది. అంటే మొత్తం తగ్గింపు ప్రయోజనాలు ₹45,000 వరకూ చేరనున్నాయి. 2025 మోడల్ నెక్సాన్‌‌పై రూ.15,000 వరకు డిస్కౌంట్‌ ఉంది.

Tata Motors Offers Upto rs 1 50 lakh Discount On Tiago

టాటా కర్వ్ 2024 మోడల్‌పై రూ.30,000 వరకు తగ్గింపు ఉంది. దీనిలో స్క్రాపేజ్ ఎక్స్ఛేంజ్ ఉండవు. టాటా హారియర్, సఫారీలపై రూ.75,000 వరకు ప్రయోజనాలను ఉన్నాయి. 2024 వెర్షన్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 75,000 వరకు, 2025 వెర్షన్ హారియర్ అన్ని వేరియంట్లపై రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది. వీటితో మరిన్ని మోడళ్లపై తగ్గింపు ఉంది. ఈ ఆఫర్స్ గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, April 6, 2025, 10:00 [IST]
English summary
Tata motors offers upto rs 1 50 lakh discount on punch altroz nexon more details here
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+